Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
శృంగారం చేసినా, చేయకపోయినా.. ఈ పని మాత్రం తప్పకుండా చేయండి
గుండె సమస్య, డయాబెటిస్, స్ట్రోక్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలికమైన, అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల గురించి అందరితో చర్చిస్తాం. దాదాపు ప్రతి మనిషి జీవితంలో ఉండే శృంగారం గురించి మాత్రం పెద్దగా ఎవరూ చర్చించరు. లైంగిక సమస్యలు వస్తే.. లోలోపలే కుమిలిపోతారు. అంతే కానీ ఎవరికీ చెప్పుకోరు. ఏదైనా లైంగిక ఆరోగ్య సమస్య వస్తే ఎవరికీ తెలియకుండా వైద్యుల వద్దకు వెళ్తారు. తెలిసిన వాళ్లు ఎక్కడ చూస్తారో అనే భయంభయంగానే ఆస్పత్రి మెట్లు ఎక్కుతుంటారు. వైద్యుల వద్ద కూడా సమస్య గురించి చెప్పుకోవడానికి తెగ సిగ్గు పడుతుంటారు.

శృంగారం గురించి, శృంగార సమస్యల గురించి ఎవరికైనా చెబితే పరువు పోతుందని అనుకుంటారు. పురుషులు అయితే అది వారి మగతనానికే మచ్చలా ఫీలైపోతుంటారు. దాని వల్ల సమస్య తీరకపోగా.. మరింత తీవ్రతరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర సమస్యలూ వస్తాయి. శృంగారం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెళ్లయిన జంటలు కూడా రోజూ సెక్స్ చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు.
సెక్స్ వల్ల, స్వయం స్ఖలనం వల్ల పురుషులకు అనేక ప్రయోనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్ఖలనం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెళ్లి కాని వారు సెక్స్ చేయడం సాధ్యం కాకపోతే కనీసం హస్త ప్రయోగం ద్వారా వీర్యాన్ని బయటకు స్ఖలిస్తే మంచిదట. స్ఖలనం వల్ల మంచి ఫీల్ కలుగుతుంది. స్ఖలనం సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మనసుకు హాయిని ఇస్తాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది.
నెలలో 21 సార్లు స్ఖలించిన పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తక్కుగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. తక్కువ స్ఖలనం చేసిన వ్యక్తుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే వారానికి ఎన్ని సార్లు స్ఖలనం చేయాలని కచ్చితమైన లెక్కలేం లేవు. కానీ, ఎక్కువసార్లు చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
వారానికోసారి సెక్స్ చేసినా హ్యాపీనే:
వారానికి ఒకసారి సెక్స్ చేసే జంటలు కూడా హ్యాపీగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తానికే సెక్స్ చేయని వారితో పోలిస్తే కనీసం వారానికి ఒకసారి అయినా సెక్స్ చేసే వారే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే హస్తప్రయోగం వల్ల కంటే కూడా భాగస్వామితో సెక్స్ చేయడం వల్ల రెట్టింపు సంతృప్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతున్నట్లు వెల్లడైంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications