Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కి దూరంగా ఉండండి, లేదంటే ప్రమాదమే!
లైఫ్ అనే లాంగ్ జర్నీలో మనకు తోడుండే బంధాలు చాలానే ఉంటాయి. అయితే అన్ని బంధాల కన్నా స్నేహ బంధం చాలా చాలా ప్రత్యేకమైనది. మంచి ఫ్రెండ్స్ లభిస్తే ఆ జీవితం నందనవనంలా మారుతుంది. వారు మన ఆనందాన్ని రెట్టింపు చేస్తారు, మన కష్టాలలో పాలుపంచుకుని భుజం తట్టి ధైర్యం చెబుతారు. అందుకే ఒక నిజమైన ఫ్రెండ్ వంద పుస్తకాలతో సమానం అని అంటారు. అయితే ఈ రోజుల్లో నిస్వార్థమైన స్నేహాన్ని పొందడం ఒక వరం లాంటిదే.
మనం స్నేహితులుగా భావించే ప్రతీ ఒక్కరూ మన శ్రేయస్సును కోరుకోరు. కొందరు స్నేహం అనే ముసుగులో మన చుట్టూనే ఉంటూ మనకు హాని తలపెట్టాలని చూస్తుంటారు. ఈ విషయం గురించి కొన్ని శతాబ్దాల క్రితమే గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు.

చాణక్యుడి ప్రకారం ఈ ముగ్గురు వ్యక్తుల స్నేహానికి దూరంగా ఉండాలి
అసూయతో రగిలిపోయే స్నేహితులు
వీరు మన ముందు మనల్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతారు. నీ అంత గొప్పవ్యక్తి లేరంటూ అంటూ మనల్ని ఆకాశానికెత్తేస్తారు. కానీ మన వెనుక మాత్రం మన గురించి చెడుగా మాట్లాడటానికి, మనల్ని కించపరచడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. మీ విజయాలను చూసి ఆనందించలేదు, అసూయతో వారి గుండె రగిలిపోతుంది. మీ ఎదుగుదల వారికి కంటగింపుగా ఉంటుంది. చాణక్యుడి ప్రకారం ఇలాంటి స్నేహమనే ముసుగులో ఉన్న శత్రువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నెగిటివ్ ఆలోచనల విషాన్ని చిమ్మే వారు
కొంతమంది స్నేహితులు ఎప్పుడూ నిరాశావాదంతో ఉంటారు. వారి ప్రపంచం మొత్తం నెగిటివ్ ఆలోచనలతో నిండి ఉంటుంది. మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా ఇది నీ వల్ల కాదు,దీనివల్ల ప్రయోజనం లేదంటూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. వారి ప్రతికూలత ఒక అంటువ్యాధిలా మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, మన లక్ష్యాల నుండి మనల్ని దూరం చేస్తుంది. ఇలాంటి వారి సాంగత్యం మన ఆలోచనా సరళిని కూడా విషపూరితం చేస్తుంది. కాబట్టి వీరి నీడ కూడా మనపై పడకుండా చూసుకోవాలని చాణక్యుడు హెచ్చరించాడు.
సుఖంలో బంధువులు, కష్టంలో అపరిచితులు
ఈ రకమైన స్నేహితులు మన జీవితంలో కేవలం మంచి రోజులు ఉన్నప్పుడే కనిపిస్తారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు, విందులు వినోదాలలో ఉన్నప్పుడు మన చుట్టూనే తిరుగుతారు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో కష్టాల మేఘాలు కమ్ముకుంటాయ వారు కంటికి కనిపించకుండా మాయమవుతారు. మీరు సహాయం కోసం చేయి చాస్తే వారు ముఖం చాటేస్తారు. ఇలాంటి స్నేహితులు మీ వ్యక్తిత్వాన్ని కాదు, మీ హోదాను, సంపదను మాత్రమే ప్రేమిస్తారు. ఆపదలో ఆదుకోనివాడు అసలు ఫ్రెండే కాదని గుర్తుపెట్టుకోవాలని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications