Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తిక్క కుదిరింది: ప్రియుడితో పట్టుబడ్డ భార్య.. అతడికే ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకున్న భర్త
పెళ్లయి హాయిగా భర్తతో సంసారం సాగిపోతుంది. చూస్తేనే కడుపు నిండిపోయే బంగారం లాంటి ఇద్దరు బిడ్డలు. పని కోసం భర్త గుమ్మం నుంచి బయటకు అడుగుపెట్టగానే ప్రియుడితో సరసాలు మొదలుపెట్టింది భార్య. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించింది. ఎవ్వరు ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు. పరువు తీయోద్దని భర్త వేడుకున్నా ఆగలేదు. పని కోసం భర్త బయటకి వెళ్లడం..ప్రియుడితో సరసాల కోసం భార్య రెడీ అవ్వడం ఇలా జరుగుతూనే ఉంది. అయితే చివరకు తన భార్యకు తిక్క కుదిర్చాడు ఆ భర్త. అతను చేసిన పనికి అందరూ అతనిని ప్రశంసిస్తున్నారు.
అసలేం జరిగింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బబ్లూ, రాధిక భార్యాభర్తలు. 2017లో వీరికి పెళ్లికి జరిగింది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు వీరి కాపురం హాయిగా సాగిపోయింది. 7 ఏళ్లు వయస్పు, 9 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. అక్కడి నుంచి మొత్తం మారిపోయింది. కుటుంబపోషణ కోసం బబ్లూ తరుచుగా బయటకు వెళ్లి పనులు చేస్తూ ఉండేవాడు. అయితే కామంతో రగిలిపోయిన భార్య తమ గ్రామంలోనే తనకంటే వయస్సులో చాలా చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకుంది.

బబ్లూ ఇంటి నుంచి వెళ్లడం..కుర్రాడితో రాధిక కులకడం కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే రాధిక ఎఫైర్ విషయం ఊర్లోని మిగతావాళ్లతో పాటు బబ్లూ కుటుంబానికి కూడా తెలిసింది. వెంటనే వారు ఈ విషయాన్ని బబ్లూకి చెప్పారు. దీంతో బబ్లూ పెళ్లానికి ఇలాంటి పనులు చేయవద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే రాధిక తన పాడుబుద్ది మానుకోలేదు. ప్రియుడితో ఎఫైర్ కొనసాగిస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన భర్త బబ్లూ విషయాన్ని గ్రామపెద్దల దగ్గరకు తీసుకెళ్లాడు.
పెద్దల సమక్షంలో రాధిక తన కోరిక బయటపెట్టింది. తనకు భర్త బబ్లూ కంటే ప్రియుడితోనే ఉండటం ఇష్టమని తేల్చిచెప్పింది. దీంతో బబ్లూ కూడా ఆమె మాటలకు అంగీకరించాడు. అంతేకాకుండా కోర్టుకి తీసుకెళ్లి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశాడు. ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ తయారుచేసి తర్వాత రాధికకి ఆమె ప్రియుడితో ఊర్లోని గుళ్లోనే పెళ్లి జరిపించాడు. ఊరు మొత్తం ఈ పెళ్లి చూసింది. ఇద్దరు పిల్లలను తానే సొంతంగా సాకుతానని, తాను ఎంత కష్టమైనా పడి వారికి బాగా చూసుకుంటానని బబ్లూ గ్రామస్థుల ముందు చెప్పాడు. రాధిక కూడా దానికి అంగీకరించింది.
ప్రియుడి మోజులో పడి బంగారం లాంటి పిల్లలు,భర్తను వదులుకున్నావ్..నాలుగు రోజులు మోజు తీరాక ఆ ప్రియుడు నిన్ను వదిలేస్తాడు..నీ బతుకు అప్పుడు కుక్కలు చింపిన విస్తరవుతుంది చూస్తుండు అంటూ రాధికను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలతో విమర్శిస్తుండగా..బబ్లూను ప్రశంసిస్తున్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి ఆమెను హత్య చేయడం వంటి పిచ్చి పనులు చేయకుండా చాలా మంచి పని చేశావ్,ఇకనైనా నువ్వు మనశ్శాంతితో హాయిగా జీవించూ అంటూ బబ్లూకి సపోర్ట్ గా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు,కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications