Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎవరితో అయినా డేటింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ 3 మీ కోసమే..
కొన్నేళ్ల క్రితం దాకా అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన విదేశాల్లో ఉండే డేటింగ్ కల్చర్ మెల్లగా ఇండియాలోకి వచ్చేసింది.ఇప్పుడు ఈ డేటింగ్ కల్చర్ మనదేశంలో గ్రామస్ధాయిల్లోకి వెళ్లిపోయింది. డేటింగ్ ప్రపంచంలో టాకింగ్ స్టేజ్(Talking stage) అనేది ఓ సున్నితమైన మొగ్గ లాంటిది. ఇద్దరు అపరిచితుల మధ్య పరిచయం అనే ప్రయాణంలో ఇది మొదటి, అత్యంత కీలకమైన అడుగు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మెల్లగా మనసు తలుపులు తెరుస్తూ, ఒకే బాటలో కలిసి నడవగలమా అని అంచనా వేసుకునే మధురమైన సమయమిది. అయితే ఈ దశలో వేసే ఒక్క తప్పుడు అడుగు కూడా,వికసించాల్సిన ఆ మొగ్గను మొగ్గలోనే తుంచేయగలదు. మీ ఈ కొత్త పరిచయం ఓ అందమైన బంధానికి పునాది కావాలంటే 3 సాధారణ పొరపాట్లకు దూరంగా ఉండండి. అవేంటో ఇక్కడ చూడండి.
భవిష్యత్తు గురించి ఆత్రుత
ఈ దశలోని ఉత్సాహంలో కొందరు చేసే అతి పెద్ద పొరపాటు ఇది. ఇంకా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకముందే పెళ్లి, పిల్లలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఇది ఎదుటివారిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ దశ ఒకరికొకరు రాసుకుంటున్న అందమైన కవిత లాంటిది..కాబట్టి ముగింపు కోసం తొందరపడకండి. భవిష్యత్ గురించి కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలలను ఇప్పుడే ఎదుటివారిపై రుద్దకండి. ప్రస్తుతంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. వారి ఇష్టాయిష్టాలను, వారి కలలను, వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడంపై దృష్టి పెట్టండి. పునాది బలంగా లేకుండా ఇంటిని నిర్మించలేం కదా.

అతి ప్రేమతో ఊపిరాడకుండా చేయడం
ప్రతి బంధానికి ఊపిరి పీల్చుకోవడానికి కొంత ఖాళీ అవసరం. నిరంతర మెసేజ్ లు, కాల్స్ తో వారి ప్రపంచంలోకి అతిగా చొచ్చుకుపోవడం వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. మీ ప్రతి మెసేజ్ కి వెంటనే సమాధానం రానప్పుడు ఆందోళన చెందడం మీ అభద్రతను, తొందరపాటును బయటపెడుతుంది. అతిగా నీరు పోస్తే మొక్క చనిపోయినట్లే అతి శ్రద్ధ కూడా బంధాన్ని మొదట్లోనే చంపేస్తుంది. మీ ఆసక్తిని చూపండి కానీ వారికి వారి వ్యక్తిగత సమయాన్ని, స్వేచ్ఛను కూడా ఇవ్వండి.
గత గాయాల గురించి
పాత బంధం తాలూకు చేదు జ్ఞాపకాలను, గాయాలను కొత్త పరిచయంలోకి తీసుకురావడం ప్రమాదకరం. మీ పాత భాగస్వామిని నిందించడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మీ మధ్య ఏదైనా తేడా వస్తే వారి గురించి కూడా ఇలాగే చెడుగా మాట్లాడతారేమోనన్న అనుమానాన్ని ఎదుటివారిలో రేకెత్తిస్తుంది. అలాగే మీ పాత బంధం గురించి అతిగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడితే మీరు ఇంకా గతం నీడలోనే జీవిస్తున్నారన్న భావన వారికి కలుగుతుంది. గతాన్ని ఒక పాఠంగా స్వీకరించి ఆ అనుభవంతో వర్తమానాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. ఈ చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే ఈ పరిచయం ఒక అందమైన బంధానికి బలమైన పునాది వేస్తుంది.



Click it and Unblock the Notifications