Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
ఈ ఉద్యోగం చేస్తున్నవారు ఎక్కువగా ఎఫైర్స్ పెట్టుకుంటారు!
కాలం మారుతున్న కొద్దీ మనుషుల మధ్య సంబంధాలు, ముఖ్యంగా వైవాహిక బంధాలు బలహీనపడిపోతున్నాయి. ఒకప్పుడు ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం అనేవారు. కానీ నేడు ఆ బంధాన్ని అవిశ్వాసం అనే చీడ పట్టి పీడిస్తోంది. జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారనే అనుమానం ఎవరికైనా నరకప్రాయమే. అయితే మీ భాగస్వామి నమ్మకద్రోహం చేసే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి వారి వృత్తి ఒక ముఖ్యమైన సూచికగా పనిచేస్తుందని ఇటీవల ఒక అధ్యయనం తేల్చింది. ఇది వినడానికి వింతగా ఉన్నా ఈ సర్వే వెల్లడించిన నిజాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
వివాహేతర సంబంధాలపై సంచలన సర్వే
వివాహితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ సైట్ యాష్లే మాడిసన్ (Ashley Madison) తమ వెయ్యి మందికి పైగా వినియోగదారులపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని ప్రత్యేక వృత్తులలో పనిచేసే వారు ఇతరులతో పోలిస్తే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఇంతకీ ఆ ప్రమాదకరమైన వృత్తుల జాబితాలో ఏవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మోసం చేసే వృత్తుల జాబితా ఇదే..
ట్రేడ్స్ (నిర్మాణం, ప్లంబింగ్, వెల్డింగ్)
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ రంగమే. నిర్మాణ రంగం, ప్లంబింగ్, వెల్డింగ్ వంటి పనులలో నిమగ్నమైన వారు ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉందని సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 29శాతం పురుషులు, 4శాతం మహిళలు ఈ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
వైద్య రంగం
ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉండటం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఒత్తిడితో కూడిన పనివేళలు, దీర్ఘకాలిక షిఫ్టులు, రోగులతో మానసికంగా దగ్గరవ్వడం వంటి కారణాల వల్ల డాక్టర్లు, నర్సులు తమ భాగస్వాములను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. మరీ ముఖ్యంగా ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 23శాతం మంది మహిళలు వైద్య రంగానికి చెందినవారే. పురుషులు కేవలం 5శాతం మాత్రమే ఉన్నారు.
ఐటీ
అధిక పనిభారం, తీవ్రమైన ఒత్తిడి, ప్రాజెక్టుల డెడ్ లైన్స్ తో సతమతమయ్యే ఐటీ నిపుణులు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం, సహోద్యోగులతో బంధాలు పెంచుకోవడం వంటివి ఇందుకు కారణం కావచ్చు.
స్వయం ఉపాధి
సొంత వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. వీరికి నిర్దిష్ట పనివేళలు ఉండవు. వ్యాపార పనుల మీద తరచూ కొత్త వ్యక్తులను కలవడం, ఇంటికి, భాగస్వామికి దూరంగా గడపడం వంటివి వారిని తప్పుదారి పట్టించడానికి కారణమవుతున్నాయని సర్వే తెలిపింది.
ఇతర రంగాలు
వీటితో పాటు ఆర్థిక , విద్యా , మార్కెటింగ్ & కమ్యూనికేషన్స్, సోషల్ వర్క్, రిటైల్, ఆతిథ్య రంగాల వారు కూడా తమ భాగస్వాములను మోసం చేసే అవకాశం ఉన్నవారి జాబితాలో ఉన్నారు. ఇక రాజకీయాలు, కళలు, న్యాయవాద వృత్తులలో ఉన్నవారు ఈ జాబితాలో కాస్త వెనుక వరుసలో ఉన్నారు.
అయితే, ఒక వృత్తిలో ఉన్నంత మాత్రాన వారందరూ మోసం చేస్తారని ముద్ర వేయడం సరికాదు. ఏ బంధానికైనా నమ్మకం, కమ్యూనికేషన్ పునాది. ఈ సర్వే కేవలం ఒక నిర్దిష్ట సమూహంపై జరిపిన అధ్యయనం మాత్రమే. వ్యక్తి నైతిక విలువలు, వ్యక్తిత్వం వారి వృత్తి కంటే చాలా ముఖ్యమైనవి.



Click it and Unblock the Notifications
