Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గ్రహణం సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? శాస్త్రం,సైన్స్ ఏం చెబుతుంది?
ఆకాశంలో జరిగే అద్భుతాలలో చంద్రగ్రహణం ఒకటి. భారతీయ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విశ్వాసాలు, ఆచారాలు, శాస్త్రీయ వాస్తవాల మధ్య వారధిగా నిలిచే ఈ చంద్రగ్రహణంపై ఎన్నో నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. 2025 సంవత్సరంలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సంభవించనుంది. సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు గ్రహణం ప్రారంభం కాగా..రాత్రి 11:00 నుండి 12:22 వరకు సంపూర్ణ గ్రహణ స్థితి అంటే చంద్రుడు పూర్తి ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. సెప్టెంబర్ 8, తెల్లవారుజామున 1:25 గంటలకు గ్రహణం ముగింపు ఉంటుంది. ఇది భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది.
శాస్త్రం చెబుతుందిదే
హిందూ ధర్మం ప్రకారం గ్రహణ కాలాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉంటాయని, అవి మనుషులపై దుష్ప్రభావం చూపుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే సూతక కాలంలో కొన్ని కఠిన నియమాలు పాటిస్తారు. సూతక కాలంలో అత్యంత ముఖ్యమైన నియమాలలో ఒకటి దైహిక సంబంధాలకు దూరంగా ఉండటం. గ్రహణ సమయంలో శారీరక కలయిక ద్వారా జన్మించే సంతానం ఆరోగ్య, మానసిక సమస్యలతో పుట్టే ప్రమాదం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కలిగే శృంగార వాంఛలు రాక్షస ప్రవృత్తిని ప్రేరేపిస్తాయని పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

సైన్స్ చెబుతుందిదే
శాస్త్రీయ దృక్కోణాన్ని పరిశీలిస్తే.. చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి రావడం వల్ల జరిగే ఒక సాధారణ భౌగోళిక ప్రక్రియ. భూమి నీడ చంద్రుడిపై పడటమే గ్రహణం. దీనివల్ల ఎలాంటి ప్రతికూల శక్తులు విడుదల కావని, వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మానవ ఆరోగ్యంపై గానీ, ప్రవర్తనపై గానీ గ్రహణానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని ఆధునిక విజ్ఞానం చెబుతోంది. శారీరక సంబంధాల వల్ల ఎలాంటి హాని జరగదని, ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం మాత్రమేనని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఏం చేయాలి
ఒకవైపు శతాబ్దాల నాటి నమ్మకాలు, మన పెద్దలు చెప్పిన మాటలు. మరోవైపు కళ్లకు కనిపిస్తున్న శాస్త్రీయ వాస్తవాలు. ఈ రెండింటి మధ్య నలిగిపోయే సామాన్యుడికి ఏది పాటించాలో తెలియక గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో శృంగారంలో పాల్గొనాలా, వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన విషయం. మీరు మత విశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవించేవారైతే, ఆ నియమాలను పాటించడం మీ మనశ్శాంతికి మంచిది. శాస్త్రాన్ని మాత్రమే నమ్మేవారైతే ఈ నియమాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని భావించవచ్చు. అంతిమంగా మీ నమ్మకం, మీ భాగస్వామి అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications