Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
సోలో డేట్ ట్రెండ్..ఒంటరిగా సమయం గడపడం వల్ల ప్రయోజనాలివే!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సోలో డేట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు ఎవరైనా ఒంటరిగా సినిమాకో, రెస్టారెంట్‌కో లేదా బయటకు వెళ్తే..పాపం, వాళ్లకు తోడుగా ఎవరూ లేరేమో అని జాలిపడేవారు.
కానీ ఇప్పుడు సీన్ మారింది. చేతిలో కాఫీ కప్పుతో కేఫ్ లో కూర్చున్నా, థియేటర్‌లో ఒంటరిగా సినిమా చూస్తున్నా.. నేటి యువత దానిని ఒంటరితనంగా కాకుండా స్వీయ ప్రేమ(Self Love)గా గర్వంగా చెప్పుకుంటున్నారు.

అయితే మనకు ఇష్టమైన వారిని వదిలేసి, ఇలా ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమేనా? సైకాలజీ నిపుణుల ప్రకారం, ఇది మానసిక బలానికి ఒక గొప్ప మూలం.
అసలు సోలో డేట్ అంటే ఏమిటి?
సింపుల్ గా చెప్పాలంటే..మిమ్మల్ని మీరే డేట్ కి తీసుకెళ్లడం. సాధారణంగా మన ఆనందం కోసం ఫ్రెండ్స్ మీదనో లేదా పార్టనర్ మీదనో ఆధారపడతాం. కానీ సోలో డేట్ ఈ ఆధారపడటాన్ని బ్రేక్ చేస్తుంది.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, సోషల్ మీడియా శబ్దాల మధ్య మన గొంతు మనకే వినిపించట్లేదు. ఇలాంటప్పుడు బాహ్య ప్రపంచం నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, మనతో మనం కనెక్ట్ అవ్వడానికి సోలో డేట్ ఒక అద్భుతమైన అవకాశం.
ఆత్మవిశ్వాసానికి శక్తివంతమైన మార్గం
ఒంటరిగా బయటకు వెళ్లడం మీలో దాగున్న భయాన్ని పోగొడుతుంది. కొత్త రెస్టారెంట్ లో మొహమాటం లేకుండా ఆర్డర్ చేయడం లేదా తెలియని ప్రాంతాలను ఎక్స్ ప్లోర్ చేయడం వల్ల నా సంతోషానికి, నా భద్రతకు నేనే బాధ్యత వహించగలను అనే నమ్మకం కలుగుతుంది. ఇతరుల నుండి ఆమోదం కోసం ఎదురుచూసే అలవాటు మెల్లగా తగ్గిపోతుంది.
ఎందుకింత క్రేజ్?
-ఆఫీసు డెడ్‌లైన్లు, ఇంటి బాధ్యతల నుండి తప్పించుకుని, మనసుకు రీచార్జ్ ఇవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
-ప్రతి ఒక్కరూ తమ జీవిత కథలో తామే హీరో,హీరోయిన్ గా ఫీలవుతున్నారు. తమకు తామే ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు.
-ఎవరి కోసమో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనిలేదు. మీకు నచ్చింది తినొచ్చు, నచ్చిన సీట్లో కూర్చోవచ్చు, నచ్చినంత సేపు ఉండొచ్చు. నిర్ణయం పూర్తిగా మీదే.
ఒంటరితనం vs ఏకాంతం
చాలామంది సోలో డేట్ ని ఒంటరితనం అనుకుంటారు. కానీ ఇవి రెండూ వేరు. ఒంటరితనం అంటే ఎవరూ లేరని బాధపడటం. కానీ సోలో డేట్ అనేది ఏకాంతం. మీతో మీరు ఏర్పరచుకునే అందమైన స్నేహం. ఇది మిమ్మల్ని మానసికంగా మరింత స్థిరంగా మారుస్తుంది.



Click it and Unblock the Notifications