Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కాలం కలిసిరానప్పుడు ఈ పనులు అస్సలే చేయొద్దు, అవేంటంటే..
సమయం బాలేనప్పుడు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఆయా పనులు చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. కాలం కలిసిరానప్పుడు చేసే పని ఏదైనా ఎంతో జాగ్రత్తతో చేయాలి.
ప్రతి ఒక్కరి జీవితంలో చెడు సమయం ఉంటుంది. ఆ సమయంలో సమస్యలు చుట్టు ముట్టేస్తాయి. ఒక్కొక్కటిగా అన్నీ మీద పడిపోయి మరీ ఇంత బ్యాడ్ టైం ఏంటని ఫీలవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కాలం కలిసిరానప్పుడు ఏ పని తలపెట్టినా ఫలితం రాదు.

సమయం బాలేనప్పుడు కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఆయా పనులు చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. కాలం కలిసిరానప్పుడు చేసే పని ఏదైనా ఎంతో జాగ్రత్తతో చేయాలి. మంచైనా, చెడైనా బాగా ఆలోచించి చేయాలి. ఆర్థిక విషయాల్లో మరింత అప్రమత్తత అవసరం. చెడు సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు, అవి చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి పనులు ప్రారంభించొద్దు:
సమయం బాలేనప్పుడు ఎలాంటి పనులు చేయవద్దు. మంచి పనులైనా చెడు సమయంలో చేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మరిన్ని తప్పులు చేసేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి కాలం కలిసిరానప్పుడు దానిని గుర్తించి ఆ సమయంలో పూర్తయ్యే వరకు ఓపికగా ఎదురుచూడాలి. మంచి సమయంలో, చెడు సమయంలో జాగ్రత్తగా పనులు చక్కబెట్టుకోవాలి. పరిస్థితులు బాగున్నప్పుడు జాగ్రత్తగా వాడుకోగలిగితే లాభపడతారు. కాలం బాలేనప్పుడు జాగ్రత్తగా లేకపోతే మరిన్ని సమస్యలు చుట్టు ముడతాయి. ఆర్థిక విషయాలను ఎప్పుడైనా ఓపికగా, జాగ్రత్తగా నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సమయ దోషం జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు.

మాట సాయం కూడా చేయొద్దు:
చేసే ప్రతి పనికి అంతరాయం కలుగుతోందా, ఏ పని పూర్తికావడం లేదా, పూర్తయినా ఫలితం అనుకూలంగా లేదా అయితే గడ్డు కాలంలో ఉన్నారని అర్థం చేసుకోవాల్సిందే. గడ్డు కాలంలో పనులు చేయడానికి ప్రయత్నించవద్దు. దీంతో సమస్యలు పెరుగుతాయి. బాధ్యతలు మరిచిపోయి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఏపనైనా జాగ్రత్తగా చేయాలి. మంచి పనులు కూడా చెడు ఫలితాన్ని ఇవ్వొచ్చు. పుణ్యం చేయబోయి పాపం మూటగట్టుకోవచ్చు. కాలం కలిసిరానప్పుడు మాటల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. పలికే ప్రతి పదాన్ని ఆలోచించి పలకాలి. ఒక్క చెడు మాట కూడా ఎన్నో కష్టాలను తీసుకురావొచ్చు. మాట సాయమే కదా అని చేసినా దాని నుండి కూడా సమస్యలు రావొచ్చు.

ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు:
కొందరు తమ సమస్యలు వదిలేసి ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. సమయం బాలేనప్పుడు ఇలా చేయొద్దు. ఇలాంటి చర్యల వల్ల మరిన్ని సమస్యలు రావొచ్చు. చెడు సమయం వల్ల ప్రతి పని ఎదురుతిరుగుతుంది. మీరు సాయం చేయబోయి ఎదుటివారికి సమస్య వస్తే అది మీవల్లె జరిగిందని మీ మెడకు చుట్టుకోవచ్చు. అందుకే పరిస్థితి బాలేనప్పుడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం.

బాధ్యతలు మరవొద్దు:
మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొన్ని పనులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కొన్ని బాధ్యతలను ఎప్పటికీ మరవకూడదు. బాధ్యతలను మర్చిపోతే వాటి వల్ల సమస్యలు రావొచ్చు. సమయం ఏదైనా అది అనుకూలంగా ఉన్నా, లేదా వ్యతిరేకంగా ఉన్నా బాధ్యతలను నెరవేర్చాల్సిందే. కుటుంబసభ్యుల పనులు కావొచ్చు, ఇంటి అద్దె కావొచ్చు, అమ్మనాన్నల నెలవారీ మందులు కావొచ్చు వాటిని ఎట్టిపరిస్థితుల్లో నెరవేర్చాల్సిందే.



Click it and Unblock the Notifications