Latest Updates
-
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!
గయ్యాలి కోడలి తిక్క కుదర్చాలంటే అత్తలు ఈ పని చేయాల్సిందే!
ఆడవాళ్లలో ప్రేమ, సహనం ఎంతగా ఉంటుందో.. కొన్నిసార్లు ఆగ్రహం, ఆవేశం కూడా అదే స్థాయిలో ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత ఒక అమ్మాయి అత్తవారింట్లో అడుగుపెడుతున్నప్పుడు తనతో పాటు ఎన్నో ఆశలను, కలలను కూడా మోసుకొస్తుంది. అదే సమయంలో కొత్త మనుషులు, కొత్త వాతావరణం ఎలా ఉంటుందోనన్న భయం కూడా ఆమెలో ఉంటుంది. మరోవైపు, కొడుకు జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి తమ కుటుంబాన్ని ఎలా కలుపుకుపోతుందోనని అత్తమామల్లోనూ ఒకరకమైన ఆందోళన ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు కొన్నిసార్లు అద్భుతమైన అనుబంధం పుడుతుంది, మరికొన్నిసార్లు మాత్రం అగ్గి రాజుకుంటుంది.
కొన్ని సందర్భాల్లో అత్తగారు ఎంతో నిరాడంబరంగా, ప్రశాంతంగా, మౌనంగా ఉండే స్వభావం కలవారుగా ఉండి. కోడలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం మనం చూస్తుంటాం. చిన్న విషయానికే అగ్గిపర్వతంలా పేలిపోవడం, అరవడం, గొడవలు సృష్టించడం, ఇంట్లో రణరంగం చేయడం కొంతమంది కోడల నైజం. తన మాటే నెగ్గాలనే పంతం, అందరి దృష్టి తనపైనే ఉండాలనే తపన కొందరి కోడలల్లో కనిపించడం మనం నిత్య జీవితంలో చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో సహనానికి మారుపేరైన అత్తగారికి కూడా ఓపిక నశించిపోతుంది. ఇంట్లో ప్రశాంతత కరువై, నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవ్వాల్సి వస్తుంది. ఇలాంటి నాటకీయమైన, గొడవపడే కోడలిని ఎలా ఎదుర్కోవాలో నిపుణులు కొన్ని టిప్స్ చెప్పారు.అవేంటో ఇక్కడ చూడండి.

పట్టించుకోకండి
మీ కోడలు కావాలనే గొడవ సృష్టిస్తున్నప్పుడు, దానికి కారణం కేవలం మీ దృష్టిని ఆకర్షించడమే అని గ్రహించండి. ఆమె అరుస్తున్నప్పుడు, మీరు ఎదురు అరిస్తే రగిలే మంటలో ఆజ్యం పోసినట్టే అవుతుంది. కాబట్టి ఆమె రెచ్చగొట్టే మాటలను విననట్టుగా ఉండండి. ఆమె ప్రవర్తన ఆమె స్వభావమని సరిపెట్టుకోండి. ఆమె ఎంత గొడవ చేసినా, మీరు స్పందించకపోతే, కాసేపటికి తనే అలసిపోయి ఆపేస్తుంది. ఒకవేళ పరిస్థితి మరీ శృతి మించుతుంటే మీరు ఆ గదిలో నుండి ప్రశాంతంగా బయటకు వచ్చేయండి. లేదా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం అమ్మ" అని చెప్పి ఆమెను సున్నితంగా బయటకు వెళ్ళమని సూచించవచ్చు. మీ మౌనమే ఆమె నాటకీయతకు మొదటి సమాధానం కావాలి.
మీ ప్రశాంతతే మీ అసలైన ఆయుధం
కొంతమందికి ఇతరులను రెచ్చగొట్టి, వారి బలహీనతలను బయటపెట్టి ఆనందించడం అలవాటు. మీ కోడలు అలాంటి వ్యక్తి అయితే మీ ఓర్పు, ప్రశాంతతను ఆమెకు ఒక బలహీనతగా కనిపించనీయకండి. దాన్ని మీ ఆయుధంగా మార్చుకోండి. ఆమె హద్దులు దాటినప్పుడు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అయితే ఆవేశంతో కాదు ఆలోచనతో. మీ గొంతులో కోపం బదులు, నిలకడ ఉండాలి. మీ మాటల్లో తిట్లు బదులు, కనిపించాలి. నువ్వు ఇలా ప్రవర్తించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది వంటి వాక్యాలతో, అవతలి వారిని కించపరచకుండా మీ భావాన్ని స్పష్టంగా చెప్పండి.
కూర్చుని మాట్లాడుకుందాం అనే మంత్రాన్ని పాటించండి
ప్రతి గొడవకూ అంతం ఉంటుంది. వాతావరణం కాస్త చల్లబడ్డాక మీ కోడలితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడండి. అమ్మా..ఫలానా విషయంలో నువ్వు అలా ప్రవర్తించడం వల్ల ఇంట్లో అందరం బాధపడ్డాం. నీ సమస్య ఏంటో నాతో చెప్పగలవా? అని మర్యాదగా అడగండి. ఆమె బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఆమె ప్రవర్తనలో మార్చుకోవాల్సిన విషయాలను కఠినంగా కాకుండా, దృఢంగా చెప్పండి. ప్రతీ బంధంలోనూ కొన్ని హద్దులు అవసరం. ఆ లక్ష్మణరేఖను గీయాల్సిన బాధ్యత మీదే.

మీ ఆవేదనను కొడుకుపై చూపకండి
కోడలితో వచ్చిన సమస్యలకు మీ కొడుకును బాధ్యుడిని చేయడం లేదా అతనిపై మీ కోపాన్ని చూపడం చాలా పెద్ద పొరపాటు. అతను తల్లికీ, భార్యకీ మధ్య నలిగిపోతుంటాడు. బదులుగా మీ కొడుకుతో కూర్చుని ఇలా జరుగుతోంది నాన్నా, నాకు చాలా కష్టంగా ఉంది. మనం ఇద్దరం కలిసి దీనికి ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పండి. మీరు చెప్పలేని కొన్ని విషయాలను, అతను తన భార్యకు సర్దిచెప్పగలడేమో ప్రయత్నించండి. అతన్ని తిట్టడం ద్వారా మీరు అతన్ని దూరం చేసుకుంటారు.. అదే అతన్ని ఒక స్నేహితుడిగా భావిస్తే మీకు ఒక తోడు దొరుకుతుంది. ఈ సూత్రాలను పాటిస్తే ఎంతటి తుఫానులాంటి కోడలినైనా ఎదుర్కొని, ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పవచ్చు.



Click it and Unblock the Notifications