Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనొచ్చో తెలుసా? ప్రతీసారి సంతృప్తి చెందాలంటే ఇవి చేయాలి!
శృంగారం అనేది మనిషికి చాలా ముఖ్యం. శృంగారం లేకపోతే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడు కూడా. వివాహ బంధంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. శృంగారంలో దంపతులు సుఖంగా ఉంటేనే వారి కాపురం చాలా సుఖమయంగా, అర్థవంతంగా ఉంటుంది. అయితే కొందరు కామాంధులు ఉంటారు. వారు దేనినీ లెక్క చేయకుండా శృంగారంలోనే పాల్గొంటూ ఉండాలనే ఆశను కలిగి ఉంటారు. కొందరైతే ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు శృంగారంలో పాల్గొంటారు. కొందరును దొరికిందే సందు కదా అని ఒకేరోజులు లెక్కలేకుండా అలానే కంటిన్యూ చేస్తుంటారు.
అయితే కొందరిలో శృంగారంలో రోజుకు ఎన్నిసార్లు పాల్గొనాలి? పాల్గొంటే ఏమైనా సమస్యలు వస్తాయా? అనే అపోహలు ఉంటాయి. మరికొందరికి తమ భాగస్వామి శృంగారాన్ని కోరుకుంటే మరికొందరు వారిని సంతృప్తి పరిచే అవకాశం లేక ఇబ్బంది పడుతుంటారు. అందుకే శృంగారంలో రోజుకు ఎన్నిసార్లు పాల్గొనాలి? ఎన్నిసార్లు పాల్గొంటే భాగస్వామి సంతృప్తి చెందుతుంది అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

శృంగారంలో రోజుకు ఎన్నిసార్లు పాల్గొనాలంటే..
నిజానికి శృంగారంలో రోజుకు ఇన్నిసార్లు మాత్రమే పాల్గొనాలని ఏదీ లేదు. మీకు ఓపిక ఉన్నంత వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. అది శృంగారంలో పాల్గొంటున్న భాగస్వాముల మీద ఆధారపడి ఉంటుంది. అయితే శృంగారంలో ఎక్కువసార్లు పాల్గొనాలంటే కొన్నిటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాల పరంగానే ముందుకు వెళ్తే కచ్చితంగా సుఖం అనేది లభిస్తుంది.. అవేంటంటే..
శారీరక ఆరోగ్యం:
శృంగారంలో పాల్గొనే ముందు భాగస్వామి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి శృంగారంలో ఎన్నిసార్లు పాల్గొనాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ భాగస్వామి ఆరోగ్యం సహకరించకపోయినా మీరు శృంగారంలో పాల్గొనే వారి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మీకు సంతృప్తి కూడా లభించదు. ఒకవేళ భాగస్వామికి అలసట, నొప్పి వంటివి ఉంటే వారికి విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం.
మానసిక ఆరోగ్యం..
శృంగారంలో శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. శృంగారంలో సంతృప్తి పడాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి. ఒకవేళ మీ భాగస్వామి మానసికంగా కలత చెందుతూ ఉన్నా.. లేదా ఒత్తిడితో ఉన్నా వారితో మాట్లాడి వారికి ఉపశమనం కల్పించే విధంగా ప్రవర్తించాలి. వారిని శాంతపరిచి, మీకు సహకరించే విధంగా మార్చుకోవాలి. ఆ తరువాత శృంగారంలో పాల్గొనవచ్చు.
భాగస్వామి సౌకర్యం..
శృంగారం అనేది ఒకరికి సంబంధించినది కాదు. భాగస్వాములిద్దరూ సమర్ధవంతంగా, అంగీకారం తెలిపితేనే అందులో మీకు సుఖం లభిస్తుంది. ఇందులో భాగస్వామి సౌకర్యం కూడా చాలా ముఖ్యం. ఆమె సౌకర్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వారు సౌకర్యవంతంగా ఉంటేనే శృంగారంలో సంతోషాన్ని అనుభవించగలరు. అలాగే సంతృప్తి చెందగలరు. అందుకే శృంగారంలో భాగస్వామి సౌకర్యం అనేది చాలా ముఖ్యం.
సంతృప్తి చెందడానికి కొన్ని చిట్కాలు:
సంభాషణ: మీ కోరికలు, అవసరాల గురించి మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి.
ఫోర్ప్లే: శృంగారానికి ముందు ఫోర్ప్లే చేయడం వల్ల ఇద్దరూ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటారు.
ప్రయోగాలు: కొత్త భంగిమలు, పద్ధతులను ప్రయత్నించడం వల్ల శృంగారంలో ఆసక్తి పెరుగుతుంది.
ఒత్తిడి తగ్గించుకోండి: ఒత్తిడి, ఆందోళన శృంగారంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications