Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పురుషాంగం పెద్దగా ఉంటేనే మహిళలు తృప్తి పొందుతారా? నిజమేంటంటే..
శృంగారం.. కొద్దిగా ముందో వెనకో దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండే మధురమైన అనుభూతి. అందరి జీవితాల్లోనూ ఉండే సెక్స్ గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. శృంగారం గురించి, సంభోగం గురించి బయటకు మాట్లాడుకోకపోవడం వల్ల చాలా మంది అపోహలు, అనుమానాలు అలాగే మిగిలిపోతాయి.
చాలా మంది పురుషుల్లో శృంగారం గురించి ఉండే అనుమానాలు ఎక్కువగా పురుషాంగంకు సంబంధించినవే ఉంటాయి. అంగం చిన్నగా ఉందని, సెక్స్ సమయంలో స్త్రీలను సంతృప్తి పరచగలమా అనే డౌట్లతో సతమతం అవుతుంటారు. అలాగే పోర్న్ వీడియోలు, సినిమాలు, సెక్స్ కథలు చదువుతూ అందులోని పురుషుల అంగం చూసి తమకు అలాంటి అంగం లేదని మదన పడిపోతుంటారు. అంగం సైజ్ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. నూనెలు, జెల్, క్రీములు వాడి అంగం సైజు పెంచుకునే ప్రకటనలు నమ్మి మోసపోతుంటారు.

చిన్న పురుషాంగం పరిమాణం ఉన్న పురుషులు సెక్స్‌లో సరిగ్గా పని చేయలేరు మరియు క్లైమాక్స్‌ను సాధించలేరు అనే సాధారణ అభిప్రాయం ఉంది. చిన్న సైజులో ఉండే పురుషాంగంతో సంతానోత్పత్తి జరగదని, వంధ్యత్వం వస్తుందని కూడా చెబుతారు. చిన్న పురుషాంగం ఉన్నవారి కంటే పెద్ద పురుషాంగం ఉన్న పురుషులు బలంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు.
పురుషాంగం ఎంత పెద్దగా ఉంటే, మహిళలు అంతగా సుఖ పడతారని, చిన్న పురుషాంగంతో స్త్రీలు తృప్తి పడలేరని చాలా మంది అనుకుంటారు. నిజంగానే.. స్త్రీలు చిన్న పురుషాంగంతో సంభోగం వల్ల సంతృప్తి పడరా, వారికి పెద్ద అంగంతో సంభోగం చేస్తేనే సుఖ పడతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సెక్స్ నిపుణులు ఏం చెబుతున్నారంటే?
శృంగారం.. శారీరక, భావోద్వేగ, మానసిక సంబంధమైనది. ఇందులో ఏ ఒక్కటీ లేకపోయినా దాంతో పూర్తి స్థాయి తృప్తి లభించదు. అలాగే శృంగారం అంటే వ్యక్తీకరించలేని ప్రేమను చెప్పే సాధనం. అయితే శృంగారంలో సైజులు ఏమాత్రం మ్యాటర్ కానే కాదు అని నిపుణులు చెబుతున్నారు. మహిళలైనా, పురుషులైనా వారు శృంగారంలో సుఖం అనుభవించడానికి, ఉద్రేకం, భావప్రాప్తి పొందడానికి సైజుల పాత్ర ఏమీ ఉండదు. సన్నిహితమైన స్పర్శ, సెక్సీ టాక్, ఉద్వేగం, శృంగారం చేసుకునే తీరు లాంటి వాటితోనే సెక్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. పురుషాంగం చిన్నగా ఉన్నంత మాత్రాన, లేదంటే పెద్దగా ఉంటేనే మహిళలకు తృప్తి ఎక్కువగా ఉంటుందని అనుకోవడం అపోహే.
సైజ్ మ్యాటర్ కాదు, ఎందుకంటే..:
సంతృప్తికరమైన సెక్స్ కోసం అంగం పరిమాణం కనీసం 4 అంగుళాలు ఉంటే చాలు అని సెక్స్ నిపుణులు చెబుతున్నారు. 4 అంగుళాల పరిమాణంతో గట్టిపడిన అంగంతో శృంగారంలో మంచి అనుభూతిని ఆస్వాదించవచ్చు. యోనిలో స్పర్శను తెలియజేసే కణాలు కొంత వరకు మాత్రమే ఉంటాయి. ఆ ప్రాంతం వరకు అంగం వెళ్లగలిగితే మహిళలు.. యోనిలో అంగాన్ని పీలవుతారు. దాంతో సుఖాన్ని అనుభవిస్తారు. ఆ ప్రాంతాన్ని దాటి అంగం చొచ్చుకుపోయినా దాని వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు అని నిపుణులు చెబుతున్నారు.
కావాల్సింది సైజ్ కాదు, ఉండాల్సింది అదొక్కటే:
సెక్స్ సమయంలో అంగం 4 ఇంచులు ఉంటే చాలు. అయితే ఎంత సేపు శృంగారం చేస్తామనేది శృంగారంలో తృప్తి పొందడానికి కీలకం. స్టామినా వల్లే మహిళలు ఆనందపడతారు. ఎంత ఎక్కువ సేపు చేయగలిగితే అంత సుఖం అనుభవిస్తారు. పురుషులు కనీసం స్త్రీలకు భావప్రాప్తి కలిగేంత వరకైనా సెక్స్ చేయాలనేది నిపుణులు చెప్పే సూచన. పురుషులతో పోలిస్తే స్త్రీల సెక్స్ డ్రైవ్ చాలా ఎక్కువ. కనీసం 15- 20 నిమిషాల పాటు సెక్స్ చేయగలగాలి లేదంటే మహిళలకు భావప్రాప్తి కలిగే వరకు సంభోగం చేస్తేనే మహిళలు సుఖపడతారు. ఇక్కడ అంగం పెద్దదా, చిన్నదా అనేది మ్యాటర్ కాదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications