Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ఈ ట్రిక్ పాటించి.. పార్ట్‌నర్‌కు మరింత దగ్గరవ్వండి..!
ప్రస్తుతమున్న జీవనవిధానంలో ఒకరితో ఒకరు గడపడానికి కూడా సరిగ్గా సమయం సరిపోవడం లేదు. ఉన్న సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి. రిలేషన్‌షిప్‌లో దీనికి సంబంధించిన టైమ్ మ్యానేజ్‌మెంట్ చాలా ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్ట్‌నర్‌కు కఛ్ఛితంగా టైమ్ కేటాయించాల్సిందే. భర్త పనిచేసి భార్యా ఇంటిని చూసుకుంటే ఇద్దరికీ మాట్లాడుకోవడానికి, సమయం గడపడానికి అవకాశం వుంటుంది. కానీ ఈ మధ్య ఇద్దరూ పనిచేయడం వల్ల ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి సమయం సరిపోవడం లేదు. దీని వల్ల చాలా మంది జంటల్లో గొడవలు వస్తుంది. వారు విడిపోవడానికి కూడా ప్రధాన కారణమవుతుంది.
బిజీ లైఫ్ ఎంత వున్నప్పటికీ తగిన మీ పార్ట్‌నర్‌తో సమయం గడవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఉదయం నిద్రలేవగానే పనికి పరిగెత్తడం కాకుండా భాగస్వామికి కూడా తగిన ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఈ బిజీ లైఫ్‌లో పార్ట్‌నర్‌తో సమయం ఎలా గడపాలి, ఉదయం లేవగానే పార్ట్‌నర్‌తో ఎలా మాట్లాడాలి, ఇద్దరి బంధం ఎలా బలపడుతుందో మేము మీకు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాం.

దంపతులు ఇద్దరూ లేవగానే ఒకరికి ఒకరు గుడ్ మార్నింగ్ విషెస్‌ను చెప్పుకోవాలి. ప్రతీ రోజూ ఇలాగే చేసుకోవాలి. ఇద్దరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం. ఇంట్లో వున్నంతసేపు మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయడానికి ప్రయత్నించాలి. రోజంతా ఆఫీస్ పనుల వల్ల మాట్లాడే అవకాశం లేకపోవడం, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి మాట్లాడలేకపోవడం వల్ల దంపతులు కలవడానికి అవకాశం వుండడం లేదు.
భార్యా భర్తలిద్దరూ కలిసి లంచ్ చేసే అవకాశం దొరకదు. కేవలం వీకెండ్ లో మాత్రమే ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి సమయం గడపడానికి వీలు వుంటుంది. కాబట్టి ప్రతీ రోజూ ఇద్దరూ కలిసి కచ్ఛితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. టీ తాగడం, టిఫిన్ చేయడం, ఇవన్నీ రొమాంటిక్‌గా వుండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రమ మరింత బలపడుతుంది. ఇద్దరూ తక్కువ సమయం కలిసి గడిపినా వారిని మరింత దగ్గరకు చేస్తుంది.

భర్త నుంచి భార్య గనుక పొగడ్తలను విన్నప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది. కాబట్టి మీ భార్యను మీరు వీలు కుదిరినప్పుడల్లా పొగడడం, అభినందించడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఎంత బిజీగా వున్నప్పటికీ మీరు మీ పార్ట్‌నర్‌కు సమయం కేటాయిస్తున్నారని మీ పార్ట్‌నర్‌కు భావన కలుగుతుంది. అభినందించడమంటే కేవలం అందాన్ని పొగడ్డం మాత్రమే కాదు. వారు చేసే చిన్న చిన్న పనులను కూడా అభినందించవచ్చు.
ప్రతీ రోజూ ఉదయం మంచి మూడ్‌తో వుండడండి. ఎన్ని గొడవలు వున్నా నిద్రేలవగానే పార్ట్‌నర్‌ను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం, కలిసి బ్రష్ చేయడం, కలిసి టిఫిన్ చేయడం వల్ల ఇద్దరూ మానసికంగా చాలా సంతోషంగా వుంటారు. దొరికిన కొంత సమయాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. వున్నది 15 నిమిశాలే అయినా దాన్ని రొమాంటిక్‌గా ఎలా మార్చుకోవచ్చు, భార్యతో మరింత సంతోషంగా ఎలా గడపవచ్చు, ఎలా భార్యను అభినందించాలి, ఎలా భార్యను పొగడాలి లాంటి వాటిపై భర్త దృష్టి పెడితే అప్పుడు ఇద్దరి బంధం బలంగా వుంటుంది.



Click it and Unblock the Notifications
