Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే.
ఏ బంధమైనా జీవితం ముగిసేవరకు నిలవాలని ముడిపెడతారు. కానీ అందరికీ అలా జరగదు. కొన్ని కారణాలు, పరిస్థితులు ఆ బంధానికి మధ్యలోనే ముగింపు పలుకుతాయి. అది ప్రేమ, వివాహం ఏదైనా కావొచ్చు. బలహీనత లేని రిలేషన్ ఉండదు. కానీ వాటిని అధిగమిస్తూ మీ భాగస్వామితో బంధాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే కొన్ని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రిలేషన్ ఏదైనా అది రాత్రికి రాత్రే ముగిసిపోదు. ఓ బంధం విడిపోవడానికి చాలా పరిస్థితులు దారితీస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, అభిప్రాయభేదాలు, గొడవలు, మనస్పర్థలు, ఈగో ఇలా ఏదైనా కావొచ్చు. కానీ చాలామంది ఈ లక్షణాలను విస్మరిస్తూ ముందుకు పోతుంటారు. ఫలితంగా ఇటీవలి కాలంలో విడాకుల కేసులు, ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ సంకేతాలను గుర్తిస్తూ కొన్ని సలహాలు పాటించడం ద్వారా మీ భాగస్వామితో జీవితం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది.
జీవిత భాగస్వామితో భావోద్వేగంగా ముడిపడటం చాలా ముఖ్యం. వారితో భావోద్వేగంగా ఎంతో దగ్గరగా ఉంటున్నామనేది చూసుకోవాలి. ఎమోషనల్‌గా దూరం పెరిగితే అది విడిపోవడానికి దారి తీయవచ్చు. ఇద్దరి మధ్య సంభాషణలు, సంతోషాలు, బాధలు పంచుకోకపోవడం, కొన్ని మాటలను ఎలాంటి అనుభూతి లేకుండా చెప్పడం వంటివి వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. మీ పార్ట్‌నర్‌తో మనస్ఫూర్తిగా సంభాషిస్తూ వారి బాధలను, సంతోషాలను పంచుకోవడం ద్వారా మానసికంగా మీ మధ్య దూరం తగ్గుతుందని గమనించాలి.
ఏ రిలేషన్‌లో అయినా అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ ప్రతి చిన్న విషయం మీద కొందరు అతిగా గొడవపడుతుంటారు. ఇంకా గొడవను పరిష్కరించుకోకుండా అహానికి పోయి క్షమాపణ చెప్పుకోవడానికి వెనుకాడతారు. ఈ సంఘటనలే వారి మధ్య సంబంధాన్ని బలహీనపరుస్తుంది. గొడవ జరిగినప్పుడు ఒకరు తగ్గడంలో తప్పేమీ లేదు.

ప్రస్తుత కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసే వాళ్లు ఉంటున్నారు. లేదంటే భర్త వ్యాపారంలో ఉంటూ భార్య ఇంటి బాధ్యతల్లో నిమగ్నమై పోతారు. ఈ క్రమంలో బిజీ లైఫుల వల్ల కలిసి సమయం గడుపుతుంటారు. ఒక్కోసారి కలిసి చేసే ప్రయాణాలు కూడా రద్దు చేసుకుంటారు. ఇది వారి మధ్య మానసికంగా దూరాన్ని పెంచుతుంది. ఇది రిలేషన్ బ్రేక్ అవ్వడానికి సంకేతం. ఎంత బిజీ లైఫ్ ఉన్నా.. రోజులో కాసింత సమయం భాగస్వామితో కేటాయించడం చాలా ముఖ్యం.
ఎలాంటి విషయమైనా దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. అది ఇంట్లో వాళ్లయినా, బయటి వ్యక్తులైనా. సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు సైతం మూడో వ్యక్తి ప్రమేయంతో తీవ్రమవుతుంటాయి. ముఖ్యంగా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, దాపరికాలు ఉండకూడదు. మీ ఇద్దరికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ ఇతర కుటుంబ వ్యవహారాలు కానీ మూడో వ్యక్తి చెప్పేవరకు తెలియకుండా ఉండకూడదు. లేదంటే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
దంపతుల మధ్య మానసిక బంధం ఎంత ముఖ్యమో, శారీరకంగా దగ్గరవ్వడం కూడా అంతే కీలకం. ప్రేమతో కూడిన కలయిక, అభినందనలు.. ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని పెంచుతాయి. బంధం బలపడుతుంది. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా అది మనస్పర్థలకు దారి తీసి బంధం విచ్ఛిన్నం అవ్వడానికి కారణమవుతుంది. భాగస్వామితో ప్రేమ పాటు గౌరవం కూడా చాలా ముఖ్యమే. వారిద్దరూ ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటూ అభిప్రాయాలకు గౌరవమివ్వాలి. అప్పుడే ఆ బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.



Click it and Unblock the Notifications