Latest Updates
-
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ఆడపిల్ల తండ్రికి ఉండాల్సిన లక్షణాలు.. చాణక్యుడు చెప్పే సలహాలు ఇవే.!
ఆడపిల్లల పెంపకం విషయంలో తండ్రి బాధ్యత చాలా కీలకం. తల్లి 9 నెలలు మోస్తే తండ్రి కూతురి బాధ్యతలను గుండెల మీద పెట్టుకుని మోస్తాడు. అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాటా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. గొప్ప పండితుడు, రాజకీయ వ్యూహకర్త అయిన చాణక్యుడు కుటుంబ బంధాలు ఎలా ఉండాలనేది తన నీతి సూత్రాల్లో ఎన్నో విషయాలు విశదీకరించారు. తండ్రి తన కూతురితో ఎలా ఉండాలి, తన కుమార్తె విషయంలో బయటవాళ్లతో ఎలా ఉండాలనే విషయాలను బోధించారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

తక్కువ చేసి మాట్లాడకూడదు
ప్రతి తండ్రీ తన కూతురిని అపురూపంగా చూసుకోవాలని ఆచార్య చాణక్యుడు బోధించారు. ఆయన నీతి సూత్రాల ప్రకారం.. ఇతరుల ఎదుట తండ్రి ఎప్పుడూ తన కూతురిని అవమానించడం, తక్కువ చేసి మాట్లాడటం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఇతరుల ముందు చిన్నతనంగా ఫీల్ అవ్వడమే కాకుండా ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపి మనస్తాపానికి గురయ్యేలా చేస్తాయి. ఆమెలోని లోపాలను, వైఫల్యాలను ఎత్తిచూపకూడదు. కఠిన పరిస్థితుల్లో కూతురికి మద్దతుగా ఉండాలి. ఆమె గౌరవాన్ని కాపాడటమే తన మొదటి కర్తవ్యంగా భావించాలి.
నిర్ణయాలకు గౌరవం
కూతురు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు చదువు, కెరీర్, పెళ్లి వంటి విషయాల్లో ఆమె అభిప్రాయంపై తండ్రి గౌరవం ఉంచాలి. సరైన సలహాలు ఇస్తూ, మంచి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిస్తూ ఆమె ఉన్నతికి సహకరించాలి. ఆమె ఆసక్తి, నైపుణ్యాలను గౌరవిస్తూ తనకు నచ్చిన రంగాల్లో ఎదిగేందుకు ప్రోత్సాహమివ్వడం తండ్రి బాధ్యత.
వివక్ష చూపకూడదు
ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో కుమారులపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ కూతురిపై వివక్ష చూపిస్తుంటారు కొందరు తండ్రులు. సంపాదన కొడుకు చదువుల కోసం, కూతురు పెళ్లి కోసం అనే ఆలోచన చేయడం చాలా తప్పని చాణక్యుడు పేర్కొన్నారు. లింగ వివక్ష చూపకుండా సమాన అవకాశాలు ఇవ్వాలని.. కొడుకు ఉన్నతి కోసం కూతురిని నిర్లక్ష్యం చేయడం పాపమని చాణక్యుడు తెలిపారు.
భద్రత
ప్రతి తండ్రీ కూతురికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం ప్రాథమిక బాధ్యత అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించారు. అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా ఆమె ధృడంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సమాజంలోని పరిస్థితుల దృష్ట్యా కూతురిని ఒంటరిగా వదిలేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
వివాహం
చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం.. కూతురి పెళ్లి విషయంలో తండ్రి అస్సలు తొందరపడకూడదు. జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లి విషయంలో కూతురి ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అబ్బాయి అలవాట్లు, ప్రవర్తన, కుటుంబం, నేపథ్యం అన్నిటినీ నిశితంగా పరిశీలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా పెళ్లికి ఒప్పించకూడదు. కూతురి సంతోషానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ తన అభిప్రాయాలకు విలువనిచ్చే ఇంటికి కోడలిగా పంపించాలి.



Click it and Unblock the Notifications