Latest Updates
-
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు!
బెడ్రూమ్ సీక్రెట్ చెప్పిన చాణక్యుడు!..పడుకునే ముందు జంటలు ఏం చేయాలంటే..
పెళ్లయిన కొత్తలో ఉన్న ప్రేమ, పెళ్లి పాతబడే కొద్దీ కరిగిపోతుందంటారు. కాలం గడిచేకొద్దీ బాధ్యతలు, ఒత్తిళ్ల మధ్య దంపతుల మధ్య దూరం పెరుగుతుందని భావిస్తారు. కానీ, ప్రపంచ ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త ఆచార్య చాణక్యుడు ఈ వాదనను ఖండిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారం దంపతులు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే వారి మధ్య ప్రేమ కాలంతో పాటు తగ్గడం కాదు, రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా పడకగదిలో పాటించాల్సిన కొన్ని సూత్రాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ప్రతి జంట తమ జీవితంలో భాగం చేసుకోవాల్సిన 5 కీలక పనులు ఏవో,చాణక్యుడు ఏం చెప్పాడో ఇక్కడ చూడండి.
కలిసి భోజనం
రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపినా నైట్ డిన్నర్ మాత్రం జంటగా కలిసి చేయాలి. ఇది కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు మనసులను కూడా నింపుతుంది. వీలైతే, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కూర్చోవడం వల్ల మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇలా చేయడం వల్ల పరస్పర గౌరవం, ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ వ్యక్తమవుతాయి.

మాటల తోటలో విహారం
రోజంతా ఆఫీసు పనులతో, ఇంటి బాధ్యతలతో అలసిపోయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం దొరకకపోవచ్చు. కానీ నిద్రపోయే ముందు కనీసం పది నిమిషాలైనా ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవాలి. ఆ రోజు జరిగిన విశేషాలు, మీ భావాలు, సంతోషాలు పంచుకోవడం వల్ల మీ మధ్య మానసిక బంధం దృఢపడుతుంది. ఒకరికొకరు తోడుగా ఉన్నామనే భరోసా కలుగుతుంది.
సమస్యలకు చెవి ఇవ్వండి
భార్యాభర్తల బంధంలో ఒకరి సమస్యను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భార్య తన మనసులోని బాధను, అది అత్తమామల వల్ల కావచ్చు లేదా మరేదైనా కావచ్చు మీతో పంచుకోవాలని ప్రయత్నించినప్పుడు భర్త ఓపిగ్గా వినాలి. ఆమె సమస్యను విని దానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయడం భర్త బాధ్యత. ఇది ఆమెకు మీరున్నారనే ధైర్యాన్ని, భద్రతా భావాన్ని ఇస్తుంది.
కోరికలను గౌరవించండి
మీ భాగస్వామి కోరికలను, ఇష్టాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. చిన్న చిన్న కోరికలను తీర్చడం, వారి ఇష్టాలను గౌరవించడం వల్ల వారి మనసులో మీపై ప్రేమ పెరుగుతుంది. నిర్లక్ష్యం బంధంలో చీలికలకు దారితీస్తుంది. కాబట్టి ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించుకోవాలి.
ఆత్మీయ ఆలింగనం
బెడ్ రూమ్ లోకి ప్రవేశించాక మాటలతో పాటు స్పర్శ కూడా బంధాన్ని బలపరుస్తుంది. ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకోవడం వల్ల రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి మాయమవుతాయి. ఈ చిన్న ఆలింగనం మీ మధ్య ప్రేమను పెంచి, అనురాగాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది సంబంధానికి కొత్త శక్తిని ఇస్తుంది.
ప్రేమ ఉన్నచోటే లక్ష్మీ నివాసం
చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా, ప్రేమగా ఉంటారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా కొలువై ఉంటుంది. కలహాలు, వాదనలు లేని ప్రశాంత వాతావరణంలోనే సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.



Click it and Unblock the Notifications