Latest Updates
-
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.! -
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.! -
డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్?
దాంపత్యంబంధంలో దంపతులు చేసే తప్పులు, వీటితో బంధం బీటలు వారుతుంది
దాంపత్యబంధం సాఫీగా, సంతృప్తిగా, సంతోషంగా సాగేందుకు కొన్ని విషయాల్లో పక్కాగా ఉండాలంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. చిన్న చిన్న చిట్కాలు, కిటుకులు, జాగ్రత్తలు తెలుసుకుని మసులుకుంటే ఆ బంధం అన్ని రకాలుగా సంతృప్తిగా ఉంటుంది. శృంగారం ప్రతి దంపతుల జీవితంలో తప్పనిసరి భాగం. శృంగారం లేని దాంపత్యం చాలా చాలా అరుదు. అలాంటి బంధం ఎక్కువకాలం కొనసాగుతుంది అన్న నమ్మకం కూడా తక్కువ. శృంగారం బూతులా కాకుండా సాన్నిహిత్యాన్ని పెంచే చర్యలా భావించాలి. దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడానికి, వారి బంధాన్ని మరింత బలపరచడానికి, ఒకరిపై ఒకరి ఇష్టాన్ని, ప్రేమను, కోరికను పెంచడానికి శృంగారం చాలా కీలకం.

చాలా మంది దంపతులు శృంగారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియకుండా దానిని కేవలం కోరికను నెరవేర్చుకునే చర్యగా మాత్రమే చూస్తారు. అందుకే చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. చాలా మంది దంపతులు తెలియకుండా చేసే లైంగిక తప్పులు వారి బంధాన్ని బీటలు వారుస్తాయి. ఆ తప్పులేమిటో తెలుసుకుని వాటిని పునరావృతం కాకుండా చూసుకోవడం చాలా కీలకం.
సమయం ఇవ్వాలి:
దంపతులు ఇద్దరూ ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకోవాలి. అది కూడా నాణ్యమైనదిగా ఉండాలి. ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత మంచిది అంటారు నిపుణులు. సమయంలో కేటాయిస్తే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మంచి చెడు మాట్లాడుకోవడానికి వీలవుతుంది. అలాగే ఎప్పుడూ కుటుంబ సమస్యలు, బాధ్యతలు, కష్టాల గురించి మాత్రమే కాకుండా మీ సొంత విషయాల గురించి మాట్లాడుకోవాలి. దంపతులు ఇద్దరి తమ గురించి తాము ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కోరికలు, ఆశలు, ఆశయాలు అన్ని చర్చించుకోవాలి. శృంగార విషయం గురించి కూడా భాగస్వామలు ఇద్దరూ చర్చించుకోవాలి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఇష్టాయిష్టాల నుంచి మొదలు పెట్టి శృంగారంలో ఫాంటసీల వరకు మాట్లాడుకోవాలి.
సంతృప్తి ముఖ్యం:
దాంపత్యబంధం సాఫీగా, ఆనందంగా, సుఖంగా, సంతృప్తిగా సాగడానికి కొన్ని కిటుకులు నేర్చుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న చిట్కాలతో బంధాన్ని బలపర్చుకోవచ్చు. అందులో కీలకమైనది శృంగారం. శృంగారాన్ని జీవిత భాగస్వాములు ఇద్దరూ ఎంజాయ్ చేయగలగాలి. ఇద్దరూ అందులో సంతృప్తి, సుఖాన్ని పొందాలి. అందులోని మధురామృతాన్ని ఆస్వాదించగలగాలి. శృంగారంలో పాల్గొన్న దంపతులు ఇద్దరూ భావప్రాప్తి పొందగలిగితే దాని వల్ల ఇద్దరూ సమానంగా సుఖం అందుకుంటున్నారని అర్థం. చాలా మంది దంపతుల్లో శృంగార విషయంలో సమస్యలు ఉంటాయి. పురుషుల్లో త్వరగా అలసిపోతో మహిళలు మాత్రం ఎక్కువసేపు శృంగారం కావాలనుకుంటారు. అక్కడే వచ్చే తేడా వల్ల ఎవరూ పూర్తిగా శృంగారాన్ని ఆస్వాదించలేకపోతారు.
ఆ విషయంలో భంగపరచవద్దు:
ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవం ఉంటుంది. దానిని ఎప్పుడూ కించపరచవద్దు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు ఎప్పుడూ మీ జీవిత భాగస్వామి గురించి చులకన చేసి మాట్లాడకూడదు. ఆత్మగౌరవం, అహాన్ని దెబ్బతీయకుండా ఉంటే మనస్ఫర్థలు రాకుండా ఉంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications