Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?.. ముద్దుతో ఎన్ని ప్రయోజనాలా? తెలిస్తే షాక్ అవుతారు!
ఒక వ్యక్తిపై శారీరకంగా ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు ఇస్తూ ఉంటాము. అది పిల్లలపైనా లేదా భాగస్వామిపైనా ఎవరిపైనా అయినా కావచ్చు. ముద్దు అనేది లవ్ సైన్‌గా పని చేస్తుంది. అలాంటి ముద్దుతో శారీరకంగా మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా ఒత్తిడితో బాధ పడే వారికి ముద్దులు ఒక వరంలా పని చేస్తాయని పలు అధ్యయనాల్లో తేలినట్లు చెబుతున్నారు. అయితే ముద్దుల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ముద్దుల్లో రకాలు ఎన్ని, అధ్యయనాలు ఏం చెబుతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక ప్రయోజనాలు:
ముద్దు పెట్టుకోవడం వల్ల అనేక శారీరక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముద్దు పెట్టుకోవడం వల్ల లాలాజలం మార్పిడి జరుగుతుందని, దీని కారణంగా ఇద్దరి శరీరంలోని యాంటీ బాడీల్లో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఇలా మార్పులు జరగడం వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు ఉన్న వారికి కూడా ముద్దు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని చెబుతున్నారు.

నెమ్మదిగా ముద్దు పెట్టుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుందని, హార్ట్ రేట్ కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. ముద్దు దంతాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట. ముద్దు పెట్టుకున్నప్పుడు లాలాజలం మార్పిడి జరిగి.. లాలాజలం ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా అవి దంతాలను, చిగుళ్ళను శుభ్రపరుస్తుందని పలు అధ్యయనాలతో పాటు నిపుణులు కూడా చెబుతున్నారు.
మానసిక ప్రయోజనాలు:
ఎండార్ఫిన్ అనే హార్మోన్లు సాధారణంగా ఆనందాన్ని పెంచుతాయి. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల ఈ హార్మోన్లు విడుదలై.. మనిషి ఆనందంగా ఉండేలా చేస్తాయట. అలాగే కిస్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుందని, ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ముద్దు అనేది బంధం బలపడానికి ఉపయోగపడుతుందని.. ముద్దు పెట్టుకోవడం వల్ల మీరు మీ భాగస్వామి అన్యోన్యంగా ఉంటారని చెబుతున్నారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారని పేర్కొంటున్నారు.
నిజానికి ముద్దు అనేది భాగస్వామిపై నమ్మకం పెరగడానికి ఉపయోగపడుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ 2018లో చేసిన అధ్యయనంలో తేలింది. కిస్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గుర్తిస్తారట. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వల్ల శారీరక, మానసిక నొప్పులు సైతం దూరమవుతాయని అందులో వెల్లడించారు.
ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయంటే..
ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాలకు తగ్గట్లే వాటితో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. రొమాంటిక్ కిస్, ఫ్రెంచ్ ముద్దు, పెక్ ముద్దు, నుదుటిపై ముద్దు ఇవి ముఖ్యమైనవని చెప్పుకుంటారు. అందులో రొమాంటిక్ కిస్ చేసుకుంటే.. ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతుందని, బంధం బలపడుతుందని చెబుతున్నారు. రొమాంటిక్ కిస్ కారణంగా ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయని, ఇవి బంధం బలపడేందుకు పనికొస్తాయట.
అదే ఫ్రెంచ్ కిస్ వల్ల మెదడులోని ఆనందం, కోరికలతో కూడిన ప్రాంతం ప్రేరేపితమవుతుందని దీని వల్ల ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. పెక్ ముద్దు వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయని.. ఇవి మనిషిని సంతోషంగా, ఆనందంగా ఉండేసుకు సహకరిస్తాయట. నుదుటిపై ముద్దు పెట్టుకోవడం వల్ల ఆప్యాయత, ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications