Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ప్రేమలో మోసపోకుండా ఉండాలంటే ఈ పనులు చేయాలి, జన్మలో మోసపోరు!
భార్య భర్తల మధ్య అయినా, ప్రేమికుల మధ్య అయినా గాఢమైన ప్రేమ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ బంధం బలంగా ఉండాలంటే కచ్చితంగా ప్రేమ ఉండాల్సిందే. ప్రేమ మాత్రమే కాదు.. ప్రేమతో పాటు నమ్మకం, నిజాయితీ కూడా అవసరం. ఇవన్నీ ఉంటేనే వివాహ బంధంలోనైనా, ప్రేమ బంధంలోనైనా కలకాలం కలిసి ఉండగలం. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. జంటల మధ్య, మనస్పర్థలు, ఒకరిని ఇంకొకరు మోసం చేయడం, ఒకరు ఉండగానే ఇంకొకరితో ప్రేమాయణం నడపడం వంటివి జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఎంత గాఢమైన ప్రేమలో ఉన్నా, ఎదుటి వ్యక్తి ఎంతలా మిమ్మల్ని ప్రేమిస్తున్నా చాలా మంది తమ తమ స్వార్థం కోసం ఎదుటి వ్యక్తులను మోసం చేస్తున్నారు. దీంతో ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి తన జీవితాన్ని అందంగా మలుచుకుంటే, మరొక వ్యక్తికి బాధ, దుఃఖం మాత్రమే మిగిలిపోతుంది. వాటి నుంచి బయటపడేందుకు వారికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ స్టోరీలో ప్రేమలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి? అనేది తెలుసుకుందాం.

భావోద్వేగాలను నియంత్రించుకోవడం..
మనిషి నియంత్రణలో లేనిది ఏదైనా ఉందంటే అది భావోద్వేగాలే. వాటిని ఎంతలా నియంత్రించుకున్నా అవి మితిమీరుతుంటాయి. అనేక సందర్భాల్లో, మనస్సు మరియు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతాం. ఈ భావోద్వేగాలు అదుపులో లేని సమయంలో మనం ఏం చేయాలి?, ఏం చేయకూడదు అనేది తరువాత తెలుస్తుంది. అందుకే ప్రేమలో ఉన్న వ్యక్తులు లేదా భార్య భర్తలు తమ భాగస్వామి భావోద్వేగాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి భావోద్వేగాలను పర్యవేక్షిస్తే వారి ప్రేమను కచ్చితంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రేమలో పడడానికి ముందే ఆ వ్యక్తి నిజాయితీని కూడా గమనించాలి. వారి రూపురేఖలు చూసి ప్రేమలో పడితే రేపటి రోజున కచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు.
సరైన నిర్ణయాలు తీసుకోవడం..
ప్రేమలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మనస్సు కూడా సహాయం చేస్తుంది. ప్రేమలో ఉండే వ్యక్తులు భావోద్వేగాలతో కాకుండా, ఆచరణాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. మోసపోయే వ్యక్తి తమ మాటలు, ప్రవర్తన ద్వారా వారి నిజమైన ఆలోచనలు వెల్లడిస్తారు. అబద్ధాలు చెప్తూ, తమ ప్రవర్తన ద్వారా ఇతరులను వంచించేవారిని జాగ్రత్తగా గమనించండి. అటువంటి వ్యక్తులతో సంబంధం కొనసాగించడం చాలా ప్రమాదకరం.
పక్షపాతం, అహంకారం దూరం..
ప్రేమలో పక్షపాతం, అహంకారం వంటివి కూడా ఉండకూడదు. ఒక సంబంధంలో మీ ఆత్మ గౌరవం హరించడం ప్రారంభిస్తే, మీరు దాన్ని ఆపేందుకు ముందడుగు వేయాలి. ఇతరులు మీ గౌరవాన్ని తీసుకోవడాన్ని అనుమతించకూడదు. ఎందుకంటే అది నమ్మకానికి, నిజాయితీకి హాని కలిగిస్తుంది. గౌరవం లేని సంబంధం త్వరగా విడిపోతుంది.
ప్రేమలో జాగ్రత్త, నమ్మకం, ఆలోచన చాలా ముఖ్యమైనవి. ఎప్పటికప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. సరిగా ఆలోచించి, దాని తర్వాత సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రేమలో జరిగే తప్పులను ఎప్పుడూ చూసీచూడనట్టు వదిలేయకూడదు. ఒకవేళ మీరు ప్రేమలో మోసపోతే మీరు ఎన్నో రకాల బాధలను, దుఃఖాన్ని అనుభవించొచ్చు. అందుకే ఆ బాధలను, దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలంటే ప్రేమలో మోసపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.



Click it and Unblock the Notifications