Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
Beard Brekaups: క్లీన్ షేవ్ vs గడ్డం..అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారో తెలుసా?
ఈ మధ్య బంధాలు తెగిపోడానికి గడ్డం కూడా ఒక ప్రధాన కారణంగా మారిపోతుంది. తన భర్త షేవింగ్ చేసుకోవట్లేదని ఓ మహిళ తన మరిదితో లేచిపోయిన ఘటన గత వారం ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మీరట్ లోని లిసాడి గేట్ ఏరియాలో నివసించే మొహమ్మద్ సాగిర్ కు 7 నెలల క్రితం అర్షి అనే యువతితో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన నాటి నుంచే గడ్డం ఉంటే తనకు నచ్చదని, షేవింగ్ చేయించుకోవాలని అర్షి తనను కోరేదని,అయితే ఇందుకు తాను అంగీకరించకపోవడంతో క్లీన్ షేవింగ్ చేసుకునే తన తమ్ముడితో తన భార్య లేచిపోయిందని సాగిర్ గత వారం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లెయింట్ లో తెలిపాడు.
తాను లేచిపోవడానికి షేవింగ్ కారణం కాదని, తన భర్తకు శృంగార సామర్థ్యం లేనందువల్లే తాను తన మరిదితో లేచిపోయినట్లు అర్షి తర్వాత తెలిపింది. ఇదిలాఉంటే,ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది స్త్రీలకు గడ్డాలు, మీసాలు నచ్చవని.. క్లీన్ షేవ్ చేసుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఒక వ్యక్తి జీవించే విధానం, హెయిర్ స్టైయిల్, వేసుకునే బట్టలు ఇవన్నీ వారిని ఆకర్షణీయంగా చేస్తాయి. అయితే రిలేషన్ షిప్ లో ఇందుకు ఎంత ముఖ్యమైనది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

సర్వేలో ఏం తేలిందంటే?
సాధారణంగా చాలామంది అబ్బాయిలు..అమ్మాయిలో అందాన్ని చూసి ఆకర్షణకు గురువుంటారని తెలిసిందే. ఇదేవిధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిల లుక్ ని జాగ్రత్తగా గమనిస్తారు.కట్ త్రోట్ క్లబ్ అనే ఓ ఆన్ లైన్ పోర్టల్ దాదాపు 1000 మంది అమ్మాయిలపై నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 39శాతం మంది అమ్మాయిలు క్లీన్ షేవ్ చేసుకున్న అబ్బాయిలే తమకు ఇష్టమని చెప్పారు. సర్వేలో పాల్గొన్నవారిలో 30శాతం మంది మాత్రమే గడ్డాలు,మీసాలు ఉన్న అబ్బాయిలు తమకు నచ్చుతారని తెలిపారు. క్లీన్ షేవ్ చేసుకున్న అబ్బాయిలు చాలా యవ్వనంగా,చూడగానే ప్రేమ పుట్టేలా ఉంటారని అమ్మాయిలు తెలిపారు. అంతేకాకుండా ఆ షేవింగ్ అందమైన ముఖంలోని ప్రతి ఒక్క అణువును మరింత సృష్టంగా చూపిస్తుందట.
పరిశుభ్రత ముఖ్యం
క్లీన్ గా నీటుగా ఉంటే అబ్బాయితో రిలేషన్ పెట్టుకోడానికి అమ్మాయిలు ఇష్టపడతారని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతున్నారు. మురికిగా ఉంటే అది అతని రిలేషన్స్ కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నీటుగా ఉండేవాళ్లు తమ శుభ్రత, వస్త్రధారణ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారని అమ్మాయిలు నమ్ముతారు. అయితే క్లీన్ షేవ్ ఉన్నా కూడా శుభ్రత లేకుంటే అమ్మాయిలకు నచ్చకపోచ్చు. క్లీన్ షేవ్ చేసుకున్న వ్యక్తి నచ్చుతాడా లేక గడ్డం ఉన్న వ్యక్తి కావాలా అనేది అమ్మాయిల పర్శనల్ ఛాయిస్. కాబట్టి అబ్బాయిలు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. ప్రేమను ఆకర్సించడంలో ఇది ఒక ముఖ్యమైన ఆయుధం.
అధిక బ్యాక్టీరియా
కొందరు అబ్బాయిలు గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తారు. అయితే ఇది ఫ్యాషన్ కావచ్చు కానీ దానిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మీ స్టైలిష్ లుక్ బ్యాక్టీరియా హోమ్ లా మారిపోతుంది. స్విట్జర్లాండ్ లోని హిర్స్ లాండెన్ క్లినిక్ లో జరిగిన ఓ సంచలన సర్వేలో పరిశోధకులు..కుక్క వెంట్రుకల్లో కంటే ఎక్కువ బ్యాక్టీరియా పురుషుల గడ్డం,మీసాలలో ఉన్నట్లు గుర్తించారు. గడ్డం కారణంగా మీ మొఖంపై వచ్చే చెమట అంత త్వరగా ఆరిపోదు. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications