Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Valentine's Day:‘ప్రేమ’తో మీకు నచ్చిన ఈ డైలాగ్ తో మీ ప్రేయసి/ప్రియుడి మెప్పించి.. మనస్సు దోచేయండి
మీరు మీకు నచ్చిన వారికి ప్రేమను వ్యక్తం చేయాలని చూస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. కింది వాటిలో ఓ డైలాగ్‌ను ప్రాక్టీసు చేసి, అబ్బాయి/అమ్మాయి మనసు గెల్చుకోండి.
ఇది ప్రేమ పక్షుల వారం. ఈ వారమంతా ఎక్కడ చూసినా ప్రేమ పక్షులతో కళకళలాడుతుంటుంది. 'ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే'.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు.

అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వాలంటైన్స్ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు.
ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్ లవ్ డైలాగ్స్ మీకోసం.
1) పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. (Janu)

2) మనకేమైనా ఎఫెక్ట్ అయితే.. మనం పోతే.. ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్‌లో ఆ పిల్లే. ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ (Arjun reddy)

3 ) నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను (Arya)

4) నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే... లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది? (Ninnu kori)

5)పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది (Majili)

6) కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా! (malli malli rani roju)

7) నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!(Manmadhudu nagarjuna movie)

8) సంపాదించటం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హతలేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు (nuve nuve)

9) నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను.(andala rakshasi)

10 ) అందరూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో లేదో..కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించొచ్చు (Raja Rani)



Click it and Unblock the Notifications