Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
70 ఏళ్ల బామ్మ 5 ఏళ్ల లవ్ స్టోరీ..ఆ కుర్రోడి వయస్సు మీ కంటే తక్కువే!..ప్రపంచాన్ని షేక్ చేసిన ప్రేమ కథ
ప్రేమ..ఎవరికి,ఎప్పుడు,ఏ వయస్సులో,ఎలా పుడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కేవలం రెండు అక్షరాల ప్రేమ అనే పదంలో అనంతమైన భావోద్వేగాలు, అద్భుతమైన అనుహూతులు దాగి ఉంటాయి. ప్రేమ అనేది ఒక భావన కాదు ఓ శక్తి అని మన పెద్దలు తరుచూ చెబుతుంటారు. దూరం, వయస్సు,సంస్కృతి, భాష, సమయం ఇలాంటి ఎలాంటి అడ్డుగోడలనైనా అలవోకగా ఛేధించుకుంటే ప్రవహించే ఒక అద్భుత ప్రవాహం ప్రేమ. అయితే 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించిన 70 ఏళ్ల వృద్ధురాలు ప్రేమకథ కూడా సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
లండన్ లో నివసించే వృద్ధురాలు 60 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వెకేషన్ కోసం స్పెయిన్ కి వెళ్లింది. అక్కడ సముద్రం ఒడ్డున ఒంటరిగా బికినీ ధరించి కూర్చొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. తన రిటైర్మెంట్ లైఫ్ ని ఎలా గడపాలి అన్నఆలోచనలు ఆమె మదిలో మెదులుతున్నాయి. అకస్మాత్తుగా ఆమె కళ్లు ఓ అక్కడే బీచ్ లో ఉన్న 30 ఏళ్ల యువకుడి పడ్డాయి. ఆ యువకుడి చూపు కూడా వృద్థురాలిపై పడింది. వెంటనే అతడు ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ఆమెతో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి కొన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత స్పెయిన్ లో కలిసి ఒక రోజంతా గడిపారు. అయితే ఆ తర్వాత ఆమె అతడికి ఒక్క ముక్క కూడా ఏం చెప్పకుండా తిరిగి లండన్ వెళ్లిపోయింది.

విధి వారిని మళ్లీ ఒక చోట చేర్చింది
తన సొంతూరు లండన్ కి తిరిగి వెళ్లిన కొద్ది రోజుల తర్వాత మరో రిలేషన్ షిప్ లోకి రావడానికి వృద్ధురాలు ప్రయత్నించింది. అయితే ఆమె మనస్సులో మాత్రం ఇంకా స్పెయిన్ ఆమె యువకుడితో గడిపిన జ్ణాపకాలే మెదులుతూ ఉన్నాయి. 30 ఏళ్ల వయస్సు తమ మధ్య తేడా ఉన్నా కూడా తాను అతడితో ప్రేమలో పడ్డాను అని అర్థం చేసుకుంది వృద్ధురాలు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. అయితే ఆ యువకుడి జ్ణాపకాలను వెతుక్కుంటూ వృద్ధురాలు మళ్లీ స్పెయిన్ కి వెళ్లి తాము బస చేసిన హోటల్ కి వెళ్లింది. అయితే ఊహించని సర్ ఫ్రైజ్ ఆమె కళ్ల ముందు ఉంది. తాను ప్రేమించిన ఆ యువకుడు హోటల్ లోనే ఉండటం చూసి ఆమె ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ యువకుడు వృద్ధురాలిని హగ్ చేసుకోని 'నన్ను వదిలి ఎక్కడకు వెళ్లావ్' అని అడిగాడు. వెంటనే ఆ వృద్ధురాలు నీకు పెళ్లయిందా అని అతడిని అడిగింది. దీంతో అతడు అవును,ఇద్దరు పిల్లలు కూడా నాకు ఉన్నారు అని సమాధానమిచ్చాడు.
అయితే తాను భార్యతో విడాకులు తీసుకున్నాను అని చెప్పాక ఇద్దరూ సమయం వేస్ట్ చేకుండా మళ్లీ స్పెయిన్ లో కలిసి జీవించడం స్టార్ట్ చేశారు. లండన్ కి తిరిగొచ్చాక కూడా ఫోన్ లో ఆ యువకుడితో మాట్లాడుతుండేది. విధి వారిద్దరినీ మళ్ళీ ఒకచోట చేర్చింది కానీ అన్ని కథల మాదిరిగానే ఈ కథకు మధురమైన ముగింపు లేదు.
విధి ఆడిన వింత నాటకం
అతడితో కలిసి జీవించాలని అనుకుంటున్నాను అని,అతడు తనకు కొత్త జీవితాన్ని గడపడం నేర్పించాడని వృద్ధురాలు తన పిల్లలకు చెప్పగా..వారు ఇందుకు అంగీకరించలేదు. ఆ యువకుడు డబ్బు కోసమె నీతో సంబంధం కొనసాగిస్తున్నాడు..ఇవన్నీ ఇక్కడితో ఆపేస్తే మంచిదని వృద్ధురాలికి ఆమె పిల్లలు సూచించారు. ఈ వయస్సులో తన పిల్లలలో ఘర్ణణపూరిత వాతావరణం ఉండకూడదని భావించిన వృద్ధురాలు ఆ యువకుడితో సంబంధాన్ని కట్ చేసుకుంది,అతడితో కలిసి జీవించాలన్న కోరికను తనలోనే చంపేసుకుంది. కలిసి లేకున్నా సరే ఇద్దరూ ఇప్పటికీ ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు. దూరంగా ఉన్నా సరే ప్రేమను కనుగొనవచ్చని ఈ ఇద్దరూ ఫ్రూవ్ చేశారు.



Click it and Unblock the Notifications