Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గర్వకారణమైన వేశ్య..ఈమె దెబ్బకు సోషల్ మీడియా షేక్..టీనేజ్ అమ్మాయిలు కూడా..
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ మార్మోగిపోతోంది. అదే #ProudRandi. వేశ్య అనే పదాన్ని ఎంతో అవమానకరంగా భావించే మన సమాజంలో ఇప్పుడు చాలామంది మహిళలు తమ ప్రొఫైల్స్ కు ఈ ట్యాగ్ ను గర్వంగా తగిలించుకుంటున్నారు. నేను ప్రౌడ్ రండి(గర్వంగా నేను వేశ్య) అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఏమిటీ ఉద్యమం? ఎందుకింత వైరల్ అయింది?
ఆన్ లైన్ లో ఒక మహిళ తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పినా, కాస్త మోడ్రన్ గా దుస్తులు వేసుకున్నా చాలు.. కామెంట్ల రూపంలో ఆమెపై అక్షరాల దాడి మొదలవుతుంది. వేశ్య,లంజ వంటి నీచమైన పదాలతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. ఇలాంటి వేధింపులతో ఎందరో మహిళలు మానసికంగా కుంగిపోతున్నారు.

తన ఆన్ లైన్ వీడియోల కారణంగా పురుషులు తనను నిరంతరం రండి( హిందీ రండి అంటే వేశ్య) అంటూ కామెంట్లలో వేధించడంతో ఢిల్లీకి చెందిన ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ దివిజా భాసిన్ ఈ పదం శక్తిని నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ పదాన్ని ఒక బూతుగా కాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సొంత అభిప్రాయాలతో ఉండే ప్రతి మహిళకు గర్వకారణమైన బిరుదుగా మార్చాలని నిర్ణయించుకుంది.
I AM PROUD RANDI పేరుతో యూట్యూబ్ లో ఒక వీడియో చేసింది. అందులో.. "అవును, నేను నిజాన్ని అంగీకరిస్తున్నాను. నేను ఒక రండి.. ప్రౌడ్ రండి. గుర్తుంచుకోండి #RandiSupremacy" అంటూ సవాల్ విసిరింది.
ప్రశంసల నుండి కేసుల వరకు
దివిజా భాసిన్ పిలుపుతో ఎందరో యువతులు, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు #ProudRandi హ్యాష్ ట్యాగ్ ను తమ సోషల్ మీడియా బయోలలో చేర్చుకుని మద్దతు తెలిపారు. ఒక నిందను ధిక్కార ప్రకటనగా మార్చుకున్న ఆమె ధైర్యాన్ని పలువురు ప్రశంసించారు.
పురుషులు మహిళలను కించపరచడానికి వాడే బూతులను శక్తిహీనం చేయడమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. మహిళలు ఆ పదాన్ని అవమానంగా భావించినంత కాలం వేధించేవారికి ఆనందం.
అదే పదాన్ని గర్వంగా స్వీకరిస్తే, వారి చేతిలోని ఆయుధాన్ని మనమే లాగేసుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత వేధించడానికి వాళ్ల దగ్గర ఏమీ ఉండదన్నది దివిజ వాదన. పాశ్చాత్య దేశాల్లో జరిగిన స్లట్ వాక్ వంటి ఉద్యమాల స్ఫూర్తితో ఆమె ఈ పిలుపునిచ్చింది.
వ్యతిరేకత.. వివాదం
అయితే ఈ ఉద్యమానికి ఎంత మద్దతు లభిస్తోందో, అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 14-15 ఏళ్ల వయసున్న చిన్నారులు కూడా ఈ ట్యాగ్‌ను వాడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారిని తప్పుదోవ పట్టిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. దివిజా భాసిన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విమర్శలపై దివిజ స్పందిస్తూ..ఇన్నాళ్లూ మహిళలను రండి అని పిలిచి వేధించిన పురుషులే ఇప్పుడు మేం ఆ పదాన్ని స్వీకరిస్తే పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని బదులిచ్చింది.



Click it and Unblock the Notifications