ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అస్సలే పెళ్లి చేసుకోకూడదట.. చేసుకుంటే మీ పని ఇక అంతే!

చాణక్యుడు చాలా గొప్ప వ్యక్తి. చంద్రగుప్తుడు వంటి గొప్ప చక్రవర్తికి ఆయన గురువు. అంతటి గొప్ప వ్యక్తి తన నీతి శాస్త్రంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాల గురించి వివరించారు. అందులో ఎన్నో గొప్ప గొప్ప మూల్యమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ చాణక్య నీతి శాస్త్రానికి ఇంతటి ప్రాముఖ్యత ఉందంటే చెప్పుకోవచ్చు ఆయన బోధనలకు ఎంత పాపులారిటీ ఉందొ.

తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరించిన చాణక్యుడు.. ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలి? ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అవుతుందని వివరించారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితం సంకనాకి పోవాల్సిందే. ఇంతకీ చాణక్యుడు ఎలాంటి మహిళల్ని పెళ్లి చేసుకోకూడదని చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం.

Don t marry these girls who have these qualities in her Why because

అహంకారం ఉన్న మహిళలు..

అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత ఉన్న విషయం తెలిసిందే. అలానే ఏమీ లేని స్త్రీ తానే గొప్ప, తనకంటే మించిన వ్యక్తులు ఎవరూ లేనట్టు గొప్పలకు పోతుంటారు. అయితే ఎంత అందం, ఎంత ఐశ్వర్యం ఉన్నా అణిగిమణిగి ఉండే మహిళలనే పెళ్లి చేసుకుంటే మంచిదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వెల్లడించాడు. ఆకర్షణీయంగా, డబ్బుతో ఉండే మహిళలు అహంకారంగా ఉంటారని అలాంటి అహంకారపు మహిళలను పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవని పేర్కొన్నారు.

మహిళల్లో ఉండే అహంకారపు ధోరణి, అహంకారపు ప్రవర్తన వల్ల కుటుంబంలో గొడవలు వస్తాయని, అలాగే భర్తతో ఆ మహిళ ప్రేమగా జీవించలేదని పేర్కొన్నారు. మీరు కనుక పెళ్లి చేసుకోవాలనుకుంటే అహంకారం లేని మహిళను చేసుకుంటే మంచిది.

తెలివి తక్కువ వ్యక్తులు..

చాలామంది మగవారు స్త్రీల అందానికి ఆకర్షితులై ఉంటారు. వారి అందానికే మార్కులు వేసి పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి చేసుకునే అమ్మాయికి అందం ఉంటే సరిపోదు. కుటుంబాన్ని నడిపించే తెలివి కూడా ఎక్కువగా ఉండాల్సిందే. అందుకే తెలివి ఎక్కువ ఉన్న మహిళలనే పెళ్లి చేసుకుంటే మంచిదని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. అందం శాశ్వతం కాదని, కుటుంబం అనే నావను నడపడానికి తెలివి అనే ఆయుధం అవసరమని పేర్కొన్నాడు.

ఇంటి పనులు చేయని వ్యక్తులు

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలూ గారాబంగా పెరుగుతున్నారు. వాళ్ళ పుట్టింట్లో వాళ్లకు ఎలాంటి పనులు చేయించడం లేదు. దాని కారణంగా చాలా మందికి ఇంటి పనులు కూడా చేయడం రావడం లేదు. అయితే ఇంటి పనులు కూడా చేయడం రాని మహిళలను పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఇంటి పనులు కూడా చేయలేని మహిళలు సంసార జీవితాన్ని నడిపించలేరని ఆయన ఉద్దేశం. పని రాని అమ్మాయిని చేసుకుంటే కుటుంబంలో తరచూ గొడవలయ్యే అవకాశం ఉంది. అందుకే పనులు రాని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని ఆయన చెప్పుకొచ్చాడు.

అబద్దాలు చెప్పే మహిళలు..

నేటి కాలంలో నిజానికి అబద్దానికి తేడా లేకుండా చాలా మంది జీవించేస్తున్నారు. అయితే ఈ కాలంలో అబద్దాలు ఎక్కువగా చెప్పే మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. అలాంటి మహిళలను చేసుకోవడం వల్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే ఆ బంధం నిలబడుతుందని నమ్మకం కూడా లేదని చెప్పుకొచ్చాడు. అబద్దం చెప్పే స్త్రీలను పెళ్లి చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెప్పుకొచ్చారు.

చెడు స్వభావం కలిగిన స్త్రీలు

చెడు స్వభావం కలిగిన మహిళలను పెళ్లి చేసుకుంటే సంసార జీవితంలో ఇబ్బందులు తప్పవని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. ఇలాంటి చెడు స్వభావం కలిగిన స్త్రీలు భర్తలకు చుక్కలు చూపిస్తారని, భర్తలను మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకోకపోవడమే మంచిదంటున్నారు.

Story first published: Sunday, November 10, 2024, 20:48 [IST]
Desktop Bottom Promotion