Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ పనులు భార్యలకు అస్సలు నచ్చవు.. వారి ముందు అసలే చేయకండి!
ఈ లోకంలోని ప్రతి వ్యక్తికి ఇష్టా ఇష్టాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. ఒకటి అభిప్రాయాన్ని, ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవిస్తేనే ఎలాంటి బంధం అయినా నిలబడుతుంది. మరీ ముఖ్యంగా వివాహబంధంలో భార్య, భర్తల మధ్య కచ్చితంగా ఒకరి ఇష్టాలను ఇంకొకరు గౌరవించే సంప్రదాయం ఉండాలి. అయితే భార్యలు ఇష్టపడని కొన్ని పనులు ఉంటాయి. వాటిని వారి ముందు అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అసలు భార్యకు నచ్చని విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంటి పనుల్లో సహాయం చేయకపోవడం
వంట చేయడం అనేది ప్రతి భార్యకు తలకు మించిన భారం. ఒకవేళ ఇంట్లో ఎక్కువ మందికి వంట చేయాల్సి ఉంటే కచ్చితంగా ఆమె ఇబ్బందికి గురవుతారు. అయితే భార్య ఎంత కష్టపడుతున్నా భర్తలు మాత్రం వంట పనుల్లో సహాయం చేయరు. అది భార్యకు అస్సలు నచ్చదు. అలాగే ఇంటిని శుభ్రం చేసే పనుల్లో కూడా సహాయం చేయకపోవడం వల్ల వారికి కోపం వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి. అందుకే భార్య ముందు ఈ పనులు చేయకండి.

ప్రశంసలు చెప్పకపోవడం
ఉదయం నుంచి సాయంత్రం వరకు భర్త ఎంత కస్టపడి వచ్చినా సాయంత్రం భార్య అతని కోసం రకరకాలుగా వంటలు చేసి పెడుతుంది. అలాగే భర్త కోసం అందంగా రెడీ అయ్యి ఉంటుంది. కానీ భర్త మాత్రం ఆమె చేసిన వంటలకు ప్రశంసలు చెప్పకపోవడంతో పాటు ఆమెను కూడా మెచ్చుకోరు. దీని వల్ల భార్య కచ్చితంగా కోపానికి గురవుతుంది.
సమయం కేటాయించకపోవడం
భార్య భర్తల బంధం మాత్రమే కాదు.. ఏ బంధంలో ఉన్నా కచ్చితంగా మీ భాగస్వామికి సమయం కేటాయించాలి. మీకున్న సమయంలో మీ పనులు చూసుకోవడంతో పాటు వారితో కొంత సమయాన్ని గడపాలి. అలా కాదని ఆమెతో సమయం గడపకుండా ఉంటె ఆమె కచ్చితంగా వేరే వ్యక్తిని చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ మధ్య తరచూ గొడవలు రావచ్చు. అందుకే భార్యతో కలిసి గడపండి. సినిమాలకు వెళ్ళండి. మీ భావాలను, ప్రేమను ఆమెకు తెలిసేలా వ్యక్తపరచండి.
అర్థం చేసుకోవడం
భార్యను అర్థం చేసుకోకుండా ఎప్పుడూ ఆమెను తప్పుబడితే కచ్చితంగా ఆమెకు మీకు ఎదురుతిరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో భార్యను తప్పుబట్టకుండా ఆమెను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి మాటలను వినండి. ఆ తరువాత ఏదైనా సమయం చెప్పండి.
ఇతర మహిళలను పొగడడం
మన గురించి కాకుండా వేరే వ్యక్తి గురించి పొగిడితే మనకెంత కోపం వస్తుందో ప్రతి భార్యకు కూడా అలానే ఉంటుంది. భార్య ముందు ఇతర మహిళల గురించి అస్సలు మాట్లాడకండి. వారితో భార్యలను పోల్చకండి. అలాగే ఇతర మహిళలను మెచ్చుకునే సాహసం చేయకండి. ఇలా చేయడం వల్ల మీ భార్యకు మీపై కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనుమానం కూడా వస్తుంది.



Click it and Unblock the Notifications