Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎవరైనా మిమ్మల్ని మనస్పూర్తిగా ఇష్టపడుతుంటే..వారిలో మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయ్!
ఆచార్య చాణక్యుడు కేవలం గొప్ప రాజనీతాజ్ణుడే కాదు ఆర్థిక వేత్త,మనస్తత్వాలను, సంబంధాలు లోతుగా విశ్లేషించిన గొప్ప గురువు కూడా. చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఈ రోజుకీ మన జీవితాలకు మార్గనిర్దేశం చేస్తాయి. లవ్, ఎఫెక్టన్, ఇష్టం వంటి సున్నితమైన భావనల విషయంలో కూడా చాణక్యుడి పరిశీలను అద్భుతంగా ఉంటాయ్. ఒక మనిషికి ఇంకో మనిషిపై ఎప్పుడైనా ఇష్టం కలగవచ్చు. కొందరు ధైర్యం చేసి ఆ విషయాన్ని బయటకు చెబితే..మరికొందరు చెప్తే ఏమతుందో అని రహస్యంగా ఉంచుకుంటారు.
మనస్తత్వశాస్త్రం ప్రకారం వ్యక్తల ప్రవర్తన, వారి బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఎదుటివారిని ఇష్టపడుతున్నారో లేదో అంచనా వేయవచ్చు. ఎవరైనా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే లేదా ఆరాధిస్తుంటే, వారి ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయని చాణక్యుడు చెప్పారు. వారి ప్రవర్తనలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా వారి మనసులో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చని చాణక్యుడు చెప్పారు. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ చూడండి.

తరచుగా చూడడం,గమనించడం
ఎవరైనా మిమ్మల్ని తరచుగా చూడడం,గమనించడం చేస్తూ ఉండే వారు మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారని, మీపై ఆకర్షితులయ్యారని అర్థం. మిమ్మల్ని చూశాక వెంటనే మీరు గమనించకముందే చూపు తిప్పుకోవడం,పదే పదే మిమ్మల్ని చూడడం వంటి వారు ఇష్టపడుతున్నారని చెప్పే ముఖ్యమైన సంకేతాలు. అలాగే మీతో మాట్లాడటానికి సిగ్గు పడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. మీతో మాటలను ప్రారంభించడానికి వాళ్లు ట్రై చేస్తున్నారని అర్థం చేసుకోండి.
బాడీ లాంగ్వేజ్ గమనించడం
మిమ్మల్ని చూసి నవ్వడం, మీతో మాట్లాడే సమయంలో కాస్త వినయంగా వంగి మాట్లాడటం వంటివి చేస్తే వారు మిమ్మల్ని విపరీతంగా గౌరవిస్తున్నారని,ఇష్టపడుతున్నారని అర్థం. ఎవరైనా మీతో అతిగా మాట్లాడుతున్నా, మీ చుట్టూ తిరుగుతున్నా వారు చాలా ఆందోళనగా కనిపిస్తారు. మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీ కంటికి కనిపించేలాగే ఉండేందుకు ఇష్టపడతారు. ఈ లక్షణాలు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పడమే.
మీతో మాట్లాడేందుకు అవకాశాలు వెతుక్కుంటారు
అవసరం లేకపోయినా వచ్చి మాట కలపడం, అధిక శ్రద్ధ చూపడం, మిమ్మల్ని ఎట్రాక్గ్ చేయడానికి పిచ్చి జోకులు వేస్తుంటారు. మీతో సంభాషణ ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మీపై ఇష్టం ఉందని సూచించేదే.
ఇతరులతో మాట్లాడినా,చనువుగా ప్రవర్తించినా
మీరు ఇతరులతో మాట్లాడినా,చనువుగా ప్రవర్తించినా వారు చాలా అసూయ పొందుతారు. మీరు వేరే వ్యక్తులను వారి ఎదుట అభినందించినా కూడా భరించలేరు.ఇవన్నీమీపై వారికున్న ఇష్టానికి సంకేతాలే.
నిస్వార్ధ సహాయం
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మీకు సహాయం అవసరమైనప్పుడు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ముందుకొచ్చి సాయం చేసేది మిమ్మల్ని ఇష్టపడే వారే. మీ ఆనందాన్ని, మీ విజయాన్ని తమదిగా భావిస్తారు. మీ ఎదుగుదలను చూసి సంతోషిస్తారు.
ఈ లక్షణాలన్నీ ఎవరిలోనైనా మీ పట్ల కనిపిస్తున్నాయంటే వారి మనసులో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉందనిఅర్థమని చాణక్యుడు చెప్పారు. ప్రేమ అనేది కేవలం మాటల్లో వ్యక్తమయ్యేది కాదు, అది చేతల్లో, ప్రవర్తనలో, చూపుల్లో ప్రతిఫలిస్తుంది. చాణక్యుడి ఈ సూక్ష్మమైన పరిశీలనల ద్వారా మన చుట్టూ ఉన్న వ్యక్తుల నిజమైన మనసును అర్థం చేసుకోవడం సులభమవుతుంది.



Click it and Unblock the Notifications