Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
IPL సంచలనం వైభవ్ సూర్యవంశీ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఇదే!
దేశ వ్యాప్తంగా ఐపీఎల్ జోరు కొనసాగుతోంది. ప్లేయర్ల హంగామా, అద్భుతమైన మ్యాచెస్‌లో ప్రేక్షకులంతా ఎంతో వినోదాన్ని పొందగలుగుతున్నారు. తమ తమ అభిమాన ప్లేయర్లను అభిమానిస్తూ.. మ్యాచెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. నిన్న గుజరాత్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వసం గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. అతని ఆట, అతని ప్రతిభకు దేశం సలాం కొడుతోంది. అయితే అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అతడిలోని కొన్ని హిడెన్ గుణాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందామా..
నమ్మకం..
మన ముందు ఉన్నది ఎంతపెద్ద కష్టమైనా, మనం చేయాల్సిన పని ఎంత కఠినమైనది అయినా.. దానిని మనం పూర్తి చేయగలము నమ్మకం మనలో ఉండాలి. మనల్ని మనం నమ్మినప్పుడే దేన్నైనా సాధించగలం. నిన్న వైభవ్ చేసింది కూడా అదే. తనను తాను నమ్ముకున్నాడు. తన ఆటను నమ్ముకున్నాడు. అంతే సెంచరీతో చెలరేగి తన జట్టును గెలిపించాడు.

అవగాహన..
మనం ఏ పని చేస్తున్నా ఆ పనిపై మనకు అవగాహన అనేది కచ్చితంగా ఉండాలి. మీరు ఆ పనిలో గొప్ప స్థాయిలో వెళ్ళడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పని చేయడానికి మీకు కావాల్సింది ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? అనేది ఒక అవగాహనకు రావాలి. అప్పుడే ప్రశాంతంగాజీవించడంతో పాటు.. మనం చేయాల్సిన పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాము.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం..
ఒక్క మాటలో చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీకి నిన్న చాలా అవకాశాలు వచ్చాయి. రెండో మూడో క్యాచ్ డ్రాప్ అయ్యాయి. దీంతో సూర్యవంశీకి రెండు అవకాశాలు లభించాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సూర్యవంశీ.. వాటికి తగినట్లు ఆది.. అద్భుతమైనసెంచరీ చేశాడు. అలాగే తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
తటస్థం..
కొంతమంది ఒక చిన్న విజయం సాధిస్తే ఉప్పొంగిపోతారు. ఇంకొంత మంది చిన్న ఎదురుదెబ్బ తగిలినా బాధలో కుంగిపోతారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినా.. చాలా తటస్థంగా ఉన్నారు. గొప్ప ఇన్నింగ్స్ ఆడానని ఉప్పొంగకుండా సాధారణంగా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ అతని నేర్చుకోవాల్సిన క్వాలిటీ అని చెప్పుకోవచ్చు.
పట్టుదల..
నిజానికి వైభవ్ సూర్యవంశీ తాను ఆడిన మొదటి మ్యాచ్‌లో చాలా త్వరగానే అవుట్ అయ్యారు. కేవలం సింగల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ కి వెళ్లారు. అయితే ఆ సమయంలో కసితో ఉన్న వైభవ్.. ఏదైనా సాధించాలనే పట్టుదలతో, తన తరువాత మ్యాచ్‌లో అదరగొట్టారు. సెంచరీతో కదం తొక్కారు. అందుకే ఏదైనా సాధించాలంటే కచ్చితంగా పట్టుదల ఉండాలి.
చివరగా..
వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల అబ్బాయే అయినా.. మహాభారతంలో అభిమన్యుడు పోరాడినట్లు పోరాడాడు. తనపై తనకు నమ్మకం ఉంచి, తనను నమ్మిన జట్టుకు విజయాన్ని అందించాడు. అలాగే ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడే విధంగా చేసుకున్నారు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం అతని వైపే చూస్తుంది. ఇండియాకు మరో స్టార్ట్ దొరికేశాడని చెబుతున్నారు. మీరు కూడా మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు. విజయాన్ని సాధించే విధంగా ముందుకు సాగుతూనే ఉండాలి.



Click it and Unblock the Notifications