Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భార్య కోపంగా ఉన్నప్పుడు ఈ 4 మాటలు అస్సలు మాట్లాడకూడదు!
వైవాహిక జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం. ఇందులో ఆనందం, ప్రేమ, కొద్దిగా ఘర్షణలు, అలకలు మరియు అనేక అనుభవాలు ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రయాణంలో అనేక మలుపులు, సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. కానీ, కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రంగా మారిపోతాయి. ముఖ్యంగా భార్య కోపంగా ఉన్నప్పుడు.. భర్తలు చెప్పే కొన్ని మాటలు, డైలాగులు గొడవను పెద్దదిగా చేసే అవకాశం ఉంటుంది. ఈ స్టోరీలో భార్య, భర్తల మధ్య గొడవను పెద్దదిగా చేసే మాటల గురించి తెలుసుకుందాం.
1. "మళ్లీ నీకు ఏమైంది?"
భార్యలు కోపంగా ఉన్నప్పుడు, వారితో ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉన్నావు ఏంటి?, నువ్వు ఎప్పుడు ఇంతేనా? అనే మాటలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇవి వారిలో మరింత బాధను పెంచడంతో పాటు, గొడవ మరింత పెద్దదిగా అయ్యేలా చేస్తుంది. దానికి బదులు నీకు ఎలాంటి బాధ ఉందో చెప్పు నేను వినేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. ఇది వారి కోపాన్ని తగ్గిస్తుంది. అలాగే గొడవను సద్దుమణిగేలా చేస్తుంది.

2. "సరేలే, సారీ వదిలేయ్"
భార్య కోపంగా ఉన్నప్పుడు, "సరే" అని కేవలం చిరాకుగా చెప్పడం, అలాగే "సారీ వదిలేయ్" అని పరుషంగా చెప్పడం ఆమె భావోద్వేగాలను నిర్లక్ష్యం చేయడమే. ఇలా చేయడం వలన వారిలో కోపం మరింత పెరుగుతుంది. దీనికి బదులు ఆమె బాధను అర్థం చేసుకుని, హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం. "నేను చేసిన దానితో నువ్వు బాధపడితే, నన్ను క్షమించు" అని అనడం ఆమె కోపాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
3. "నా బుర్ర తినకు"
ఈ డైలాగ్ చాలా భర్తలు కోపంగా ఉండేటప్పుడు తమ భార్యలతో చెబుతుంటారు. ఇలా చెప్పడం వలన భార్యలు తమ భర్త తమను అసహ్యించుకుంటున్నారని, తామంటే లేదని భార్యలు ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే దీనికి బదులు "నాతో ఎందుకు కోపంగా మాట్లాడాలి?" అని ప్రేమతో చెప్పడం, పరిస్థితిని మార్చేయవచ్చు.
4. "ప్రతిదానికి ఎందుకు గొడవ?"
ఈ పదం కూడా చాలా సమస్యలను తెస్తుంది. "ప్రతిదానికీ గొడవ చేస్తావు" అని చెప్పడం వలన, ఆమె భావాలను గౌరవించలేదని, అలాగే ఆమెకు అవమానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. దీంతో గొడవ పెరుగుతుంది. దీనికి బదులుగా, "నీ అభిప్రాయం ఏంటి?" అని చెప్పడం వలన సమస్య తీరిపోయే అవకాశం ఉంటుంది. అలాగే "మనస్పూర్తిగా మాట్లాడు, నీకు మంచి జరిగేలా ఏదైనా చేద్దాం" అని చెప్పడం వలన వారి మధ్య సన్నిహితం పెరగడంతో పాటు, గొడవ సద్దుమణిగే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications