Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
భార్యాభర్తల ముద్దూ ముచ్చట్ల గురించి.. వాళ్లకు చెప్పొద్దు
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర అత్యంత విలువైనది. కుటుంబసభ్యుల తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేది వారికే. ప్రాణ స్నేహితులకు భావించే వారితో అన్నీ షేర్ చేసుకుంటాం. కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గురించి కూడా చెప్పుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎంత ప్రాణ స్నేహుతులు అయినా.. వారితో కూడా పరిమితికి మించి అన్ని విషయాలు చెప్పకూడదని సూచిస్తున్నారు. ఎందుకో తెలుసా?

ఆ విషయాలు అస్సలే చెప్పొద్దు:
దంపతులు మధ్య ఎన్నో విషయాలు ఉంటాయి. భార్యాభర్తలన్నాక గొడవలు, అలకలు, కలహాలు చాలా సాధారణం. ముద్దూ ముచ్చట ఎలాగూ ఉంటాయి. కొందరు స్నేహితులే కదా అని వారితో అన్ని పంచుకుంటారు. ఆలూమగల మధ్య జరిగే అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. బహుమతులు ఇచ్చినా, సర్‌ప్రైజ్ లు ఇచ్చినా.. చిన్న చిన్న గొడవలు అయినా వారికి చెబుతుంటారు. ఇది చాలా తప్పని అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. భార్యాభర్తల మధ్య విషయాలను ఎవరితోనూ చెప్పకూడదని, వాటిని కేవలం ఇద్దరి మధ్యే ఉంచుకోవాలని అంటున్నారు.
ఎందుకంటే.. వారి గురించి మంచి చెబితే ఏం పర్లేదు.. కానీ, గొడవలు, అలకలు, కలహాల గురించి చెబితే మీ స్నేహితులకు మీ భాగస్వామిపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. మీకు మీరుగా పరిష్కరించుకోలేని గొడవలైతే.. వారికి చెప్పుకుని సలహాలు తీసుకోవచ్చు.. కానీ మిగతా విషయాలను మీ మధ్యే ఉంచుకోవడం మంచిది.
కోపం, బాధలో విషయాలు చెప్పకూడదు:
రోజూ పనుల వల్ల చాలా మంది ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొంటారు. దీంతో కోపం, చిరాకు వస్తుంది. ఇలాంటి సమయంలో మనసును తేలికపరచుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తుంటారు. ఇలా, అలా అంటూ మొత్తం వివరించి చెప్పేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది మంచి ఆలోచనే అయినప్పటికీ.. స్నేహితులపై అతిగా ఆధారపడటం మంచిది కాదని అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
ఒకటీ రెండు సార్లు పర్లేదు. మాటిమాటికీ ఇలా చేస్తూ పోతే వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం లేకపోలేదు. అలాగే ఫోన్ చేసిన ప్రతీసారి బాధల గురించి చెప్పుకుంటే.. వాళ్లకు కూడా బాధలు, ఒత్తిడి ఉండొచ్చు. మీరు వాటి గురించే మాట్లాడితే అది ఎక్కువ కావొచ్చు.
శృంగారం టాపిక్ తీయొద్దు:
శృంగారం అంటే ఆలుమగలకు మాత్రమే సంబంధించిన అంశం. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు. సెక్స్ అంటే ఇద్దరి జీవితాల్లో అత్యంత సున్నితమైనది. శృంగార సమస్యలు వచ్చినా వాటిని నాలుగ్గోడల మధ్య మీరిద్దరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. శృంగార విషయాలు స్నేహితులతో చెప్పడం, మీరు చెప్పిన విషయం మీ భాగస్వామికి తెలియడం వల్ల లేని పోని గొడవలు జరిగి సంబంధం తెగిపోయే అవకాశాలు ఉంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications