Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రిలేషన్‌షిప్‌లో వుండమని అడుక్కోవద్దు..! కారణాలు ఇవే..!
రిలేషన్‌షిప్‌లో మీతో కలిసి ఇక వుండలేరని వారు డిసైడ్ అయినప్పుడు ఇక మీరు వారితో తెగతెంపులు చేసుకోవడమే మంచిది. అప్పుడు మాత్రమే మీరు మీ జీవితంలో సంతోషంగా వుండగలుగుతారు. ఒకరిని రిలేషన్‌షిప్‌లో వుండమని మీరెందుకు ప్రాధేయపడుతున్నారో ఒక సారి ప్రశ్నించుకోండి. దీని వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయ్ కానీ తగ్గవు. చాలా మంది రిలేషన్‌షిప్‌లో పార్ట్‌నర్‌ను వదులుకోవడానికి సిద్ధపడరు, దానికి కారణం వారిపైనే భావోద్వేగాలను ఎక్కువగా పెట్టుకోవడం.
1. బ్రేపక్‌లు చాలా కష్టంగా వుంటాయ్. అయితే మీ జీవితంలో ఒకరు వెళ్లిపోవడానికి సిద్ధంగా వున్నప్పుడు వారిని అలాగే వెళ్లిపోనివ్వాలి. మీరు వారిని మీ జీవితంలో ఉండమని ప్రాధేయపడినప్పుడు మీపైన వారికి జాలి కలుగుతుంది. అలాంటి జాలి వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుందని గ్రహించాలి. మీతో కలిసి ఇక వారు ఉండలేరన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. వారిని అలాగే వెళ్లనివ్వాలి.
2. మీరు రిలేషన్‌షిప్‌ను ఎంత వరకైతే పొడిగిస్తారో మీరు అంతగా బాధపడతారు. దీని వల్ల మీ సమయమే వ్యర్థమవుతుందని మీరు గ్రహించాలి. మీ అంతలో మీరు సంతోషంగా వుండటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితానికి సరిపోయిన మనిషి వచ్చే అవకాశం వుంది.
3. మనము ప్రేమించినప్పుడు ఎదుటివారు కూడా మనల్ని ప్రేమించాలి. తిరిగి ప్రేమించని మనుషులను ఎప్పటికీ ప్రేమించరాదు. అది చాలా బాధాకరంగా కూడా వుంటుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారనే నిజాన్ని మీరు గ్రహించాలి. మీ ఎమోషన్స్‌ను అర్ధం చేసుకున్న వ్యక్తి మీ జీవితంలో వస్తారని మీరు నమ్మకంతో వుండాలి.

4. మీరు వారిని ఎంత ప్రేమించినా ఎంత గౌరవించినా వారు మీ జీవితంలో వుండరన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మీకోసం మీరు నిలబడినప్పుడే మీరు ఆత్మగౌరవంతో ఉన్నట్టు. రిలేషన్‌షిప్‌లో వుండమని బతిమిలాడ్డమంటే చావును దర్శించుకున్నట్టే. వారు కొంత సమయం వరకు మీ జీవితంలో వుండవచ్చు కానీ మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించలేరు. అలాంటి వ్యక్తి ఇక మీ జీవితంలో ఎంత మాత్రం అవసరం లేదనే నిర్ణయానికి రావాలి.
5. వారు మిమ్మల్ని ప్రేమిస్తే ఇప్పటికే వారు మీతో ఉండేవారు. మీతో మాట్లాడేవారు. ఏ సమస్య వుందో కూర్చొని కలిసి మాట్లాడుకునే వారు. ఇది జరగడానికి మీరు వారిని అడుక్కోకూడదు.
6. మీరు బాగా ప్రేమించిన వారు మీ జీవితంలోంచి వెళ్లిపోయినందుకు మీకు చాలా బాధగా వుండవచ్చు కానీ అదంతా సాధారణమేనని మీరు గ్రహించాలి. వారు వదిలి వెళ్లిపోయినప్పుడు అదే జీవితానికి ప్రపంచానికి అంతంగా భావించవద్దు.
7. వారు మీ జీవితంలో వున్నా మిమ్మల్ని వారు కంట్రోల్ చేస్తున్నారని తరువాత బాధపడుతారు. రిలేషన్‌షిప్‌లో వుండమని ఎందుకు అడుక్కున్నానా అని తరువాత బాధపడతారు. ఎవరిగురించైనా ఆలోచిస్తే మీకు బలంగా వుండాలి కానీ బలహీనంగా వుండకూడదు. అడుక్కోవడం వల్ల మిమ్మల్ని మీరు బలహీనంగా మార్చుకున్నట్లే. అంతిమంగా బాధపడేది మీరేనని గ్రహించాలి.
8. వారు లేకపోతే ఇక మీ జీవితం లేదని వారు తెలుసుకున్నప్పుడు వారి కళ్ల ముందు మీరు ఎందుకూ పనికిరాని వారిగా కనిపిస్తారు. వారికి సమానంగా కూడా మీరు వుండలేరు. అలాంటి ఆలోచనతో వారు మీ జీవితంలోకి మళ్లీ వస్తే వారు మిమ్మల్ని వదిలివెళ్లే వరకూ బాధపడతారు.



Click it and Unblock the Notifications