Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
రిలేషన్‌షిప్‌లో ప్రధాన గొడవలకు కారణాలు ఇవే..
మనల్ని అమితంగా ప్రేమించే పార్ట్‌నర్ దొరకడం మన అదృష్టం. అందరి జీవితాల్లో అలా జరగదు. ప్రేమించిన తరువాత, పెళ్లైన తరువాత కొంత అడ్జస్ట్‌మెంట్ ఉంటేనే ఇద్దరి బంధం పదికాలాలపాటు చల్లగా సాగుతుంది. ఎవ్వరూ పరిపూర్ణులు కాదు. ఇద్దరి వైపు నుంచి తప్పులుంటాయ్. కానీ ఇద్దరి మధ్య ఘర్షనలు ఘోరమైనప్పుడు విడిపోయే పరిస్థితులు ఎదురవుతాయ్. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు విడిపోకుండా సర్దుబాటులో సమస్యలను పరిష్కరించువాలి. అందమైన రొమాంటిక్ ఆదర్శజంటలు కూడా విడిపోయే అవకాశముంటుంది. వాటికి గల కారణాలను కొన్ని తెలుసుకుందాం.

ఒంటరి చేయవద్దు
పార్టనర్‌ను ఎప్పటికీ ఒంటరిగా చేయవద్దు. లేదంటే వారు ఒంటరై సమస్యల్లో తోడులేనప్పుడు ఇక ఎప్పటికీ తోడుగా ఉండరని భావించి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. మీ భాగస్వామితో ఎక్కువ ఆశించకుండా ఉండాలి. లేదంటేమీరు నిరాశకు గురై మీ మీద మీరు అదుపుకోల్పోయి చిరాకు తెప్పిస్తుంది.
అసూయ అభద్రత
ఇరువురి మధ్య అసూయ, అభద్రతలు కూడా విడిపోవడానికి కారణాలవుతాయ్. ఇప్పటి హైటెక్ పరిస్థితుల్లో ఇద్దరిలో ఒకరు ఉద్యోగపరంగా లేదా ఇతర విషయాల్లో కొంచం విజయం సాధిస్తారు ఇంకొకరు వెనకబడి ఉంటారు. ఇలాంటి సమయాల్లో ఇద్దరి మధ్య నువ్వానేనా అనే పోటీతత్వం, అసూయ ద్వేషం పెరిగిపోతుంది. ఒకరిని విడిచిపెట్టైనా సరే బతకాలని అనే ఆలోచన కలుగుతుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ నిండి ఉంటే ఇలాంటి గొడవలకు ఆస్కారం ఉండదు.
కమ్యునికేషన్
ఇద్దరూ ఎలాంటి మనస్పర్దలు వచ్చినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇద్దరి మధ్య కమ్యునికేషన్ చాలా ముఖ్యం. లేదంటే మీ మధ్య బంధం రోజురోజుకూ బలహీనపడుతుంది. మాట్లాడుకుంటేనే ఏదైనా సమస్య పరిష్కారానికి వస్తుంది. మొదటి రోజుల్లో ఎలాగైతే మాట్లాడుకుంటూ ఉన్నారో జీవితాంతం మీ రిలేషన్‌షిప్‌లో అలాగే మాట్లాడుకుంటూ ఉండాలి.
ఆసక్తి లేకపోవడం
మీ పార్ట్‌నర్‌పై మీకు ఆసక్తి ఉండాలి. అన్ని విషయాలను అడిగి తెలుసుకోవాలి. చెప్పేది స్పష్టంగా వినాలి, ప్రశ్నించాలి, సమాధానం చెప్పాలి. అన్ని విషయాల్లో ఆసక్తిని కనబరచాలి. మీ భాగస్వామిపై మీకు అన్ని రకాల అంశాలపై ఆసక్తి కలిగి ఉండాలి లేదంటే మనస్పర్ధలతో సమస్యలు వస్తాయ్. పట్టించుకోవడం లేదు కాబట్టి ఇక రిలేషన్‌షిప్‌లో ఉండి ఏమి లాభం అనేంతవరకు సమస్య వెళ్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపించాల్సిందే ఖచ్ఛితంగా చూపి తీరాలి.



Click it and Unblock the Notifications
