Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
తరచుగా సెక్స్ చేస్తే యోని లూజైపోతుందా.. వైట్ డిశ్చార్జీ అయితే ఇన్ఫెక్షన్ వచ్చినట్లేనా, నిజమెంత?
చాలా మందికి శృంగారం గురించి శృంగార జీవితం గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో సెక్స్ కు సంబంధించిన విషయాలను పిల్లలకు ఎవరూ చెప్పారు. కాలానుగుణంగా వారు తెలుసుకుంటూనే తప్ప అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు. అందుకే శృంగారంపై వీరికి అనేక డౌట్లు, అనుమానాలు ఉంటాయి.
ముఖ్యంగా అపోహలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్త్రీ యోని విషయంలో అయితే చాలా రకాల అపోహలు ఉంటాయి. అటు అబ్బాయిల్లోనూ, అమ్మాయిల్లోనూ దీని గురించి డౌట్లు ఉంటాయి. ఆ అపోహలు, నిజానిజాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రబ్బరులా యథాస్థితికి చేరే గుణం యోని సొంతం:
దాంపత్య జీవితం అనుభవిస్తున్న వారు అయినా, దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోయే వారైనా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కాస్త తెలుసుకోవాలి. ఏది నిజం, ఏది అబద్ధం వంటివి గుర్తించాలి. ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే యోని వదులుగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇదంతా అబద్ధం. ఫోర్ ప్లే చేసుకోవడం వల్ల వజైనా వ్యాకోచం చెందుతుంది. సెక్స్ తర్వాత మళ్లీ మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది. రబ్బరులా సాగదీసినా కూడా యథాస్థితికి వచ్చే గుణం యోనికి ఉంటుంది. గర్భదారణ, ఇంకా కొన్ని కారణాల వల్ల యోని కాస్త బిగుతుగా మారవచ్చు. ఇది ప్రతీ ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది.
యోని వాసన ఇన్ఫెక్షన్లకు సంకేతమా..?
యోని వద్ద వాసన రావడం అనేది ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. కానీ చాలా తక్కువ వాసన అనేది సాధారణం. వజైనా వద్ద గాలి ఎక్కువగా ఆడకపోవడం వల్ల సాధారణంగానే వాసన వస్తుంటుంది. రుతుచక్రంలో, వివిధ రోజుల్లో, ముఖ్యంగా సెక్స్ కోరికలు కల్గినప్పుడు, సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఈ వాసనలో మార్పు ఉంటుంది. అలాగే మహిళలంతా భావప్రాప్తి పొందుతారని అనుకుంటారు. కానీ ఇందులో కూడా పెద్దగా నిజం లేదు. ఎందుకంటే క్లిటరల్, వజైనా స్టిమ్యులేషన్ వల్ల మహిళల్లో భావప్రాప్తి కల్గొచ్చు. యోని భావప్రాప్తి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.
గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు:
యోనిని ఫెమినిన్ వాష్ తో శుభ్రం చేసుకోవాలని చాలా మంది సూచిస్తుంటారు. కానీ అవసరం లేదు. ఎందుకంటే యోని సొంతంగా దానికదే శుభ్రం చేసుకునే అవయవం. దాని పీహెచ్ స్థాయిలు అదే నియంత్రణలో ఉంచుకుంటుంది. రసాయనాలు, వాష్ లు వాడడం వల్ల ఆ పీహెచ్ స్థాయిల్లో మార్పు వస్తుంది. ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. గోరువెచ్చని నీళ్లు, ఎలాంటి పరిమళాలు లేని సబ్బుతో శుభ్రం చేసుుకుంటే సరిపోతుంది. అలాగే వర్జినిటీని హైమెన్ నిర్ణయిస్తుందనేది అపోహ మాత్రమే. హైమెన్ పొర ఉన్నా లేకున్నా ఆకారంలో, సైజులో మార్పు ఉన్నా అది వర్జినిటీని నిర్ణయించదు. కఠినమైన కసరత్తులు, కష్టమైన పనులు, ట్యాంపన్లు వాడడం వల్ల కూడా హైమెన్ పొర పోవచ్చు.
వైట్ డిశ్చార్జీ సాధారణమేనా..?
వైట్ డిశ్చార్జీ అనేది ఇన్ఫెక్షన్లకు సంకేతం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా సాధారణమైన విషయం. యోనిని శుభ్రపరచడంలో లూబ్రికేషన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ రంగు, వాసన, చిక్కదనంలో మార్పు ఇన్ఫెక్షన్లను సూచించవచ్చు. దీనికి తప్పకుండా వైద్య సలహా తీసుకోవాల్సిందే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications