Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్యతో శృంగారం చేసినా..8 లక్షల ఫైన్..లైంగిక సంబంధాలపై చట్టపరమైన ఆంక్షలు!
పిల్లలను కనడం,భాగస్వామితో శృంగారం అనేది వ్యక్తిగత విషయం. అయితే భాగస్వామితో శృంగారంలో పాల్గొనే విషయంలో కూడా చట్టపరమైన నిబంధలు తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది. వ్యక్తిగతమైన లైంగిక సంబంధాల మీద కూడా చట్టపరమైన ఆంక్షలు విధించాలని కోరుతూ అమెరాకాలోని ఓహియో రాష్ట్రంలోని ఇద్దరు డెమెక్రాట్ ప్రతినిధులు ప్రతిపాదించిన ఓ బిల్లు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున మీమ్స్ లో రూపంలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అరె ఏంట్రా ఇది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే అసలు ఇంతకీ డెమెక్రాట్ ప్రతినిధులు ప్రతిపాదించిన బిల్లులో అసలు ఏముంది,ఎందుకు దీనిపై అంత పెద్ద చర్చ జరుగుతుందో ఇక్కడ చూడండి.
ఆ బిల్లులో ఉందిందే
కాంట్రాసెప్షన్ బిగిన్సె ఎట్ ఎరెక్షన్ యాక్ట్ పేరుతో ఒహియో సెనేటర్లు అనితా సోమాని, ట్రిస్టన్ రాడర్ ప్రతిపాదించిన ఆ బిల్లు ప్రకారం.. పిల్లలను కనాలనే ఆలోచన లేదా లక్ష్యం లేకుండా కేవలం పడక సుఖం కోసమే స్త్రీ శరీరంలో వీర్యస్కలనం చేస్తే అది నేరంగా పరిగణిస్తారు. అంతేకాకుండా అందుకు పాల్పడిన పురుషుడికి ఏకంగా సుమారు రూ. 8.3 లక్షల రూపాయలు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. మహిళల లైంగిక స్వాతంత్ర్యంపై,పునరుత్పత్తి హక్కులపై ఇప్పటికే చాలా చట్టాలు, రూల్స్ ఉన్నాయని..అయితే పురుషుల లైంగిక ప్రవర్తనకు మాత్రం ఎలాంటి నియంత్రణ లేదని సెనేటర్లు చెబుతున్నారు.

అవాంఛిత గర్భం కారణంగా సమాజంలో మహిళలు తరచూ వేధింపులు ఎదుర్కొంటున్నారని, వారినే దోషులుగా ఈ సమాజం నిందిస్తోందని,అందుకు కారణమైన పురుషులకు మాత్రం ఎలాంటి చట్టపరమైన శిక్ష లేదని, స్త్రీతో సమానంగా పురుషుడికి కూడా బాధ్యత ఉండాలనే ఉద్దేశ్యంతోనే తామె ఈ బిల్లును తాము ప్రతిపాదిస్తున్నట్లు సెనేటర్లు చెబుతున్నారు. మహిళలను నిందించినట్లయితే, పురుషులకూ అదే విధమైన శిక్ష ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.
వీరికి మినహాయింపు
ఈ ప్రతిపాదిత బిల్లలో కొందరికి మీత్రం దీని నుంచి మినహాయింపులు ఉన్నాయి. శుక్రదానం చేసే మగవాళ్లుకు ఈ చట్టం వర్తించదు. అలాగే హస్తప్రయోగం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం కాబట్ట, దానిని నేరంగా పరిగణించబడదు. అంతేకాకుండా స్వలింగ సంపర్కుల మధ్య జరిగే లైంగిక సంబంధాలకు కూడా ఈ కొత్త బిల్లు నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఈ ప్రతిపాదన ఎంతవరకు వాస్తవరూపం దాలుస్తుందో, ఎలాంటి చర్చలకు దారితీస్తుందో చూడాలి.



Click it and Unblock the Notifications