Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Fathers Day 2024 Gift Ideas : ఫాదర్స్‌డే రోజు నాన్నకు ప్రేమతో ఈ గిఫ్ట్స్ ఇద్దామా..?
కళ్లముందు కనబడే దైవం నాన్న. ఆ పరేశ్వరుడిని సృష్టికి తండ్రైతే మనల్ని కన్నవాడు మన పరమేశ్వరుడు ఆయనే దైవం. అందుకే మాతృదేవో భవ, పితృ దేవోభవ అని అంటాం. నాన్న లేకపోతే జీవితమే లేనట్టుగా అనిపిస్తుంది. తల్లి ప్రేమ గురించి ఎంతో చెబుతారు కానీ కనబడని నాన్న గురించి చాలా తక్కువగా చెబుతారు. నాన్న కోపమే కనబడుతుంది కానీ దాని వెనక దాగివున్న ప్రేమ కనబడదు. అలాంటి నాన్నల గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడానికి 1910 నుంచి నాన్నల దినోత్సవం, ఫాదర్స్‌డే ను జూన్ నెల 3వ ఆదివారం రోజూ ప్రతీ సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాం.
ఈ 2024లో ఫాదర్స్ డేను జూన్ 16న జరుపుకుంటున్నాం. ఏమి ఇచ్చినా నాన్న రుణాన్ని అంత సులభంగా తీర్చుకోలేము. ఫాదర్స్ డే రోజు ప్రత్యేకంగా కొన్ని గిఫ్టులను ఏరికోరి వాటిని మీ తండ్రికి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని మీకు సలహా ఇస్తున్నాం. ఫాదర్స్‌డే రోజున ఇది మీ తండ్రికి ఒక చిన్న బహుమతిగా అనుకోవచ్చు.

మొబైల్ ఫోన్
నాన్నకు ఒక మంచి మొబైల్ ఫోన్‌ను చూసి గిఫ్ట్‌గా ఇవ్వండి. అందులో లేటెస్ట్ ఫీచర్స్ వుండేలా చూసుకోండి. ఈ మధ్య కొన్ని మొబైల్ ఫోన్స్‌లో హెల్త్ అలర్ట్స్ వున్నాయ్. బయట ఎండ ఎక్కువగా వున్నా ఈ మొబైల్స్ మనల్ని అలెర్ట్ చేస్తాయ్. అలాగే కొన్ని మొబైల్స్‌లో ఎమర్జెన్సీ అలారం కాలింగ్ సిస్టమ్ వుంటుంది. ఈ సమయంలో ఒక బటన్ నొక్కగానే అందులో మనకు కావాల్సిన దగ్గరివారికి వెంటనే కాల్ వెళ్తుంది. ఇలాంటి మంచి సేఫ్టీ ఫీచర్లు వున్న మొబైల్ ఫోన్‌ను గిఫ్టుగా బహూకరించండి.
ఫోటో ఫ్రేమ్
ఫోటో ఫ్రేమ్‌లు గిఫ్టుగా ఇవ్వడం చాలా పాత పద్ధతి అయినప్పటికీ చిన్నప్పుడు మన నాన్నతో కలిసి మనం దిగిన ఫోటోలను ఫ్రేమ్‌లో పెట్టి దాన్ని గిఫ్టుగా ఇచ్చినప్పుడు నాన్న చాలా సంతోషిస్తాడు. ఇది ఆయనకు ఒక పెద్ద సర్‌ప్రైజ్‌లా వుంటుంది.

తండ్రికి టైమ్ ఇవ్వడమే పెద్ద గిఫ్ట్
సంవత్సరానికి ఒకసారి ప్రేమతో నాన్న అని పిలిచి గిఫ్ట్ ఇచ్చి పక్కకు తప్పుకోవడం కాదు. ఆయనకు ప్రతీ రోజు కొంత సమయాన్ని ఇచ్చి, ఆయన బాగోగులను కనుక్కోవాలి. మీరు బిజీగా వున్నా సరే నాన్న పక్కకు కూర్చొని ఆయన సమయానికి మందులు వేసుకుంటున్నాడా లేదు చూసుకోవాలి. ఇలా సమయం కేటాయించి నాన్నతో గడపడం వల్ల ఆయనకు అంతకన్నా పెద్ద గిఫ్ట్‌ను మీరు ఇవ్వలేరు.
షూస్
నాన్నకు మంచి క్వాలిటీ వున్న షూస్‌ను ఆర్డర్ చేయండి. ఆయనకు గిఫ్ట్ ఇచ్చే షూస్ లైట్‌వేయిట్‌తో మెత్తగా వుండేలా జాగ్రత్తలు తీసుకోండి. మంచి బ్రాండెడ్ షూస్‌ను మాత్రమే మీ నాన్నకు బహుమతిగా ఇవ్వండి.
ఫిట్‌నెస్ వాచ్
ఈ మధ్య మార్కెట్లో ఫిట్‌నెస్ వాచ్‌లు చాలా వచ్చాయ్. వాటిని చేతికి పెట్టుకుంటే పల్స్ రేటు, హార్ట్ బీటు లాంటి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్‌లను మనకు ఇస్తుంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా వుంటే కూడా ఆ వాచ్ మనల్ని అలెర్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి వాచ్‌లు చాలా ఖరీదుతో వుంటాయ్. తండ్రికి ఇస్తున్న గిఫ్ట్ కాబట్టి మంచి బ్రాండె కు సంబంధించిన ఫిట్‌నెస్ వాచ్‌ను మాత్రమే గిఫ్ట్‌గా ఇవ్వండి.



Click it and Unblock the Notifications