Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మాట్రిమోనీ సైట్లలో పెళ్లి సంబంధం కోసం వెతుకున్నారా? ఇది తెలియకుంటే మోసపోతారు!
ఒకప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే దగ్గరి బంధువుల ద్వారా లేదా కుటుంబ సభ్యుల తరపున లేదా పెళ్లిళ్ల పేరయ్యలు వంటి వాళ్ల ద్వారా సంబంధాలు వస్తుండేవి. అయితే కాలం మారడంతో ఇప్పుడు సంబంధాలన్నీ మాట్రిమోనియోల్ సైట్ల ద్వారానే వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే మ్యాట్రిమోనియల్ సైట్లలో జీవిత భాగస్వామిని వెతుక్కునే క్రమంలో మన నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మోసగించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అందుకే ఆన్ లైన్ లో జీవిత భాగస్వామి కోసం వెతికేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
మ్యాట్రిమోనీ సైట్లలో మోసపోకుండా ఇలా చేయండి
నమ్మకమైన వేదిక..తొలిమెట్టు
ఏదో ఒక సైట్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. గూగుల్ రివ్యూలు చదవండి, ఆ సైట్ ని వాడిన వారి అనుభవాలు అడిగి తెలుసుకోండి. యూజర్ల వివరాలను ధ్రువీకరించే వ్యవస్థ ఉన్న, నకిలీ ప్రొఫైళ్లను నిరోధించే పేరున్న సైట్లను మాత్రమే ఎంచుకోండి. ఇదే మీ భద్రతకు తొలి మెట్టు.

మాటిమాటికీ మారే వివరాలు..అనుమానించాల్సిందే
ఒక వ్యక్తి తన ప్రొఫైల్ లో ఊరు, మతం, ఉద్యోగం వంటి వివరాలను తరచూ మారుస్తున్నాడంటే అది ప్రమాద హెచ్చరికనే. మోసగాళ్లు తమను ఎవరూ గుర్తుపట్టకుండా, ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఇలాంటి జిత్తులమారి పనులు చేస్తుంటారు. ఇలాంటి ప్రొఫైళ్ల పట్ల అలర్ట్ గా ఉండాలి.
డబ్బు మాటెత్తితే..వెంటనే దూరం పెట్టండి
అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంట్ గా ఊరికి వెళ్లాలి, డబ్బు కావాలి వంటి కారణాలు చెప్పి డబ్బు అడిగితే అది కచ్చితంగా మోసమేనని గ్రహించండి. నిజమైన బంధంలో డబ్బు ప్రస్తావన అంత త్వరగా రాదు. ఇలాంటి వారిని వెంటనే బ్లాక్ చేసి, సైట్ కు రిపోర్ట్ చేయండి.
అప్పుడే పెళ్లా? తొందర ఎందుకు?
పరిచయమైన కొద్ది రోజులకే పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. నిజమైన అనుబంధం ఏర్పడటానికి ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరడానికి సమయం పడుతుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధపడేలా చేయవచ్చు.
మతాంతర వివాహమా? చట్టం ఏం చెబుతోంది?
మీరు మతాంతర వివాహం చేసుకోవాలనుకుంటే ముందుగా దానికి సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల కేవలం పెళ్లి కోసం మతం మారడం చట్టవిరుద్ధం. సరైన చట్టపరమైన ప్రక్రియ పాటించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పెద్దల మాట.. చద్ది మూట
మీరు ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తి గురించి మీ కుటుంబ సభ్యులతో లేదా నమ్మకమైన స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. మన ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను గమనించలేకపోవచ్చు, కానీ బయట నుండి చూసే వారికి ప్రమాదాన్ని పసిగట్టడం తేలిక. వారి సలహాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.
మీ మనసు మాట వినండి
ఎదుటి వ్యక్తి ప్రవర్తనలో ఏదైనా తేడాగా అనిపించినా, మనసులో ఏదో తెలియని సందేహం కలిగినా ఆ బంధాన్ని అక్కడితో ఆపేయడమే ఉత్తమం.



Click it and Unblock the Notifications