Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ భాగస్వామికి ఎలాంటి శృంగారం ఇష్టమో.. వారి నిద్ర భంగిమ చూసి తెలుసుకోండి!
ఒక జంట మధ్య శృంగార జీవితం ఎలా ఉంది? ఒక వ్యక్తికి ఎలాంటి శృంగారం అంటే ఇష్టం? అనే విషయాలను వారు సంభోగంలో పాల్గొనకపోయినా సులభంగా పసిగట్టవచ్చు. నిద్రపోయే విధానాన్ని బట్టి దీనికి సమాధానం తెలుసుకోవచ్చు.
మనిషి మెలకువగా ఉన్నప్పుడు ఎన్నో ముసుగులు వేసుకుని నటిస్తాడేమో కానీ, నిద్రలో మాత్రం ఆ ముసుగులన్నీ తొలగిపోతాయి. మన ఉపచేతన మనస్సు మన నిద్ర భంగిమలను నిర్దేశిస్తుంది. బాడీ లాంగ్వేజ్ నిపుణుల ప్రకారం జంటలు పడుకునే తీరు వారి లైంగిక కోరికలను, బంధంలోని సాన్నిహిత్యాన్ని బయటపెడుతుంది.

ఒకరినొకరు తాకుతూ లేదా స్పూనింగ్ పొజిషన్
మంచంపై పడుకున్నప్పుడు ఒకరి వీపుకు మరొకరు ఆనించి లేదా ఒకరిని మరొకరు హత్తుకుని పడుకోవడం అత్యంత రొమాంటిక్ భంగిమగా పరిగణించబడుతుంది. ఈ భంగిమ ఇద్దరి మధ్య ఉన్న గాఢమైన ప్రేమను, ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధను సూచిస్తుంది.
శృంగారం పట్ల అమితమైన మక్కువ ఉన్నవారు, శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించేవారు ఈ విధంగా నిద్రపోవడానికి ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు.
ఎవరి వైపు వారు తిరిగి పడుకోవడం (తాకుకోకుండా)
చాలామంది జంటలు మంచం మీద ఎవరి వైపు వారు తిరిగి,మధ్యలో ఖాళీ ఉంచి నిద్రపోతుంటారు. ఇది చూసేవారికి దూరాన్ని సూచిస్తున్నట్లు అనిపించినా, వాస్తవానికి ఇది సంబంధంలోని భద్రతా భావానికి సంకేతం.
వీరి మధ్య శారీరక సంబంధం బాగానే ఉన్నా వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు. ఒకరినొకరు ఎంతగానో గౌరవించుకుంటారని, వారి బంధం విషయంలో ఎలాంటి అభద్రతా భావం లేదని దీని అర్థం.
వీపులు ఆనించి పడుకోవడం
కొందరు ఎవరి వైపు వారు తిరిగి పడుకున్నప్పటికీ వారి వీపులు లేదా పిరుదులు ఒకరికొకరు తగులుతూనే ఉంటాయి. సాధారణంగా కొత్తగా పెళ్లైన జంటలలో లేదా గాఢమైన ప్రేమలో ఉన్నవారిలో ఈ భంగిమ కనిపిస్తుంది. దీని అర్థం వారు రిలాక్స్డ్ గా ఉన్నప్పటికీ, శారీరక సాన్నిహిత్యాన్ని కోల్పోకూడదని భావిస్తారు.
మంచం మొత్తం ఆక్రమించడం
కొంతమందికి నిద్రించడానికి చాలా స్థలం కావాలి. కాళ్లు, చేతులు చాపి మంచం అంతా ఆక్రమిస్తారు. దీనివల్ల వారి భాగస్వామికి మంచం మూలన ఇరుక్కుని పడుకోవాల్సి వస్తుంది.
ఈ భంగిమ సంబంధంలో ఉన్న సమస్యను సూచిస్తుంది. ఇలా పడుకునే వ్యక్తి సంబంధంలో ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటాడు లేదా స్వార్థపరుడై ఉంటాడు.
పెనవేసుకుని పడుకోవడం
ప్రేమికులు లేదా దంపతులు ఒకరి కాళ్ళలో కాళ్ళు వేసి, చేతులతో గట్టిగా కౌగిలించుకుని ముడివేసినట్లుగా పడుకోవడం చూస్తుంటాం. ఇది అత్యంత సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది.
నిపుణుల ప్రకారం ఇలా పడుకునే వారు ఒకరిపై ఒకరు మానసికంగా, శారీరకంగా విపరీతంగా ఆధారపడి ఉంటారని అర్థం. వీరికి దొరికిన సమయాన్ని, సాన్నిహిత్యాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, భాగస్వామిని వదలకూడదని వీరు కోరుకుంటారు.
ఛాతీపై తలవాల్చి నిద్రపోవడం
భాగస్వామి ఛాతీపై తల పెట్టుకుని నిద్రపోవడం అనేది రక్షణకు, గాఢమైన ప్రేమకు సంకేతం. నేను నీకు తోడుగా ఉన్నాను అనే భరోసాను ఇది ఇస్తుంది. ఇది నిబద్ధతను సూచిస్తుంది.
ఇది కేవలం శృంగారమే కాదు ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటారనే ఆప్యాయతను తెలియజేస్తుంది.



Click it and Unblock the Notifications