డెలులు డేటింగ్‌.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.?

రిలేషన్‌షిప్‌, డేటింగ్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో తరచూ కొత్త పదాలు ఫేమస్‌ అవుతుంటాయి. తాజాగా ట్రెండింగ్‌లో ఉంది డెలులు డేటింగ్‌(Delulu Dating). అసలు ఈ డెలులు డేటింగ్‌ అంటే ఏంటి.? దీని ప్రభావం ఎలా ఉంటుంది. ఇక్కడ తెలుసుకుందాం..

Delulu dating Signs you should know it reveals the truth about a relationship

డెలులు డేటింగ్‌.. ఇది ఒక సంబంధాల ధోరణిగా మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. డేటింగ్‌లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి తమ రిలేషన్‌షిప్‌ గురించి, ప్రేమించే వ్యక్తి గురించి మితిమీరిన అంచనాలను పెట్టుకుంటారు. వారితో ఊహాలోకాల్లోకి వెళుతుంటారు. దీనినే డెలులు డేటింగ్‌ అంటారు. ఈ ఫీలింగ్‌ మొదట్లో రొమాంటిక్‌గా అనిపించినా.. భవిష్యత్తులో రియాలిటీకి, మీరు ఫేస్‌ చేస్తున్న వాటికి దూరంగా అనిపిస్తే పలు సమస్యలకు దారితీస్తుంది.

మరి ఈ డెలులు డేటింగ్‌ సంకేతాలు ఎలా ఉంటాయి? మీ రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.? దాని నుంచి ఎలా బయటపడాలి. ఇక్కడ తెలుసుకుందాం.

డెలులు డేటింగ్‌ అంటే సింపుల్‌గా మీరు ఎదుటి వ్యక్తి గురించి ఒక భ్రమలో బతకడం. మీ పార్ట్‌నర్‌ గురించి ఎల్లప్పుడూ రియాలిటీకి దూరంగా సంబంధం లేకుండా వారిపై అంచనాలను, ఊహలను ఏర్పరుచుకుంటారు. వారు చేసే చిన్న చిన్న పనులను కూడా అతిగా అంచనా వేసుకుని మీ మనసులో ఆ రిలేషన్‌ గురించి ఒక అభిప్రాయానికి వస్తుంటారు.

సంకేతాలు ఇవే..

మీరు ఇష్టపడిన వ్యక్తి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని మీరు ప్రత్యేక సంకేతంగా భావించినట్లయితే దానిని మీ భ్రమలతో కూడిన డేటింగ్‌కి సంకేతంగా కావచ్చని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. వారు మిమ్మల్ని అభినందించినా, మీకు విషెస్‌ చెప్పినా, హాయ్‌ చెప్పినా దానిని మీరు అతిగా ఊహించుకుంటూ ఆ వ్యక్తితో రిలేషన్‌ను గాఢంగా ఊహించుకుంటారు.

ఫ్యూచర్‌ను ఊహించుకుంటే..

ఎదుటి వ్యక్తితో మీ రిలేషన్‌షిప్‌ అంత బలంగా లేకపోయినా మీరు మొదటి నుంచి పెళ్లి జరిగినట్లుగా ఊహించుకోవడం, ఆ వ్యక్తితో కలిసి జీవించడం, దీర్ఘకాలికంగా ఆ వ్యక్తితో మీరు కలిసి ఉంటున్నట్లుగా కలలు కంటుంటారు.

Delulu dating Signs you should know it reveals the truth about a relationship

లోపాలను విస్మరించడం..

ఈ రకమైన డేటింగ్‌లో మీరు మీకు నచ్చిన వ్యక్తి తప్పులను, హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తుంటారు. ఆ వ్యక్తి గురించి మీకున్న అభిప్రాయాలే నిజమని భావించి అదే ఆలోచనలో ఉంటుంటారు.

సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌

డెలూలు డేటింగ్‌లో ఆ వ్యక్తి సోషల్‌ మీడియా అప్‌డేట్‌లను తరచూ ఫాలో అవుతుంటారు. ఆ వ్యక్తి ఏ పోస్ట్‌ చేసినా లైక్‌లు, కామెంట్‌లు చేస్తుంటారు. స్టోరీలకు రియాక్షన్లు, ఆన్‌లైన్‌ కార్యకలాపాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది కూడా మీరు భ్రమల్లో జీవిస్తున్నట్లేనని చెప్పడానికి సంకేతం.

వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేరు..

మీకు నచ్చిన వ్యక్తిపై మీ అంచనాలనే మీరు నిజంగా భావిస్తుంటారు. ఎదుటి వ్యక్తి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. దీని వల్ల మున్ముందు రిలేషన్‌షిప్‌లో అపార్థాలు చోటుచేసుకుంటాయని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.

రిలేషన్‌షిప్‌పై ప్రభావం

ఇలాంటి భ్రమలతో కూడిన ఆలోచనలను మీరూ అనుభవిస్తున్నట్లయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ సంకేతాలు కొన్ని సార్లు సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ అవి వాస్తవానికి దూరంగా ఉంటే మిమ్మల్ని నిరాశకి దారితీస్తాయి. ఆరోగ్యకరమైన సంబంధానికి భావోద్వేగాలను, వాస్తవికతను అర్థం చేసుకోవడం ముఖ్యం. అవతలి వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా మీ ఆలోచనలను నియంత్రించుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

Story first published: Monday, July 20, 2026, 14:22 [IST]
Desktop Bottom Promotion