Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మీ భాగస్వామిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఇద్దరు ప్రేమికులు, దంపతుల మధ్య సహజంగానే అప్పుడప్పుడుమీరు గొడవలు వస్తూ ఉంటాయి. నిజానికి ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలే వారిలో నిజమైన ప్రేమను బయటికి తీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో.. ఇలాంటివి తరచూ జరుగుతుంటాయి. భాగస్వామి కావాలనే మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి బంధం ప్రమాదకరంగా మారుతుందని అర్ధం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఇలాంటి సందర్భంగా మీ భాగస్వామిలో కనిపించే కొన్ని లక్షణాలు, వారి ప్రవర్తన ఆధారంగా బంధం ప్రమాదకరంగా మారుతుందంటూ గ్రహించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
> ఇలాంటి సందర్భంగాల్లో మీ భాగస్వామి మిమ్మల్ని తప్పుదోడ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. మనపై మనకు నమ్మకం లేకుండా చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేస్తుంటారు. అన్ని రకాలుగా మనల్ని ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిని గ్యాస్‌లైటింగ్ అంటారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

> ప్రతి విషయంలో మీ భాగస్వామి మీతొ అబద్దాలు చెప్పెందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పును కప్పిపుచ్చేందుకు ఇంకో తప్పు చేస్తూ ఉంటారని, అలాంటి వారి పట్ల జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు.
> చిన్న చిన్న విషయాలకే కొప్పడడం, ఒకరిపై చిరాకు పడడం, అనవసరంగా అరడవం వంటివి చేస్తే, ఆ బంధం ప్రమాదకరంగా మారుతున్నట్లు అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు.
> ఇలాంటి వారిలో గతంలో కంటే ఎక్కువగా మార్పులు కనిపిస్తాయని, తమ భాగస్వామిని శారీరకంగా, మానసికంగానే కాకుండా వారి భావోద్వేగాలపై కూడా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంటారట. ఇలాంటి సమయాల్లో భాగాస్వామి మాటలను చేతలను బట్టి వారి ప్రవర్తనను అర్ధం చేసుకోవాలని అంటున్నారు.
> ఇలాంటి వ్యక్తులు.. తమ భాగస్వామిపై అసూయ, ద్వేషం పెంచుకుంటారని తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు మీరు చెప్పే మాటలు రుచించవట. తాము చెప్పేది నిజమని నమ్మిస్తూ.. ఎదుటివారి మనోభావాలాపై దెబ్బకొట్టాలని, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయాలని చూస్తుంటారట.
> నిజమైన బంధంలో సర్దుకుపోవడం, అర్ధం చేసుకోవడం వంటివి ఉంటాయి. కానీ మిమ్మల్ని విధించాలని అనుకునే వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించవని, ఈ విషయంలోనూ వారు రాజి పడరని చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు తమ మాటనే చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రవర్తిస్తుంటారని, అలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు.
> అనుమానం అనేది పెనుభూతమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే, మిమ్మల్నీ వేదించే భాగస్వామిలో అనుమానం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ప్రతీ విషయంలో మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటారని, మీ ఫోన్ సంభాషణ దొంగచాటుగా వినే ప్రయత్నం చేస్తూ ఉంటారని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తె వెంటనే పసిగట్టి, తనపై తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనాంశంలో పొందుపరచిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవే నిజమని మీరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలాగే వీటిని నమ్మే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications