Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మీ భార్య లేదా భర్తలో ఈ సంకేతాలు గమనించారా? డేంజర్ లో ఉన్నట్లే,వెంటనే విడిపోవడం బెస్ట్!
ప్రతి వివాహం విజయవంతం అవ్వాలనే అందరూ కోరుకుంటారు. అయితే అలా అవుతుందన్న గ్యారెంటీ ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి వివాహం విజయవంతం కావాల్సిన అవసరం లేదు. వివాహ బంధంలో మీ మానసిక ఆరోగ్యానికి,ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. ఒక రిలేషన్ మీ జీవితంలో ఆనందానికి బదులుగా బాధను తీసుకొస్తున్నప్పుడు విడిపోవడం సరైన నిర్ణయం కావచ్చు. వివాహం అనేది వ్యక్తిగత, భావోద్వేగ సంబంధం. అయితే ఈ సంబంధం విషపూరితమైనదిగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?
బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల టెకీ అతుల్ సుభాష్ తన భార్య, ఆమె బంధువుల వేధింపులు, మానసిక హింసలు తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో పెళ్లి మానసిక అలసటను కలిగిస్తుందా అనే ప్రశ్న సమాజంలో తలెత్తుతుంది. ఒక వ్యక్తి తన వివాహ బంధంలో మానసికంగా విచ్ఛిన్నమైతే.. అతను విడాకులు తీసుకోవడం కరెక్ట్ ఏనా? రిలేషన్ షిప్ ని ముగించడం ఎప్పుడు అవసరం? ఈ ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చూడండి.

విడాకులు ఎప్పుడు సరైన నిర్ణయం ? ముఖ్యమైన సంకేతాలు
మందు,డ్రగ్స్
మీ భాగస్వామి మందు,డ్రగ్స్ వ్యసనం లేదా జూదం వంటి ఏదైనా వ్యసనానికి గురైనట్లయితే, మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారు సహాయం తీసుకోవడానికి సిద్ధంగా లేకుంటే అది మీ వివాహ బంధానికి పెద్ద ముప్పుగా మారవచ్చు. వ్యసనాన్ని అధిగమించడానికి ఒక వ్యక్తి తనంతట తానుగా కష్టపడాలి,మీ భాగస్వామి మార్పుకు సిద్ధంగా లేకుంటే వివాహం విషపూరితంగా మారిందని ఇది సంకేతం. మీరు మీ మానసిక ఆరోగ్యం, జీవితంలో మెరుగ్గా ఉండాలనుకుంటే అలాంటి సంబంధం నుండి బయటకు రావడమే ఏకైక పరిష్కారం.
ఇందుకోసమే మీతో ఉంటే
శారీరకంగా, లైంగికంగా, భావోద్వేగంగా లేదా ఆర్థికంగా దుర్వినియోగం అంటే మిమ్మల్ని కేవలం ఇలా వాడుకుంటున్నట్లయితే మీ భాగస్వామి మీకు ప్రమాదకరంగా మారుతున్నట్లయితే, ముఖ్యంగా మీ భాగస్వామి పిల్లల పట్ల దుర్భాషలాడినట్లయితే అప్రమత్తంగా ఉండండి. ఏ రకమైన దుర్వినియోగం అయినా సంబంధానికి మంచిది కాదు, అలాంటి పరిస్థితుల్లో విడిపోవడమే సరైన నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు.
ఎఫైర్ కంటిన్యూ
మీ భాగస్వామికి ఎఫైర్ ఉంటే ఎంత చెప్పినా వారు కంటిన్యూ చెస్తున్నా లేదా దానిని ముగించి మీతో సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి సిద్ధంగా లేకుంటే అది విడాకులకు సంకేతం కావచ్చు. నమ్మకం విచ్ఛిన్నమైతే, రిలేషన్ ని రిపేర్ చేయలేకపోతే విడిపోవడమే సరైన నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు.
సాన్నిహిత్యం లేకపోవడం
దంపతుల మధ్య శారీరక లేదా మానసిక సాన్నిహిత్యం లేకపోవడం..కౌన్సిలింగ్ లేదా పెద్దల పంచాయితీ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోతే అది విడాకులకు కారణం కావచ్చు. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం ముఖ్యం,వైద్య సమస్య కారణంగా సన్నిహితంగా ఉండటం కష్టంగా ఉంటే దానిని ఇతర మార్గాల్లో సాధించవచ్చు. భాగస్వామికి సామర్థ్యం ఉన్నప్పటికీ ఏ విధమైన సాన్నిహిత్యానికి కూడా దూరంగా ఉంటే, సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపకపోతే అది వివాహంలో పెద్ద ఇబ్బందులకు సంకేతం.
సయోధ్యకు సిద్ధంగా లేకుంటే
వివాహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇద్దరి భాగస్వామ్యం అవసరం. ఇది ఏకపక్షంగా ఉండదు. ఒక భాగస్వామి ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటే,మరొకరు చేయకపోతే ఆ రిలేషన్ పనిచేయడం కష్టం.



Click it and Unblock the Notifications