Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తులకు అస్సలు సలహాలు ఇవ్వకూడదు.. ఇస్తే ఇక అంతే!
ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడం, వారికి సహాయం చేయడం అనే ఆలోచన కలిగి ఉండడం చాలా మంచిదే. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ద్వారా దేవుడే మనిషి రూపంలో వచ్చాడనే భావనతో ఉంటారు. అలాగే మనల్ని దేవుడితో పోలుస్తుంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే? మనం అందరికీ సలహాలు ఇవ్వడం, కష్టాల్లో ఉన్నప్పుడు అందరినీ ఆదుకోవడం అనేది మంచిది కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేస్తున్న మంచే మిమ్మల్ని కష్టాల్లో నెట్టేసే అవకాశాలు ఉంటాయి. మీకు ఎన్నటికీ తీరని ఇబ్బందులను గురి చేస్తాయి. అందుకే మీరు ఎవరినైనా ఆడుకోవాలనుకున్నప్పుడు, వారికి సలహాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు వారిలో ఉండే కొన్ని లక్షణాలను అర్ధం చేసుకోవాలి. ఆ లక్షణాలు ఏంటి? వారిని ఏ విధంగా గుర్తించాలి? వారికి సలహాలు ఇస్తే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. జ్ఞానం లేని వారికి
వివేకం లేని వారు, మీ సలహా వెనక ఉన్న మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేరు. మీరు ఎంత బాగా చెప్పినా, వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, మీ సలహాను అవమానంగా తీసుకుని, మీతో దురుసుగా ప్రవర్తించవచ్చు. అటువంటి వారితో మీ సమయం, శక్తిని వృథా చేయకండి.

2. భార్య భర్తలకు
భార్యాభర్తల మధ్య సమస్యలు ఒక దశలో ఆవేశంగా కనిపించినా, తరువాత అది పరిష్కారమవుతుంది. కానీ మీరు వారి మధ్యలో జోక్యం చేస్తే, సమస్య మిమ్మల్ని కూడా కవర్ చేస్తుంది. వారు తిరిగి ఒక్కటైపోయినా, మీరు చెప్పిన మాటలు వారికే కాదు, మీకూ సమస్యలు తెచ్చిపెడతాయి. అందుకే, ఈ బంధంలో నీవు-నేను అనే భావనల మధ్య ప్రవేశించకుండా ఉండటం మంచిది.
3. గర్విష్టులకు
గర్వం, అహంకారం ఉన్నవారు ఎప్పటికీ ఇతరుల అభిప్రాయాలను ఆమోదించరు. వారు తాము అనుకున్నదే, తాము చేస్తున్నదే సరైందని నమ్ముతారు. అటువంటి వారికి సలహా ఇస్తే, మీరు తప్పు చేసినట్టు ఫీల్ అవుతారు. కొన్నిసార్లు, అవమానం చవిచూడాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి వారి పట్ల మౌనంగా ఉండడం ఉత్తమం.
4. స్వార్థపరులకి
లోభులు, స్వార్థపరులు మీ సలహాను తాత్కాలికంగా విన్నట్లు నటిస్తారు. కానీ ఆ సలహా వాళ్లకే ప్రయోజనం కలిగించాలని, వారికే మంచి జరిగే విధంగా ఉండాలని అనుకుంటారు. అంతే కానీ, మీకేమీ ఇవ్వరు. పర్వాలేదు అనిపించి సాయం చేసినా, తిరిగి చూసుకునే గుణం ఉండదు. కనుక, అలాంటి వ్యక్తుల దగ్గర మీ జ్ఞానాన్ని ఖర్చు చేయకండి.
5. చెడు అలవాట్లు ఉన్నవారికి
మద్యం, పొగాకు, వ్యసనాల్లో మునిగిపోయిన వారు చాలా సార్లు సలహాలను అవహేళన చేస్తారు. మీరు చెప్పిన మంచి మాటలను నిర్లక్ష్యం చేసి, మిమ్మల్ని వెక్కిరించే పరిస్థితికి నెట్టే అవకాశం ఉంది. మీ మంచితనాన్ని అవమానంగా మార్చే అలాంటి వాళ్లకు సలహాలు ఇవ్వడం కన్నా, దూరంగా ఉండడమే మంచిదిగా భావించాలి.
ముగింపు మాట:
మనసు మంచిగా ఉండటం గొప్ప లక్షణమే. కానీ మన మంచితనాన్ని ఎవరి వద్ద ఉపయోగిస్తున్నామనేది అత్యంత ముఖ్యం. సరైన వ్యక్తికి, సరైన సమయంలో ఇచ్చే సలహా మార్గదర్శకంగా నిలుస్తుంది. కానీ అవినీతిగ్రస్తుల వద్ద మీ మంచితనాన్ని, జ్ఞానాన్ని వినియోగిస్తే అది మీకే భారంగా మారుతుంది. అందుకే, మీరు సలహా ఇచ్చే ముందు వారికి అది అవసరమా? వారిలో ఆ సలహాను స్వీకరించే అభిరుచి ఉందా? అని చూసి, అప్పుడు మాత్రమే సలహా ఇవ్వండి.



Click it and Unblock the Notifications