Latest Updates
-
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి
వైజాగ్‌లో లవర్‌తో డేట్‌కు వెళ్తున్నారా? ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేయండి
డేటింగ్.. అది ఫస్ట్ టైమ్ అయినా, సెకండ్ టైమ్ అయినా కొంత నర్వస్‌నెస్ ఉండటం కామన్. కొత్త వాళ్లకైతే అది మరింత ఎక్కువే ఉంటుంది. మొదటిసారి లవర్ తో బయటకు వెళ్తుంటే.. ఎలా ఎంజాయ్ చేయాలో, ఎలా టైంపాస్ చేయాలో, ఎక్కడెక్కడికి వెళ్లాలో తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు.
దీని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. తీరా లవర్ ను కలుసుకున్న తర్వాత ఎక్కడికెళ్దాం, నువ్వు చెప్పు.. అంటే నువ్వు చెప్పు అనుకుంటే చాలా బాగోదు. అలాంటి లవ్ బర్డ్స్ కోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఇవి ఫాలో అయితే డేటింగ్ మజాగా సాగిపోతుంది.

షాపింగ్ మాల్..:
లవర్ తో మంచి సమయం గడపడానికి అద్భుతమైన చోటు షాపింగ్ మాల్స్. చాలా మంది అమ్మాయిలకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీరు మీ లవర్ ను బయటకు తీసుకెళ్లాలనుకుంటే.. కాసేపు అలా షాపింగ్ మాల్‌లోకి వెళ్లండి. మీ లవర్‌కు నచ్చినదేదైనా గిఫ్ట్ ఇస్తే వారు సంతోషిస్తారు. అలా మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత రోజంతా హ్యాపీగా గడపడానికి మంచి వే పడిపోతుంది.
బీచ్‌లో లవర్‌తో అలా.. అలా..
బీచ్‌కు వైజాగ్ వాసులకు ఏదో చెప్పలేని ఆత్మీయ బంధం ఉంటుంది. నడక అయినా, మీట్‌అప్ అయినా బీచ్‌లో అలా అలా నడుస్తూ.. అలల హోరు, సముద్రపు గాలికి పరవశించిపోతూ డేటింగ్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో అలా కాసేపు లవర్ చేతిలో చేయి వేసి నీటిలో నడుస్తూ ఉంటే, ఆహా.. ఆ ఊహే రొమాంటిక్ గా ఉంది కదూ.
పాకెట్ ఫ్రెండ్లీ - కేఫ్ డేట్:
వైజాగ్ లో చాలానే కేఫ్ లు ఉన్నాయి. అందులో కొన్ని చాలా రొమాంటిక్ వైబ్‌ను కూడా ఇస్తాయి. ఏదో ఒక కేఫ్‌ను ఎంచుకుని, ఫార్మాలిటీగా ఏదో ఒకటి ఆర్డర్ చేసేసి ఎంతసేపు అయితే అంతసేపు అక్కడ కూర్చొని కబుర్లాడుకోవచ్చు. ఇండోర్, ఓపెన్ టెర్రస్ మీకు నచ్చిన కేఫ్ కు వెళ్లొచ్చు.
రెస్టో బార్ డేట్:
మీరు, మీ లవర్ ఇద్దరూ పార్టీ లవర్స్ అయితే ఏంచక్కా.. రెస్టో బార్ కు వెళ్లిపోండి. వైజాగ్ లోని బ్రూవరీలు రెస్టో బార్లు రొమాంటిక్ గా ఉండేవి చాలానే ఉన్నాయి. ఆహారం, సంగీతం, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది.
లాంగ్ డ్రైవ్:
వైజాగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది బీచ్. అలాగే ఇక్కడ లాంగ్ డ్రైవ్ కూడా మజానిస్తుంది. ఇద్దరికీ ఎటైనా దూరంగా వెళ్లి హాయిగా, ప్రశాంతంగా సమయాన్ని గడపాలనుకుంటే అలా దూరంగా వెళ్లిపోండి. ప్రయాణం కూడా హ్యాపీగా ఉండేలా మంచి రూట్ ఎంచుకుంటే సరి.



Click it and Unblock the Notifications