Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రాత్రిపూట నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు 7 ఏళ్లు పెరుగుతుందా? దంపతులకు ఇది తెలుసా?
రాత్రి నిద్రపోయే సమయంలో కొంచెం వదులుగా ఉండే బట్టలు ధరించడం మనలో చాలామందికి అలవాటే. మనదేశంలో చాలామంది ఆడవాళ్లు అయితే రాత్రిపూట నైటీలు ధరిస్తుంటారు..మగవాళ్లు నైట్ ప్యాంట్ లు, లుంగీలు లేదా షార్ట్ లు వంటివి రాత్రిపూట వేసుకుంటారు. ఇంకొంతమంది మగవాళ్ల అయితే రాత్రిపూట టవల్ మాత్రమే చుట్టుకొని పడుకుంటుంటారు.
అయితే అసలు ఆ టవల్ లేదా నైటీ కూడా లేకుండా నగ్నంగా నిద్రపోతే ఏం జరుగుతుంది? ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా, మరికొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ నగ్నంగా నిద్రపోవడం వల్ల వేలాది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అది ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

వైరల్ అయిన ఆ పోస్ట్ ఏం చెబుతోంది?
ఇటీవల మిచ్చెల్లి లాబ్స్ అనే ఎక్స్ అకౌంట్ లో పెట్టిన ఒక పోస్ట్ పెట్టగా అది పెను సంచలనం సృష్టించింది. రాత్రిపూట పూర్తిగా నగ్నంగా నిద్రపోయే మహిళల ఆయుర్దాయం ఏడు సంవత్సరాలు పెరుగుతుంది అని ఆ పోస్ట్ లో ఉంది. దీనికి కారణం కూడా వివరించారు.
శరీరంపై బట్టలు లేనప్పుడు శరీరం చల్లబడుతుంది, తద్వారా నాడీ వ్యవస్థ శాంతించి గాఢమైన నిద్ర పడుతుందని, మంచి నిద్రే ఆయుష్షును పెంచుతుందని ఆ పోస్ట్ లో వాదించారు.
అయితే ఈ విషయంపై ఎక్స్ లో స్పందించిన అమెరికన్ పారిశ్రామికవేత్త బ్రియాన్ జాన్సన్.. నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నది నిజమే..కానీ కచ్చితంగా ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.
సైన్స్ ఏం చెబుతోంది?
బ్రియాన్ మాటల్లో అతిశయోక్తి ఉన్నా, అందులో దాగి ఉన్న ఆరోగ్య సూత్రాలతో జర్నల్ ఆఫ్ సైకలాజికల్ ఆంత్రోపాలజీ, స్లీప్ జర్నల్ వంటి అనేక పరిశోధనలు ఏకీభవిస్తున్నాయి.
నగ్నంగా నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
సాధారణంగా నిద్రపోతున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దుస్తులు ధరించడం వల్ల ఆ వేడి లోపలే ఉండిపోయి అసౌకర్యంగా అనిపిస్తుంది. అదే నగ్నంగా ఉంటే శరీరం త్వరగా చల్లబడి, త్వరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు.
రోజంతా జీన్స్, లెగ్గిన్ వంటి దుస్తులు కప్పబడి ఉండటం వల్ల చర్మానికి గాలి తగలదు. నగ్నంగా నిద్రపోవడం వల్ల చర్మం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. దీనివల్ల చర్మ సమస్యలు, దద్దుర్లు, దురద వంటివి తగ్గుముఖం పడతాయి.
మీరు వివాహితులైతే భాగస్వామి పక్కన నగ్నంగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య చర్మ స్పర్శ పెరుగుతుంది. ఇది ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలకు సహాయపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆయుష్షు 7 ఏళ్లు పెరుగుతుందనే గ్యారెంటీ లేకపోవచ్చు. కానీ మంచి నిద్ర, ఆరోగ్యకరమైన చర్మం, ఒత్తిడి లేని మనస్సు, ఆనందకరమైన దాంపత్య జీవితం సొంతమవుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications