Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
అడగరు.. కానీ మీ చేతే చేయించుకుంటారు..డ్రై బెగ్గింగ్ గురించి మీకు తెలుసా?
ఫ్రెండ్ షిప్ అయినా లేదా లవ్ అయినా ఇలా ఏ రిలేషన్ లో అయినా సరస్పర సహాయ సహకారాలు ఉండటం సహజం. అయితే కొంతమంది తమ అవసరాలను తీర్చుకోడానికి నేరుగా అడగకుండా ఎదుటివాళ్లని మానసికంగా మానిప్యులేట్ చేస్తారు.
సైకాలజీ నిపుణులు దీనిని డ్రై బెగ్గింగ్ అని అంటుంటారు. ఇది వినడానికి కొత్తగా ఉన్నా, మన చుట్టూ, ఆఫీసులో, సోషల్ మీడియాలో చాలా సాధారణంగా జరుగుతుంటుంది. అసలు దీనిని ఎలా గుర్తించాలి? దీని బారిన పడకుండా ఎలా ఉండాలి?

డ్రై బెగ్గింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా ఏదైనా కావాలంటే నాకు ఇది కావాలి, సహాయం చేస్తావా? అని అడుగుతారు. కానీ డ్రై బెగ్గింగ్‌లో అలా జరగదు. వీరు తమ అవసరాన్ని నేరుగా చెప్పరు. బదులుగా తమ దీనస్థితిని లేదా సమస్యను పదే పదే ప్రస్తావిస్తూ మీరే స్వయంగా ముందుకొచ్చి వారికి సహాయం చేసేలా పరిస్థితిని కల్పిస్తారు.
ఉదాహరణకు మీ భాగస్వామి లేదా ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి నా కారు చెడిపోయింది, రిపేర్ చేయించడానికి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు, ఈ నెల ఎలా గడుస్తుందో ఏమో అని వాపోవచ్చు. ఇక్కడ వారు మిమ్మల్ని నేరుగా డబ్బులు అడగలేదు. కానీ, ఆ మాటలు విన్న మీరు జాలిపడి ఫర్లేదు, నేను ఇస్తానులే అని అనేలా చేస్తారు. ఇలా అడగకుండానే మీ నుంచి సహాయాన్ని రాబట్టడమే డ్రై బెగ్గింగ్.
ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది?
లవ్,ఫ్రెండ్ షిప్ లో
కొందరు స్నేహితులు ఈ వ్యూహాన్ని చాలా తెలివిగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు వచ్చే వారం పెళ్లి ఉంది, అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు. నా దగ్గర మాత్రం ఒక్క మంచి డ్రెస్ కూడా లేదు అని నిట్టూరుస్తారు.
ఇది విన్న మీరు స్నేహధర్మంలో భాగంగా వారికి డ్రెస్ కొనివ్వడమో లేదా మీ డ్రెస్ ఇవ్వడమో చేస్తారు. ఇది అప్పుడప్పుడు జరిగితే ఫర్వాలేదు, కానీ ప్రతిసారీ మీరే ఇస్తుంటే మాత్రం మీరు దోపిడీకి గురవుతున్నట్టే.
ఆఫీసులో
వృత్తిపరంగా కూడా డ్రై బెగ్గింగ్ కనిపిస్తుంది. ఒక సహోద్యోగి వచ్చి ఈ ప్రాజెక్ట్ చాలా కష్టంగా ఉంది నాకు అసలు అర్థం కావడం లేదు. ఈ ఆఫీసులో నీకంటే తెలివైన వారు ఎవరూ లేరు, నువ్వైతేనే ఇది చేయగలవు అని పొగడ్తలతో మిమ్మల్ని ముంచెత్తవచ్చు.
ఆ పొగడ్తకు పడిపోయి, వారి పనిని మీరు నెత్తిమీద వేసుకుంటారు. ఇక్కడ వారు పని అడగలేదు కానీ మీతో చేయించుకున్నారు.

సోషల్ మీడియాలో
ఈ మధ్యకాలంలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్, స్టోరీలలో ఇది మరీ ఎక్కువైంది. కొందరు ఇన్ ఫ్లుయెన్సర్లు నన్ను ఎవరూ ప్రేమించరు, జీవితం చాలా కష్టంగా ఉంది అంటూ సానుభూతి కోరుతూ పోస్టులు పెడతారు.
వెంటనే ఫాలోవర్స్ మేమున్నాం కదా అంటూ కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తారు. దీన్నే సానుభూతి కోసం చేసే డ్రై బెగ్గింగ్ అంటారు.
ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
డ్రై బెగ్గింగ్ అనేది ఒక విషపూరితమైన అలవాటు. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంటే, మీరు నిరంతరం మానసిక ఒత్తిడికి, ఆర్థిక నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంది. వారు తమ బాధ్యతలను మీపై మోపుతారు.
మీకు అవసరమైనప్పుడు మాత్రం వారు అదృశ్యమవుతారు. కాబట్టి ఎవరైనా నిరంతరం తమ సమస్యలను ఏకరువు పెడుతూ, పరోక్షంగా మీ సహాయం కోసం ఎదురుచూస్తుంటే అప్రమత్తంగా ఉండండి. నేను సహాయం చేయగలనా? అని మీరే అడగకుండా, అయ్యో, అవునా మరి దీనికి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? అని వారిని అడిగి చూడండి.
అప్పుడు కానీ వారి అసలు ఉద్దేశం బయటపడదు. మీ మానసిక ప్రశాంతత కోసం ఇటువంటి సంబంధాల్లో సరిహద్దులు గీయడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications