Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పొరపాటున కూడా భార్యతో భర్త ఇలా చేయకూడదు.. ఎందుకంటే?!
మన దేశంలో వైవాహిక బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ బంధాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాం కూడా. పెద్దలు కూడా పెళ్లిని రెండు చక్రాల బండితో ముడిపెడుతూ ఉంటారు. రెండు చక్రాల బండిలో ఒక చక్రం విరిగినా ఇంకో చక్రం పని చేయదు. అలానే భార్య భర్తల్లో ఒకరికి ఏమైనా అయినా విడిపోయినా వైవాహిక బంధం ముందుకు సాగదు.
వైవాహిక బంధం అంటే సహజంగానే భార్య, భర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి ఈ బంధం ధృడంగా ఉంచుకోవాలంటే భాగస్వామ్యులిద్దరి కృషి, శ్రమ, ప్రేమానురాగాలు అవసరం. అయితే ఈ బంధం బలపడకుండా మధ్యలోనే విడిపోయేలా చేసుకోకూడదు. అందుకోసం భార్యకు భర్త కొన్ని విషయాలు చెప్పకుండా ఉండాలి. అలాంటప్పుడే బంధం బలంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. అయితే చెప్పకూడని ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భార్యతో పంచుకోకూడని విషయాలు ఏంటంటే..
ఒక భర్త ఎప్పుడూ తన భార్య శరీర ఆకృతులు గురించి భార్యతో ప్రస్తావించకూడదు. సన్నగా, లావుగా ఉన్నావు అని అనడం, శరీర ఆకృతులను వివరిస్తూ హేళన చేయడం వంటివి చేస్తే అది భార్యకు నచ్చదు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం.. భర్తలు తమ బలహీనతల గురించి ఎప్పుడూ తమ భార్యలతో చెప్పుకోకూడదంట. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెకు అవకాశమొస్తుందో ఆ బలహీనతను భర్తపై చూపి గెలవాలనుకుంటుందట. అలాగే భర్తకు జరిగే అవమానాన్ని ఎప్పుడూ ఆమెతో పంచుకోకూడదని, అలా చేయడం వల్ల ఆమె కూడా భవిష్యత్తులో అదే రీతిలో భర్తను అవమానపరిచే అవకాశముందని చెప్పారు.
సంపాదన గురించి..
భర్త ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడో అనేది భార్యకు తెలియకపోతేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల భర్త ఆర్ధిక స్వతంత్రాన్ని కోల్పోయే అవకాశం ఉందని, క్రమంగా అది అతనికి బలహీనంగా మారనుందని చెబుతున్నారు. అదే క్రమంలో ఇద్దరి మధ్యల మనస్పర్థలు పెరగడం బంధంలో దూరం నెలకొనడం వంటివి జరుగుతాయట.
విరాళాల గురించి చెప్పకపోవడం..
నిజానికి ఏదైనా విరాళం ఇస్తే.. కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని అంటూ ఉంటారు. అదే విధంగా భర్త ఏదైనా విరాళం ఇస్తే అది భార్యకు చెప్పకూడదని చెబుతున్నారు. ఇలా చెప్పడం వల్ల తనకు తెలియకుండానే ఇంకా ఎంత ఖర్చు చేస్తున్నారో అనే భావన భార్యలో కలుగుతుందని, తనకు కాకుండా ఇంకెవరికో ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకుంటారని పేర్కొంటున్నారు.
ఇతర బంధాలను పెట్టుకోకూడదు.. ఉంటే చెప్పకూడదు..
సాధారణంగా వివాహేతర సంబంధమే తప్పు. ఇది అత్యంత ప్రమాదకరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది వివాహేతర సంబంధంలో కొనసాగుతూ దానిని తెలియకుండా ఉంచుతున్నారు. అయితే ఆ బంధాన్ని తెంచుకోవాలి. అలాగే ఆ బంధానికి సంబంధించిన ప్రస్తావనను మీ భార్యతో ఎప్పుడూ పంచుకోకూడదు. అలా పంచుకుంటే.. ఆమెకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భర్తను చులకనగా చేసి చూసే ఛాన్స్ ఉంటుంది.



Click it and Unblock the Notifications