Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆన్ లైన్ పేమెంట్ ఫెయిల్.. రహస్యం బట్టబయలు..ఉన్న పెళ్లాం పోయింది,ఉంచుకున్న సెటప్ పోయింది
ఎంత పెద్ద నేరాలు చేసినోళ్లు అయినా చిన్న క్లూ ద్వారా దొరికిపోతుండటం మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో నేరం చేసిన ఏళ్ల తర్వాత ఎక్కడో చేసే ఒక చిన్న పొరపాటు నేరస్థులను పోలీసులకు పట్టిస్తుంది. ఇలాంటి మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. అయితే తాజాగా ఓ వ్యక్తి తన పెళ్లానికి తెలియకుండా ఏళ్ల పాటు నడిపిన వ్యవహారం ఒక్క చిన్న కారణం వల్ల ఆ బయటపడింది. దీంతో ఉన్నది పోయింది..ఉంచుకుంది పోయింది అన్నట్లు అయిపోయింది అతడగాడి పరిస్థితి. అసలేం జరిగిందో ఇక్కడ చూడండి.
చైనా దేశంలోని గ్వాంగ్ డాంగ్ రాష్ట్రలంోని యాంగ్జియాంగ్ నగరంలో నివసించే ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో మహిళలో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఈ యవ్వారం సాగుతున్నా భార్యకు చిన్న క్లూ కూడా దొరక్కుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. అయితే ఇటీవల అతను ఓ మెడికల్ షాపుకి గర్భనిరోధక మాత్రలు కొనేందుకు వెళ్లాడు. అతడు అడిగిన ట్యాబ్లెట్స్ మెడికల్ షాపులో వాళ్లు ఇచ్చారు. బిల్లు 15.8 యువాన్ అంటే మన కరెన్సీలో దాదాపు రూ.200 అయింది.

అయితే ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు నడుస్తున్న క్రమంలో అతడు కూడా తన మొబైల్ పేమెంట్ కోడ్ ద్వారా బిల్లు చెల్లించాడు. ఆ తర్వాత గర్భనిరోధక మాత్రలు తీసుకొని వెళ్లిపోయాడు. అయితే ఆ మెడికల్ షాపులోని కంప్యూటర్ సిస్టమ్ లో ప్రాబ్లమ్ వచ్చి ట్యాబ్లెట్ల కొనుగోలుకు అతడు చేసిన పేమెంట్ సక్సెస్ అవ్వలేదు. దీంతో పేమెంట్ రికవరీ చేసుకునేందుకు అతడి మెంబర్ షిప్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి మెడికల్ షాపు సిబ్బంది కాల్ చేశారు. అయితే పొరపాటున ఆ ఫోన్ కాల్ అతడి భార్యకు వెళ్లింది.
ఆమె ఫోన్ ఎత్తి మా ఆయన ఏం కొన్నారు అని అడగ్గా..గర్భనిరోధక మాత్రలు అని మెడికల్ షాపు ఉద్యోగి చెప్పేశాడు. దీంతో తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లు నడిపిచ చీకటి బాగోతం ఆమెకు తెలిసింది. వెంటనే భర్తకు వదిలేసి వెళ్లిపోయింది. మెడికల్ షాపు సిబ్బంది చేసిన పని వల్ల రెండు ఫ్యామిలీలు నాశనమయ్యాయని,దీనికి తప్పంతా వాళ్లదేనంటూ ఆగస్టు 12న వాళ్లపై కేసు పెట్టాడు.అతడు చట్టపరమైన చర్యలు తీసుకునుందుకు రెడీ అయ్యాడని..అయితే అది కష్టమని హెనాన్ జెజిన్ లా ఫర్మ్ డైరెక్టర్ ఫు జియాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఒక వైపు అతడి మోసమే కుటుంబం నాశమనడానికి ఒక కారణం కాగా, మెడికల్ షాపు అతని గోప్యతను ఉల్లంఘిచినట్లయితే దానిని చట్టబద్దంగా కూడా జవాబుదారీగా చేయాల్సి ఉంటుందని ఫు జియాన్ అన్నారు.
మెడికల్ షాపు బహిర్గతం,అతని కుటుంబ విచ్ఛిన్నం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని చూపించే తగిన ఆధారాలను అతను సమర్పించాల్సి ఉంటదని ఫు జియాన్ తెలినారు. మెడికల్ షాపు సిబ్బంది చేసిన ఫోన్ కాల్ చట్టబద్ధమైనదిగా కనబడుతోందని,అతడి మాచారాన్ని లీక్ చేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా లీక్ చేయడానికి చేసినట్లుగా కనబడట్లుదని..కాబ్టటి అతడు తన హక్కులను ఉల్లించాలరని వాళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమేనని ఫు జియాన్ అన్నారు.



Click it and Unblock the Notifications