Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
బ్రేకప్ బాధ మగాళ్లకేనా? లేడీస్ లైట్ తీసుకుంటారా? అసలు నిజాలు ఇవే
ఈ రోజుల్లో ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా బ్రేకప్ కూడా చెప్పుకుంటున్నారు. అయితే బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఫీల్ అవుతురు అని సాధారణంగా అంటుంటారు. అకస్మాత్తుగా లేదా ఏకపక్షంగా విడిపోయినప్పుడు పురుషులు తరచుగా మహిళల కంటే ఎక్కువ హృదయ వేదనను అనుభవిస్తారని చెబుతుంటారు. కొంతమంది అబ్బాయిలు లవ్ బ్రేకప్ అయిన తర్వాత దేవదాసులుగా మారిపోతుండటం కూడా మనం నిత్యజీవితంలో గమనిస్తుంటాం. తాగుతూ ప్రేయసిని తలుచుకుంటూ కొంతమంది పిచ్చోళ్లుగా మారిపోతుండటం కూడా చూస్తుంటాం.
వాస్తవానికి పురుషులు బయటకు బలంగా కనిపించినప్పటికీ వాళ్లు కూడా స్త్రీల మాదిరిగానే భావోద్వేగాలను అనుభవిస్తారు. సంబంధం తెగిపోవడాన్ని ఎదుర్కోవడం వారికి కష్టతరం చేస్తుంది.
బ్రేకప్‌ల గురించి మహిళలు బహిరంగంగా మాట్లాడుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ పురుషులు ఈ భావోద్వేగాలను వ్యక్తపరచడం వల్ల బలహీనులుగా ముద్ర వేయబడతారు. బ్రేకప్ ల వల్ల పురుషులు ఎక్కువగా ప్రభావితమవడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గుర్తింపు కోల్పోవడం
చాలా మంది పురుషులకు బ్రేకప్ జరిగితే.. తమలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు భావిస్తుంటారు. దీని వలన శూన్య భావన కలుగుతుంది. తమ శరీరంలో సగం తెగిపిడనట్లుగా వేదన చెందుతారు. దీంతో వాళ్లు తమ స్వీయ విలువను తిరిగి పొందే మార్గాలను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నారు.
భావాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది
పురుషులు తరచుగా తమ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి అలవాటుపడరు. అదే సమయంలో మహిళలు తమ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వారి ఆప్యాయతను పొందవచ్చు. కానీ పురుషులు తమ భావాలను లోపలే దాచుకుంటారు. మగాళ్లు తమ భావోద్వేగాలను ఇలా బయటకు చూపించరు కాబట్టి బ్రేకప్ బాధను మరింత తీవ్రంగా అనుభవిస్తారు.
బలహీనమైన సపోర్ట్ సిస్టమ్
స్త్రీల మాదిరిగా కాకుండా పురుషులకు విడిపోవడం వల్ల కలిగే బాధను పంచుకోవడానికి సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు. వారి ప్రేమ విచ్ఛిన్నం తర్వాత వారు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. దీని నుండి కోలుకోవడానికి మగాళ్లకు అవసరమైన మద్దతు లేకపోవచ్చు.
సామాజిక అంచనాలు
సమాజం తరచుగా పురుషులను బలంగా ఉండమని, వారి భావోద్వేగాలను స్వేచ్ఛగా నిర్వహించమని బలవంతం చేస్తుంది. ఇది కష్ట సమయాల్లో పురుషులు సహాయం అడగడానికి వెనుకాడేలా చేస్తుంది. ఇది వారి నయం చేసే సామర్థ్యానికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. సామాజిక అంచనాలు, తగినంత మద్దతు వ్యవస్థలు లేకపోవడం వల్ల విడిపోవడం పురుషులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.



Click it and Unblock the Notifications
