Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఫాదర్స్ డే శుభాకాంక్షలు.. మనకోసం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న..!
మన జీవితంలో నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే వుంటారు. తల్లి మాటల్లో ధైర్యం నింపితే తండ్రి చేతలతో ధైర్యాన్ని నింపుతాడు. నాన్న మనకు జన్మను మాత్రమే ఇవ్వడు మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాడు. మన మొదటి గురువు మొదటి స్నేహితుడు కూడా నాన్నే. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ కావచ్చు కానీ మనకు ప్రపంచాన్ని పరిచయం చేసింది మాత్రం నాన్నే. నాన్న గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నపై ప్రత్యేక కొటేషన్లను మీకోసం అందిస్తున్నాము. వీటిలో మీకు నచ్చిన వాటిని తీసుకొని ఫాదర్స్‌డే రోజున నాన్నకు శుభాకాంక్షలు తెలపండి.
1. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నాన్న ముందు నువ్వు చిన్నవాడివేనన్న విషయాన్ని మరిచిపోవద్దు.
2. నన్ను భూజం తట్టి ప్రోత్సహించింది నాన్నే, ఓడిపోయినప్పుడు కూడా అదే భుజం తట్టి ధైర్యం చెప్పింది కూడా నాన్నే.

3. సాధారణ మనుషుల్లో కూడా సాహసమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నాన్నలు మాత్రమే.
4. నా తండ్రితో సమానమైన వ్యక్తిని నేనెప్పుడూ కలుసుకోలేదు, మా నాన్నను ప్రేమించినంతగా నేను ఇంకెవ్వరినీ ప్రేమించలేదు.
5. ఎవ్వరికీ ఇవ్వలేని అత్యంత గొప్ప బహుమతిని మా నాన్న నాకు ఇచ్చాడు. ఆయనకు నాపైన ఆ నమ్మకం వుంది.
6. తండ్రి ఎవ్వరైనా కావచ్చు కానీ నాన్న అయ్యే అవకాశం కొందరికే వుంటుంది. అందుకే నేను మిమ్మల్ని నాన్న అంటాను. మీరు నా జీవితంలో చాలా స్పెషల్. మీరు నాకు జీవత ఆటను చూపించారు, ఎలా ఆడాలో కూడా నేర్పించారు.
7. ప్రేమకు మరో ప్రతిరూపం నాన్న
8. ఒకే ఒక స్నేహితుడిని జీవిత కాలం పాటు నమ్మవచ్చు అంటే అది ఎవరో కాదు, మా నాన్నే.
9. కొంత మందికి హీరోలపై నమ్మకం వుండదు, ఎందుకంటే వారు మా నాన్నను కలుసుకోలేదు కాబట్టి.
10. నాన్న పెంపకంలో కఠినత్వం వున్నా అది మన రేపటి భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది. అలాంటి నాన్న దేవుడికంటే మిన్న అనడంలో ఆశ్చర్యం లేదు.
11. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే.. నాన్నా పాతికేల్లు మోస్తాడు..!
12. తను ఓడిపోయినా సరే నిన్ను మాత్రం అనుక్షణం గెలిపించడానికి చూసేవాడు నాన్న ఒక్కడే..!
13. బయట నాన్న కోపంగా కనిపిస్తాడు.. కానీ వెనక ఎవ్వరికీ కనిపించని ప్రేమ వుంటంది..!
14. నాన్న మనకు కేవలం ఇంటి పేరును మాత్రమే కాదు, సమాజంలో మంచి పేరును కూడా ఇస్తాడు..!
15. మనకు ఏ గుర్తింపూ రాకపోయినా మనల్ని గొప్పగా గుర్తించేది నాన్న ఒక్కడే..!
16. మనకు జీవితంలో చాలా మంది స్పూర్తి ప్రదాతలు వుంటారు. కానీ వారందరిలో మొదటి వరుసలో వుండేది మాత్రం నాన్నే..!
17. నిరంతరం మన కోసం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు నాన్న..!
18. నాన్న గొప్పతనం అర్థం అయ్యేలోపే.. మన తప్పుల్ని పట్టే కొడుకులు సిద్ధంగా వుంటారు..!
19. కన్న తల్లి దూరమైతే ఎవ్వరినైనా అమ్మా అని పిలవచ్చు..! కానీ నాన్న దూరమైతే మాత్రం ఆ పిలుపుకు ఎవ్వరు అర్హులు కారు నాన్న తప్ప..!
20. అమ్మ ప్రేమ సముద్రపు అలలాంటిది.. కంటికి కనబడుతుంది..! కానీ నాన్న ప్రేమ మాత్రం నడి సముద్రం లాంటిది కంటికి కనిపించదు..!
21. కష్టం వస్తే దేవుడు గుర్తుకు వస్తాడో తెలియదు కానీ నాన్న మాత్రం గుర్తుకు వస్తాడు..!



Click it and Unblock the Notifications