Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
రోడ్డు సైడ్ అమ్మే మూలికలతో నిజంగానే శృంగార సామర్థ్యం పెరుగుతుందా? అసలు నిజం ఇదే..
మనం తరచుగా రోడ్డు పక్కన ఒక షెడ్డు వేసుకొని.. దానిలో ఆయుర్వేదానికి సంబంధించిన మూలికలు అమ్మే దృశ్యాలు చూస్తూ ఉంటాము. వాటి ముందు కచ్చితంగా శృంగార సామర్థ్యం కోసం అని బోర్డు కూడా పెడుతుంటారు. ఆ షెడ్డుల్లో రక రకాల మూలికలు అమ్ముతుంటారు. అవి తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని చెబుతుంటారు. అది నమ్మి కొందరు వ్యక్తులు ఆ మూలికలను కొంటారు కూడా. అయితే రోడ్డు సైడ్ అమ్మే మూలికల వల్ల నిజంగానే శృంగార సామర్థ్యం పెరుగుతుందా? ఆ మూలికలు ఎంతవరకు నిజం? వాటిని తీసుకుంటే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొన్ని నిజమే..
రోడ్డు సైడ్ అమ్మే మూలికల్లో కొన్ని నిజమైన మూలికలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని మూలికలు నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని మూలికలు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి, మనోవేదనను తగ్గిస్తాయి. అలాగే మరికొన్ని మూలికలు శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను రక్షించి వాటిని కాపాడతాయి. అయితే శృంగారం విషయంలో అవి పూర్తిగా సహకారం అందిస్తాయాంటే కాదు అని చెప్పుకోవచ్చు.

శృంగారంలో..
రోడ్డు సైడ్ అమ్మే మూలికల కారణంగా శృంగార సామర్థ్యం పెరుగుతుందా అనేది చాలా సంక్లిష్టమైన విషయం. శృంగార సామర్థ్యం అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. శారీరక, మానసిక, భావోద్వేగ విషయాలపై ఈ అంశంపై ఆధారపడి ఉంటుంది. కేవలం మూలికలు తినడం వల్ల ఆ సామర్థ్యం పెరుగుతుందంటే అది ఒప్పుకోదగ్గ విషయం కాదని చెప్పుకోవచ్చు. అలాగే ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కూడా లేదు. అందుకే శృంగారం కోసం అయితే ఆ మూలికలను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం
రోడ్డుపక్క అమ్మే మూలికల గురించి జాగ్రత్తలు:
రోడ్డుపక్క అమ్మే మూలికలు ఎంత వరకు శుభ్రంగా ఉంటాయో తెలియదు. శుభ్రంగా లేకపోవడంతో పాటు చాలా రోజులుగా అవి నిలువ ఉండడంతో వాటిని తినడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు, కొన్ని మూలికలకు బదులు వేరే మూలికలను అమ్మే అవకాశం ఉంది. అవి నకిలీగా ఉండడంతో పాటు ఎలాంటి ప్రభావం చూపవు. ఈ క్రమంలో వాటిని కొనుగోలు చేసి డబ్బులు వృథా చేసుకోవడం తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఏ మూలికను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియక, అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
శృంగార సామర్థ్యం పెంచుకోవాలంటే:
ఇతర మందులు, ఇలా మూలికల పైన ఆధారపడకుండా సహజకంగానే శృంగార సామర్థ్యం పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. దీంతో పాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే శరీరానికి, మనసుకు తగినంతగా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలి. అలాగే ఏదైనా లైంగిక పరమైన సమస్యలు ఉంటే.. వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి.



Click it and Unblock the Notifications