Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
శృంగారం తర్వాత ప్రతి ఒక్కరూ చేసే తప్పులు ఇవే.. మీరూ చేస్తున్నారా?
వివాహ బంధంలోనైనా, ప్రేమ బంధంలోనైనా శృంగారానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ పదం వినగానే ప్రతి ఒక్కరిలో ఎన్నో భావాలు ఏర్పడతాయి. ప్రేమ, అనుబంధం, ఆకర్షణ ఇలా ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరూ లింక్ అవుతూ ఉంటారు. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే శృంగారం అనేది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు. ఇది మనసుతో ముడిపడి ఉంటుంది.
శృంగారం కేవలం శారీరక వాంఛలను తీర్చడం మాత్రమే కాదు, ఎన్నో రకాల మానసిక రుగ్మతలను కూడా పటాపంచలు చేస్తుంది. శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సైతం ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది ఆరోగ్య నిపుణులు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శృగారంలో పాల్గొన్న తరువాత కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శృంగారం తరువాత ముఖ్యంగా మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శృంగారంలో పాల్గొన్న తరువాత మహిళలు గోరు వెచ్చని నీటితో, సున్నితమైన సబ్బును వినియోగించుకొని ప్రైవేట్ భాగాలను శుభ్రంగా కడుక్కోవాలి. యోని లోపల భాగాన్ని కడుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే వేడి నీరు, కఠినమైన రసాయనాలు కలిగిన సబ్బులను కూడా వినియోగించవద్దు. ఇలా చేయడం వల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.
దీంతో పాటు శృంగారంలో పాల్గొన్న తరువాత మూత్ర విసర్జన చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా బయటికి వచ్చేస్తుంది. దీంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అలాగే శృంగారం తరువాత తడిగా ఉండే లో దుస్తులను కూడా మార్చుకోవాలి. గాలి బాగా ఆడే కాటన్ దుస్తులను ధరించాలి. శృంగారం తరువాత కాసేపు ఆగి పుష్కలంగా నీటిని తాగాలి.
పురుషులు పాటించాల్సిన జాగ్రత్తలు
శృంగారంలో మహిళలతో పాటు పురుషులు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. మహిళల్లో కొన్ని సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పురుషుల్లో కూడా ఆ సమస్యలు అధికంగానే ఉంటాయి. అయితే శృంగారంలో పాల్గొన్న తరువాత పురుషులు అంగాన్ని శుభ్రం చేసుకోవాలి. సున్నితమైన సబ్బుతో, గోరు వెచ్చని నీటితో అంగాన్ని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అంగంపై దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇద్దరూ ఉమ్మడిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శృంగారం తరువాత మహిళలు, పురుషులు వేరు వేరుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఉమ్మడిగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవాంఛిత గర్భంతో పాటు లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి కండోమ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే శృంగారంలో సంతోషకరమైన భావప్రాప్తి కలగాలంటే మీ భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి.



Click it and Unblock the Notifications