Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పక్కన పడుకోగానే నిద్రపోతున్నారా? దీని వెనుక ఎవ్వరికీ తెలియని రహస్యం ఇదే!
మీ భాగస్వామి పక్కన పడుకొని ఫోన్ చూస్తూనో లేక టీవీ చూస్తూనో ఉన్న సమయంలో లేదా కబుర్లు చెబుతున్న సమయంలో మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటున్నారా? చాలామంది దీన్ని విసుగుగానో, ఇంట్రెస్ట్ లేకపోవడంగానో అపార్థం చేసుకొని అపరాధ బావనతో ఇబ్బంది పడుతుంటారు. కానీ సైంటిస్టులు చెప్పే నిజం ఏంటంటే ఇది విసుగుకు సంబంధించిది కాదట..మీ బంధంలోని ప్రగాఢమైన విశ్వాసానికి, భద్రతకు తిరుగులేని నిదర్శనమట. వినడానికి కొత్తగా ఉన్నా ఇదే నిజం మరి.
మన బ్రెయిన్ కంటిన్యూగా చుట్టూ ఉన్న ప్లేస్ లను గమనిస్తూ అలర్ట్ గా ఉంటుంది, ఏదైనా ప్రమాదం పంచి ందేమోనని వెతుకుూ ఉంటుంది. కానీ మీరు మనస్ఫూర్తిగా ప్రేమించే, నమ్మే వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మీ బ్రెయిన్ కు ఇక్కడ అంతా సేఫ్ నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అనే ఒక సృష్టమైన మెసేజ్ అందుతుంది. మీ ఎమోషనల్ సేఫ్టీ మన నాడీ వ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తుంది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ జరిపిన ఒక అధ్యయనంలో సురక్షితమైన, ప్రేమపూర్వక సంబంధాల్లో ఉన్న జంటలు మరింత గాఢమైన, నాణ్యమైన నిద్ర పొందుతారని తేలింది. దీంతో వారి మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సైన్స్ ప్రకారంగా మనకు ఇష్టమైనోళ్లను టచ్ చేసినప్పుడు, హగ్ చేసుకున్నప్పుడు లేదా సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనినే లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ ఆక్సిటోసిన్..ఒత్తిడికి కారణమయ్యే కార్డిసాల్ అనే హార్మోన్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా మీ శరీరం తేలికపడి, కండరాలు రిలాక్స్ అయ్యి ప్రశాంతమైన నిద్రకు రెడీ అవుతుంది.
ఒంటరిగా ఉన్పప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళనలు అదేమవుతుందో,ఇదేమవుతుందో అనే ఆలోచనలు నిద్రను దూరం చేస్తాయి. అయితే భాగస్వామి పక్కన ఉన్నప్పుడు ఆ భరోసా మీ మనసులోని అనవసరమైన ఆందోళనలు తగ్గిస్తుంది. దీంతో హార్ట్ బీట్ నెమ్మదిస్తుంది,రక్తపోటు కంట్రోల్ లో ఉంటది, మనసు ప్రశాంతపడి ఈ స్థితిలొ శరీరంలో సహజంగానే నిద్రలోకి జారుకుంటుంది.



Click it and Unblock the Notifications