Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చిన్న కారణాలకే విడాకులు.. కుర్‌కురే తేలేదని డైవర్స్..!
పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నాయో విడాకులు కూడా అదే సంఖ్యలో జరుగుతున్నాయి.ఒకప్పుడు డైవర్స్ అంటే సీరియస్ అంశంగా తీసుకునేవారు. ప్రస్తుతం చాలా మంది జంటలు డైవర్స్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు. విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ పద్ధతి ఇప్పుడు భారతదేశంలోనూ వ్యాపిస్తోంది. చాలా చిన్నచిన్న కారణాలకే భార్యాభర్త విడిపోతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో భర్త కురుకురే తేలేదని భార్య భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది విడిపోతున్నారు. అలాంటి చిన్న చిన్న కారణాలతో విడిపోయిన జంటలకు సంబంధించినవి మీకు కొన్ని అందిస్తున్నాము.
నాకు ఒక కజిన్ ఉన్నాడు. అతను సంవత్సరానికి నాలుగు సార్లు పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకున్నాడు. ఒక కేసులో భార్య అతనికి గడ్డి పొడువుగా పెరిగింది దాన్ని కట్ చేయాలని చెప్పింది. అలా చెప్పడం భర్తకు నచ్చలేదు దీంతో అతను ఆమెకు విడాకులిచ్చాడు. ఇదేంటని అతన్ని ప్రశ్నించినందుకు.. నాకు ఏ మహిళా సలహాలు ఇవ్వడం నచ్చదని బదులిచ్చాడు.
చిన్ని చిన్ని కారణాలకే విడాకులు ఇచ్చుకుంటున్న జంటలు..
ఒక ముసలావిడ అయిదో సారి తన భర్తకి విడాకులిచ్చింది. కిచెన్ లో చేసే మార్పులు ఆమెకు నచ్చకపోవడంతో విడాకులిచ్చింది.
నిద్రపోయేటప్పుడు గట్టిగా గురక పెట్టడం వల్ల కూడా భార్య భర్తకు డివోర్స్ ఇచ్చింది.

ఒక కేసులో వ్యవసాయదారుడైన భర్త భార్యని బాగా చదివించాడు. మంచి ఉద్యోగం చేసేందుకు సహాయం చేసాడు. ఉద్యోగం చేయడానికి కూడా అంగీకరించాడు. అయితే తరువాత భార్య తన తెలివితేటలకి భర్త సరిపోడని భావించి భర్తకు విడాకులిచ్చింది.
భార్య కు జ్యోతిష్యం, జాతకాలపై ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి. ఆమే జాతకంలో ఆమెకు మూడు పెళ్లిళ్లు అవుతాయని తెలుసుకుంది. అలా తెలిసిన వెంటనే తాను రెండు పెళ్లిళ్లు చేసుకోని మొదటి ఇద్దరికీ చక చకా డివోర్స్ ఇచ్చేసింది.
మరో కేసులో ఫోన్ కారణంగా భార్య భర్తకు విడాకులిచ్చింది. భర్త భార్య కోసం ఫోన్ కొనిచ్చాడు. కానీ అది ఆండ్రైడ్ ఫోన్ కావడం వల్ల ఆమె విడాకులిచ్చింది. గతంలో ఇద్దరి ఫోన్లు సింక్ అయి భర్త ఫోన్‌లో ఏమి చేసేవాడో గమనించే అవకాశం ఉండేది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆ ఫీచర్ లేకపోవడం వల్ల విడాకులివ్వాల్సి వచ్చిందని భార్య స్పష్టం చేసింది.
భార్యా భర్త ఇద్దరూ ఇళ్లు మారి వేరే ఇంట్లో ఉండడానికి తాము తెచ్చుకున్న ఇంటి సామాన్లన్నీ కిందకు దించివేస్తున్నారు. వాటిల్లో భర్త భార్యకు చెందిన పియానోను ఇంట్లోకి తీసుకొచ్చేందుకు నిరాకరించడాడు. పియానో పెట్టడానికి ఇంట్లో స్థలం లేదని ఉంటే పియానో ఉండాలి లేదా ఇద్దరం ఉండాలి లేకపోతే విడిపోదాం అనడంతో భార్య వెంటనే అతనికి డైవర్స్ ఇచ్చేసింది.
తాను నాటిన స్ట్రాబెర్రీ చెట్ల నుంచి రోజూ పళ్లు తింటున్నాడనే కారణంతో భర్తకు భార్య విడాకులిచ్చింది.
డైవర్స్ కావడానికి గల ముఖ్య కారణాలను మీకు అందిస్తున్నాం. చాలా డైవర్స్ కేసులను పరిశీలించిన తరువాత ఎక్కువగా ఈ కారణాలే బయటపడ్డాయి. పెళ్లి తరువాత అక్రమ సంబంధం డైవర్స్‌కు దారితీస్తుంది. ఆర్థిక సమస్యలు, భార్యా భర్త కలిసి మాట్లాడుకోలేకపోవడం, తరచుగా వాదనలు చేసుకోవడం, బరువు పెరగడం, భార్య లేదా భర్త నుంచి ఎక్కువగా ఆశించడం, రొమాన్స్ లేకపోవడం, ఒకరిని ఒకరు అవమానించుకోవడం, పెళ్లికి సిద్ధంగా లేకపోవడం. ఈ కారణాలే డైవర్స్‌కు ఎక్కువగా దారితీస్తున్నట్లు కనుగ్గొన్నారు.



Click it and Unblock the Notifications